అక్షయ తృతీయ రోజు బంగారం కొనే ఆచారం ఎన్నో ఏళ్లుగా వస్తుంది. అయితే ఇప్పుడు బంగారం ధరలు పెరగడంతో చాలామంది ఏం కొనాలో తెలియక ఆలోచిస్తున్నారు. కొంతమంది ఇరవైవేల రూపాయలు బడ్జెట్లోనే ఏదైనా బంగారు వస్తువు తీసుకునేందుకు ప్లాన్ చేస్తారు. అలాంటివారి కోసం ఇక్కడ మేము కొన్ని ఐడియాలు ఇస్తున్నాము. అక్షయ తృతీయ రోజు బంగారు నాణేలు లేదా మిక్స్ అండ్ మ్యాచ్ ఆభరణాలు వంటివి తీసుకోవచ్చు.
బంగారం సాంప్రదాయకంగా వస్తున్న ఆభరణం. అలాగే ప్లాటినం, వెండి కూడా ఎంతో మంచిది. కేవలం బంగారు ఆభరణాలు మాత్రమే అక్షయ తృతీయ రోజు కొనాలని లేదు. వెండితో చేసిన వస్తువులు కూడా కొనవచ్చు. మీకు రూ.20,000 బడ్జెట్లోనే వెండి వస్తువు కచ్చితంగా వస్తుంది. అలాగే వెండికి పైన బంగారం పూత పూసిన వస్తువులు కూడా లభిస్తున్నాయి. ఇవి 20వేల బడ్జెట్లోనే మీకు లభిస్తాయి. వెండిపై బంగారం పూత పూసిన గాజులు, చెవి రింగులు, ఉంగరాలు వంటివి రూ.20 వేలల్లో దొరుకుతాయి. ఇలాంటివి ప్లాన్ చేసుకోవడం మంచిది.
బంగారు నాణేలు కూడా ప్రసిద్ధ బంగారు పెట్టుబడిగా చెప్పుకుంటారు. ముఖ్యంగా తక్కువ బడ్జెట్లో ఇలా బంగారు నాణాలు కొంటె మంచిది. వీటిని మళ్లీ అవసరమైనప్పుడు ఇచ్చి బంగారు వస్తువులను తీసుకోవచ్చు. మీకు రూ.20,000 కు రెండు గ్రాముల బంగారు వస్తువులు తీసుకునే అవకాశం ఉంది.
రెండు గ్రాముల్లోనే బంగారు చెవిపోగులు దొరుకుతూ ఉంటాయి. వీటిని కూడా కొనేందుకు ప్లాన్ చేయవచ్చు. రోజువారీ చెవి రింగులు ఇరవై వేల రూపాయల బడ్జెట్లో లభిస్తాయి. వీటిలో ఆఫీస్ వేర్ కూడా అధికంగా ఉంటాయి. అలాగే పిల్లలకు చెవిపోగులు కూడా 20వేలలోనే లభిస్తాయి. అలాగే చైన్ లో వేసే పెండెంట్లు కూడా 20వేల రూపాయల్లో మీకు వస్తాయి.
చాలా సంస్థలు ఆఫర్లు, డిస్కౌంట్లు వంటివి ఇస్తూ ఉంటాయి. వాటిని బట్టి మీరు చూసుకొని వెళ్లడం మంచిది. అలాగే అక్షయ తృతీయనాడు కొనేవారు ఎలాంటి బేరం ఆడకుండా కొనేస్తూ ఉంటారు. నిజానికి బంగారు షాపులో కూడా బేరం ఆడాల్సిన అవసరం ఉంది. బంగారు షాపులో కూడా ధర తగ్గించే ఛాన్సులు అధికంగానే ఉంటాయి. కానీ చాలామంది ఆ విషయం తెలియక బంగారాన్ని వారు చెప్పిన ధరకే కొని తీసుకొస్తూ ఉంటారు. మొత్తం ఫైనల్ ప్రైస్ పై ఖచ్చితంగా మీరు బేరం ఆడవచ్చు.
ఇప్పటికే ఎన్నో బంగారు ఆభరణాల సంస్థలు 10,000 నుంచి 20 వేల రూపాయలు బడ్జెట్లో వచ్చే చెవి పోగులను, ఉంగరాలను, పెండెంట్లు మార్కెట్లో దించింది. కాబట్టి మీరు రూ.20,000కి ఏం బంగారం వస్తుంది... అనుకోకుండా... మీకు నచ్చిన వస్తువును కొని తెచ్చుకోవచ్చు.
బంగారాన్ని 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లుగా చెబుతారు. మీరు 18 క్యారెట్ల బంగారాన్ని కూడా అక్షయ తృతీయ రోజు కొంటే 20,000 బడ్జెట్లోనే వస్తువులు వస్తాయి.
మీరు రెండు గ్రాములలో బంగారు వస్తువులు తీసుకుంటే మీకు 20వేల రూపాయల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తరుగు, మజూరీ, వ్యాట్ వంటివన్నీ కలుపుకుంటే ఇరవై వేల రూపాయలకు చేరుకుంటుంది. కాబట్టి బంగారం ధరను అర్థం చేసుకొని తగినట్టు మీరు చిన్న బంగారు వస్తువులు కొనేందుకు ప్లాన్ చేయండి. ముఖ్యంగా పిల్లలకు రూ.20,000లో మంచి కలెక్షన్ లభిస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్