Aloo Gobi Masala Curry : ఆలూ గోబీ మసాలా కర్రీ.. లంచ్‌లోకి లాగించేయండి-how to prepare aloo gobi masala curry in catering style ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  How To Prepare Aloo Gobi Masala Curry In Catering Style

Aloo Gobi Masala Curry : ఆలూ గోబీ మసాలా కర్రీ.. లంచ్‌లోకి లాగించేయండి

Anand Sai HT Telugu
Nov 04, 2023 11:15 AM IST

Aloo Gobi Masala Curry Recipe : గోబీ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీనితో మసాలా కర్రీ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఇంట్లో ఎన్ని సార్లు ఆలూ కర్రీ తిన్నా మనకు క్యాటరింగ్‌లో వేసే ఆలు కర్రీనే నచ్చుతుంది. అసలు క్యాటరింగ్‌ కర్రీస్‌ అన్నీ భలే రుచిగా ఉంటాయి కదా. ఆ టేస్ట్‌ వాళ్లకు ఎలా వస్తుందో అని మనం తెగ ఆలోచిస్తాం. ఈరోజు కరెక్టుగా క్యాటరింగ్ స్టైల్‌లోనే ఆలూ గోబీ మసాల కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందా. ఒక్కసారి తిన్నారంటే.. అస్సలు వదిలిపెట్టరు. ఇక లేట్‌ చేయకుండా క్యాట‌రింగ్ స్టైల్‌లో ఆలూ గోబి మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందామా.

ట్రెండింగ్ వార్తలు

ఆలూ గోబి మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

జీడిప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్

పుచ్చగింజ‌లు – అర టేబుల్ స్పూన్

ఎండు కొబ్బ‌రి ముక్క‌లు -అర టీ స్పూన్

గ‌స‌గ‌సాలు -ఒక టీ స్పూన్

నూనె – ఒక టేబుల్ స్పూన్

క్యాలీఫ్లవర్ ముక్కలు -ఒక క‌ప్పు

బంగాళాదుంప ముక్కలు – ఒక క‌ప్పు

బిర్యానీ ఆకు – 1

దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క

లవంగాలు – 2

యాల‌కులు – 2

చిన్నగా త‌రిగిన ఉల్లిపాయ ముక్కలు – ముప్పావు క‌ప్పు

త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2

క‌రివేపాకు – ఒక రెమ్మ,

అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీస్పూన్

ఉప్పు – త‌గినంత‌

కారం – ఒక టీ స్పూన్

జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్

ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్

ట‌మాట – 1

నీళ్లు – ముప్పావు క‌ప్పు

క‌సూరిమెంతి – ఒక టీ స్పూన్

గ‌రం మ‌సాలా – అర టీస్పూన్

త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

ఆలూ గోబి మ‌సాలా క‌ర్రీ ఎలా చేయాలంటే..

జార్‌లో జీడిప‌ప్పు, పుచ్చగింజ‌లు, ఎండుకొబ్బరి ముక్కలు, గ‌స‌గ‌సాలు వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ చేసుకోండి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడ‌య్యాక క్యాలీఫ్లవర్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు వేసి వేయించాలి. వీటిని స‌గానికి పైగా వేయించిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని ప‌క్కకు పెట్టండి. త‌రువాత అదే క‌ళాయిలో మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్కలు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి.

త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఉప్పు, కారం, ప‌సుపు, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి వేసి బాగా క‌ల‌పాలి. ట‌మాటాను పేస్ట్ లా చేసుకుని వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకుని పేస్ట్ వేసి బాగా కలపండి. ఇప్పుడు వేయించిన క్యాలీఫ్లవర్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు వేసి క‌ల‌పుకోవాలి. గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ముక్కలు మెత్తగా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. ఫైనల్‌గా గ‌రం మ‌సాలా, మెంతి, కొత్తిమీర వేసి మ‌రో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఆలూ గోబి మ‌సాలా క‌ర్రీ రెడీ. దీనిని అన్నంలో, చ‌పాతీలో, రోటీలో మీకు ఎలా కావాలంటే అలా లాగించేయొచ్చు. ఎలా తిన్నా.. టేస్ట్‌ ఉంటుంది నెక్ట్స్‌ లెవల్‌ అంతే. గోబీని ఇష్టపడని వాళ్లు కూడా ఇలా చేసి పెడితే లొట్టలేసుకుంటూ తింటారు.

WhatsApp channel