Aloo Poori Recipe : అల్పాహారంలోకి ఆలూ పూరీ.. కొత్త రకం రుచి.. టేస్ట్ చేసేయండి-how to prepare aloo poori recipe for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Aloo Poori Recipe : అల్పాహారంలోకి ఆలూ పూరీ.. కొత్త రకం రుచి.. టేస్ట్ చేసేయండి

Aloo Poori Recipe : అల్పాహారంలోకి ఆలూ పూరీ.. కొత్త రకం రుచి.. టేస్ట్ చేసేయండి

Anand Sai HT Telugu

Aloo Poori Recipe In Telugu : అల్పాహారానికి పూరీ తినడం కొందరికీ అలవాటు ఉంటుంది. అయితే ఈ పూరీని చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఆలూ పూరీ తయారు చేసి తినండి. చాలా టేస్టీగా ఉంటుంది.

ఆలూ పూరీ

డజన్ల కొద్దీ అల్పాహార వంటకాలు ఉన్నాయి. అందులో పూరీ ఒకటి. ఈ పూరీలో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి. అలాగే పూరీ అంటే అందరికీ నచ్చే వంటకం. ఎందుకంటే ఉదయం పూట ఏదైనా హోటల్‌లోకి వెళ్లినప్పుడు తప్పనిసరిగా పూరీ ఉంటుంది. అది చూడగానే తినాలి అనిపిస్తుంది.

ఈ పూరీని ఇష్టపడని వారు ఉండరు. మైదాతో సులభంగా చేసుకునే ఈ రెసిపీని అందరూ ఇష్టపడతారు. అయితే ఈ పూరీలోని డజన్ల కొద్దీ వెరైటీలలో కొన్నింటిని మాత్రమే రుచి చూశాం. ఈ రోజు మనం బంగాళదుంప పూరీ గురించి తెలుసుకుందాం.

ఆలూ పూరీని తింటే సాధారణ పూరీ కంటే రుచిగా ఉంటుంది. ఇది చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఈ పూరీతో కొబ్బరి చట్నీ రుచిని రెట్టింపు చేస్తుంది. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి? ఆలూ పూరీ చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటి? పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

ఆలూ పూరీ చేయడానికి కావలసిన పదార్థాలు

మైదా పిండి - 200 గ్రాములు, బంగాళదుంపలు - 2, గోధుమ పిండి కొద్దిగా, ఉప్పు సరిపడేంత, పసుపు కొద్దిగా, కొత్తిమీర, నూనె, మిరియాల పొడి కొంచెం.

ఆలూ పూరీ తయారీ విధానం

ముందుగా బంగాళదుంపను ఉడికించాలి. తర్వాత పై తొక్క తీసి మెత్తగా పొడి చేసుకోవాలి. కుక్కర్‌లో వేస్తే బంగాళదుంపలు మెత్తగా మారుతాయి.

మైదా పిండిని బంగాళదుంప పొడికి కలపండి. తర్వాత కొత్తిమీర, ఉప్పు, కొంచెం పసుపు, మిరియాల పొడి, నూనె వేసి కలపాలి. కొద్దిగా నీరు వేసి కలపాలి. బంగాళదుంపలు చపాతీ పిండిలా మెత్తగా అయ్యేవరకు కలపాలి.

దీని తరువాత 5 నుండి 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఈ పిండిని పక్కన పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేయాలి. ఆ పిండిని తీసుకుని దానికి కొద్దిగా నూనె రాయాలి.

పూరీలు మాదిరిగా తయారు చేసుకోవాలి. తర్వాత పూరీని నూనెలో వదలండి. మంట తక్కువగా ఉంచండి. ఈ పూరీని రెండు వైపులా వేడి చేయండి. మీకు నచ్చే ఆలూ పూరీ రెడీ.

ఈ పూరీలోకి కొబ్బరి చట్నీ బాగుంటుంది. ఈ చట్నీ చేయడం కూడా చాలా సులభం. ముందుగా కొబ్బరిని మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత పాత్రలో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, అవసరమైతే ఎండు మిర్చి, కాస్త పసుపు, చిటికెడు ఇంగువ వేసి వేగించాలి. తర్వాత మిక్సీ పట్టిన కొబ్బరి తురుమును వేసుకుని కలపాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసి కలిపితే కొబ్బరి చట్నీ రెడీ.