Bottle Gourd Juice : బరువు తగ్గేందుకు సొరకాయ రసం ఎలా తయారు చేయాలి?-how to prepare bottle gourd juice for weight loss ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  How To Prepare Bottle Gourd Juice For Weight Loss

Bottle Gourd Juice : బరువు తగ్గేందుకు సొరకాయ రసం ఎలా తయారు చేయాలి?

Anand Sai HT Telugu
Nov 20, 2023 02:00 PM IST

Bottle Gourd Juice For Weight Loss : బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. సహజ పద్ధతిలో తగ్గితే ఆరోగ్యానికి మంచిది. అందులో భాగంగా సొరకాయ రసం తయారు చేసి తాగండి.

సొరకాయ రసం
సొరకాయ రసం (unsplash)

బరువును నియంత్రించడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సొరకాయ రసం చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందొచ్చు. సొరకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, ఐరన్, బోలేట్, మెగ్నీషియం, జింక్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. నీటిశాతం కూడా ఇందులో అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మీ పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. కర్రీలా చేసుకుని తినొచ్చు. దీన్ని జ్యూస్‌గా తాగడం వల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయని మీకు తెలుసా?

ట్రెండింగ్ వార్తలు

సొరకాయ రసం తాగడం వల్ల మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు తగ్గాలనుకువారు.. దీనిని తాగొచ్చు. చేసేందుకు కూడా చాలా సులభంగా ఉంటుంది. సొరకాయ రసం తాగితే మంచి ఫలితాలు వస్తాయి. యూరిన్ బ్యాండేజ్, వాటర్ ఇరిటేషన్, వాటర్ బ్యాండేజ్ బాగా నయమవుతాయి. దీనిని ఎలా తయారు చేయాలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు

ఒక సొరకాయ, 1/2 tsp జీలకర్ర పొడి. 1/2 tsp నల్ల మిరియాల పొడి, అల్లం ముక్క, 2 టీస్పూన్లు నిమ్మరసం, పుదీనా ఆకులు, ఒక గ్లాసు నీరు, ఉప్పు, ఐస్ క్యూబ్స్ (అవసరమైతే.

సొరకాయ రసం తయారు చేసే విధానం

సొరకాయ రసం సిద్ధం చేయడానికి, ముందుగా, ఒక సొరకాయ తీసుకోండి. పైన పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరోవైపు పుదీనా ఆకులను కడిగి మెత్తగా చేయాలి.

సొరకాయను జీలకర్ర పొడి, ఎండుమిర్చి, అల్లం ముక్కలతో బాగా గ్రైండ్ చేయండి.

కొంచెం ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి. తురిమిన సొరకాయ రసానికి నీటిని జోడించండి.

ఈ రసాన్ని ఫిల్టర్ చేసి ఓ గిన్నెలో పోసి దానిపై కావాలనుకుంటే రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేస్తే పోషక విలువలున్న సొరకాయ రసం రెడీ. దీన్ని తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు కూడా తగ్గుతుంది.

ఉదయం టీ, కాఫీలకు బదులుగా సొరకాయ రసం తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇది రుచిగా అనిపించకపోవచ్చు. కానీ ఆరోగ్యానికి మాత్రం మంచిది. యూరినరీ ఇన్ఫెక్షన్ సమస్య, నొప్పితో ఉంటే సొరకాయ రసం ఉపయోగపడుతుంది. ఖాళీ కడుపుతో సొరకాయ రసం తాగితే శరీరానికి తాజాదనం వస్తుంది. ఇందులో 98 శాతం నీరు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. శరీరం నుంచి టాక్సిన్స్ తొలగిస్తాయి. మలబద్ధకంతో బాధపడేవారికి హోం రెమెడీలాగా పనిచేస్తుంది.

సొరకాయ రసంతో బరువు తగ్గడమే కాదు.. చర్మంపై ముడతలు, మచ్చలు ఏర్పడకుండా ఉంటాయి. లివర్ శుభ్రం అవుతుంది. శరీరంలో వ్యర్థాలు బయటకు పోతాయి. జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

WhatsApp channel