Bread Masala : సాయంత్రం స్నాక్స్‌గా బ్రెడ్ మసాలా.. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు-how to prepare bread masala for snacks ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bread Masala : సాయంత్రం స్నాక్స్‌గా బ్రెడ్ మసాలా.. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు

Bread Masala : సాయంత్రం స్నాక్స్‌గా బ్రెడ్ మసాలా.. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు

Anand Sai HT Telugu
Feb 05, 2024 03:30 PM IST

Bread Masala Recipe : బ్రెడ్ మసాలా ఎప్పుడైనా తిన్నారా? చాలా టేస్టీ రెసిపీ ఇది. చేయడం కూడా చాలా సింపుల్. సాయంత్రంపూట స్నాక్స్ లాగా తినేందుకు బాగుంటుంది.

బ్రెడ్ మసాలా
బ్రెడ్ మసాలా

స్కూల్ నుంచి వచ్చిన పిలల్లు.. సాయంత్రం పూట ఏదేనా తినేందుకు కావాలని అడుగుతారు. గరంగరంగా కారం కారంగా తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అయితే ఎక్కువ టైమ్ తీసుకునే స్నాక్స్ చేయడం కంటే.. చిటికెలో చేసే స్నాక్స్ బెస్ట్ ఆప్షన్. అందుకోసమే మీ పిల్లల కోసం మసాలా బ్రెడ్ స్నాక్స్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చేయడం కూడా చాలా సులువు.

మీ పిల్లలు సాయంత్రం స్నాక్స్ కారంగా తినాలని అడిగితే బ్రెడ్ మసాలా బెటర్. కేవలం మీ ఇంట్లో బ్రెడ్ ఉంటే సరిపోతుంది. ఈ బ్రెడ్ మసాలా మంచి సాయంత్రం స్నాక్‌గా పని చేస్తుంది. ప్రధానంగా ఇది పిల్లలు తినదగినది. ఆకలిగా ఉన్నప్పుడు బ్రెడ్ తో టోస్ట్ చేసే బదులు ఇలా మసాలా దినుసులతో తింటే మరింత రుచిగా ఉంటుంది. బ్రెడ్ మసాలా చేయడం కూడా ఈజీనే. ఎలా చేయాలో చూద్దాం..

బ్రెడ్ మసాలాకు కావాల్సిన పదార్థాలు

బ్రెడ్ – 5(కట్ చేసుకోవాలి), నూనె – 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర – 1/2 టీస్పూన్, పచ్చిమిర్చి – 1 (సన్నగా తరిగినవి), ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినవి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, టొమాటో – 1 (సన్నగా తరిగినవి), పసుపు పొడి - 1/4 tsp, కాశ్మీరీ కారం - 1 tsp, గరం మసాలా - 1 tsp, ఉప్పు - రుచి ప్రకారం, టొమాటో కెచప్ - 4 టేబుల్ స్పూన్లు

బ్రెడ్ మసాలా తయారీ విధానం

ముందుగా పాన్‌ పెట్టి అందులో 1 టేబుల్‌ స్పూన్‌ నూనె పోసి వేడి అయ్యాక బ్రెడ్‌ ముక్కలను వేసి సన్నటి మంటపై బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

తర్వాత అదే ఓ గిన్నెలో మిగిలిన నూనె పోసి వేడయ్యాక జీలకర్ర వేసి తాలింపు చేసి పచ్చిమిర్చి వేసి వేయించాలి.

ఇప్పుడు ఉల్లిపాయ వేసి రంగు మారే వరకు వేయించి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి.

తర్వాత టొమాటో, పసుపు, కశ్మీరీ కారం, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి.

తర్వాత టొమాటో కెచప్ వేసి కలుపుకోవాలి.

చివరగా బ్రెడ్ ముక్కలను వేసి బాగా తిప్పితే రుచికరమైన బ్రెడ్ మసాలా రెడీ. పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు.

Whats_app_banner