Aloo Dosa : ఆలూ దోసెను ఇలా రెండు రకాలు తయారు చేసుకోండి
Aloo Dosa : దోసెను ఎప్పుడూ ఒకే విధంగా తినేవారు కొత్తగా ట్రై చేయండి. ఆలూతో దోసె తయారుచేసి తినండి చాలా రుచిగా ఉంటుంది.
బియ్యప్పిండి, ఉడికించిన బంగాళదుంపలు రుచికరమైన దోస చేయడానికి సరిపోతుంది. మీరు దీనికి పన్నీర్ వేసి, ఉల్లిపాయను జోడించవచ్చు. లేదంటే సాదా దోస చేయవచ్చు. మీకు కావలసిన విధంగా రుచిగా తయారు చేసుకోవచ్చు. ఆలూ దోసె చేసేందుకు సమయం ఎక్కువగా పట్టదు. ఈజీగా తయారు చేయవచ్చు. ఈ ఆలూ దోస రెసిపీని ఒకసారి చూద్దాం.. 2 రకాల ఆలూదోసా రెసిపీని గురించి తెలుసుకోండి..
కావాల్సిన పదార్థాలు
1 కప్పు ఉడికించిన బంగాళదుంపలు, 1 కప్పు బియ్యం పిండి, కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, 2-3 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్లు పెరుగు.
తయారీ విధానం
ఉడికించిన బంగాళాదుంపలు, పెరుగు వేసి బాగా కలపాలి. ఆపై అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి, బియ్యప్పిండిలో నీరు వేసి, ఉప్పు వేసి కలపాలి. దోస పిండిలో వేయాలి. బాణలిలో నూనె వేసి దోసె పిండి వేసి గుండ్రంగా చేసి మూతపెట్టి 3-4 నిమిషాలు అలాగే ఉంచి దోసె తీసేయాలి.
దోసె పాన్‌కి అంటుకుంటే ఏం చేయాలి?
ఇంకా కొంచెం బియ్యప్పిండి వేసి కలిపితే దోసె కరకరలాడుతుంది. మీరు దీన్ని స్వీట్ కాంబినేషన్‌లో ఆస్వాదించవచ్చు, దీన్ని రుచికరమైన చట్నీతో తినవచ్చు. దీన్ని చట్నీ లేదా వెజిటబుల్ కుర్మాతో కూడా లాగించేయవచ్చు. ఇది మామిడి రసంతో కూడా చాలా రుచిగా ఉంటుంది.
ఈ దోసె కోసం బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదు. అరగంటలో దోస పిండి సిద్ధంగా పెట్టుకోవచ్చు. పైన ఉల్లిపాయలు చల్లితే ఈ దోసె సూపర్.
కరకరలాడే బంగాళదుంప దోసె
మీకు దోసె క్రిస్పీ కావాలంటే ఇలా దోసె చేసుకోండి, చాలా క్రిస్పీగా రుచిగా ఉంటుంది.
కావలసినవి
బంగాళదుంపలు 3 కప్పులు, నీరు ½ కప్పు, బియ్యం పిండి 1/4 కప్పు, రవ్వ కొంచెం, ఉప్పు రుచికి తగ్గట్టుగా
ఉడికించిన బంగాళదుంపలను గ్రైండ్ చేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పెద్ద గిన్నెలో వేసి, తర్వాత బియ్యప్పిండి, రవ్వ, రుచికి సరిపడా ఉప్పు (అర చెంచా చాలు, కావాలంటే ఇంకా వేసుకోవచ్చు) వేసి కలపాలి. 10 నిమిషాలు అలాగే ఉంచి, పాన్ వేడి చేసి దోస చేయండి.
మీరు దానికి తరిగిన ఉల్లిపాయను వేసి, దానికి మిక్స్డ్ వెజ్ వేయవచ్చు. ఈ దోసను చట్నీతో సర్వ్ చేయవచ్చు. ఈ దోసెను మెత్తగా లేదా క్రిస్పీగా చేసుకోవచ్చు. మీ ఇంట్లోని అందరూ దీనిని ఇష్టపడుతారు.