Watermelon Secrets | ఎర్రగా, తియ్యగా ఉండే పుచ్చకాయను కోయకుండానే ఎలా గుర్తించవచ్చు?-how to pick a red juicy watermelon here are the secret tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  How To Pick A Red Juicy Watermelon, Here Are The Secret Tips

Watermelon Secrets | ఎర్రగా, తియ్యగా ఉండే పుచ్చకాయను కోయకుండానే ఎలా గుర్తించవచ్చు?

HT Telugu Desk HT Telugu
Apr 22, 2023 11:11 AM IST

Watermelon Secrets: పుచ్చకాయలలో ఎర్రని, తియ్యని పుచ్చకాయను పండును కనుగొనేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అ రహస్యాలను మీరు తెలుసుకోండి..

Watermelon Secrets:
Watermelon Secrets: (istock)

How To Pick a Red Watermelon: పుచ్చకాయ లోపల ఎర్రగా, జ్యూసిగా ఉన్నప్పుడే అది తియ్యని రుచిని కలిగి ఉంటుంది. ఇలాంటి పుచ్చకాయలోనే పోషకాలు దట్టంగా ఉంటాయి. పుచ్చకాయ పండినప్పుడు, అది లైకోపీన్‌తో సహా ఇతర అనేక సహజ యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. ఇది గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్‌ల నుండి కూడా రక్షణ అందించే ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మరి అన్ని పుచ్చకాయలలో ఎర్రని, తియ్యని పుచ్చకాయను కనుగొనడం ఎలా. అందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. మీరు పుచ్చకాయను కోయకుండానే అది లోపల ఎర్రగా ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఆ చిట్కాలు (Watermelon Secrets) ఏంటో మీరూ తెలుసుకోండి.

ఏకరీతి ఆకారం

పుచ్చకాయలు వివిధ పరిమాణాలు, ఆకారాలలో వస్తాయి. ఇందులో కొన్ని గుండ్రంగా ఉంటాయి, మరికొన్ని ఓవల్ ఆకారంలో ఉంటాయి. అయితే ఇక్కడ గుండ్రంగా ఉన్నా, అండాకారంలో ఉన్నా పర్వాలేదు కానీ పండు ఆకారం మొత్తం ఏకరీతిగా ఉండాలి. ఎక్కువ తక్కువలు ఉండకూడదు.

బరువుగా ఉండాలి

పండిన పుచ్చకాయ దాని పరిమాణానికి తగినట్లుగా బరువును కలిగి ఉండాలి ఉండాలి. చేతిలో పట్టుకున్నప్పుడు బరువుగా అనిపించాలి. నీరు, గుజ్జు ఎక్కువగా ఉన్నది ఇలా బరువుగా ఉంటుంది. కాబట్టి పుచ్చకాయ బరువుగా ఉంటే అది నీటితో నిండి ఉందని, మరింత జ్యూసియర్ అని అర్థం.

పసుపు మచ్చలు కలిగి ఉండాలి

మీరు పుచ్చకాయను అన్నివైపులా తిప్పి చూస్తే, దానిపై పసుపు రంగు మచ్చ కనిపించాలి. దీనిని ఫీల్డ్ స్పాట్ లేదా గ్రౌండ్ స్పాట్ అని కూడా పిలుస్తారు. పండుపై పసుపు మచ్చలు ఉంటే అది తీగపైనే పక్వానికి వచ్చిందని, అది తియ్యటి పండు అని గుర్తించవచ్చు. దీనికి విరుద్ధంగా, తెల్లటి మచ్చ ఉంటే అది సరిగ్గా పండలేదని అర్థం. ఇలాంటి పండులో జ్యూస్ తక్కువ, రుచి చప్పగా ఉంటుంది.

లోతైన ధ్వనిని వినండి

పండిన పుచ్చకాయను కనుగొనడానికి మరొక మార్గం పైభాగంలో తట్టడం. పండిన పుచ్చకాయను తట్టినపుడు అది లోతైన ధ్వనిని కలిగి ఉంటుంది, దాని తోలు మందంగా ఉంటుంది. అదేసమయంలో అతిగా పండిన తోలు పలుచగా ఉంటుంది, దానిని తట్టినపుడు వచ్చే శబ్దం బోలు శబ్దాన్ని కలిగి ఉంటుంది.

పుచ్చకాయపై రంధ్రాలు గమనించడి

పుచ్చకాయను పూర్తిగా కొనాలి, ముక్కలు చేసినది కొనకూడదు. కొంతమంది విక్రేతలు పుచ్చకాయను పండించడానికి సూదితో ఇంజెక్షన్లు చేస్తారు. కాబట్టి అలాంటి రంధ్రాలు ఉన్నాయోమో గమనించి, రంధ్రాలు లేని పండును తీసుకోండి.

పుచ్చకాయను ఇంగ్లీషులో వాటర్‌మిలన్ (Watermelon) అంటారు . అంటే దీనిలో పేరుకు తగినట్లుగా 91 శాతం నీరే ఉంటుంది. కాబట్టి ఈ పండు వేసవిలో తినడం చాలా మంచిది. ఇందులో కేలరీలు తక్కువ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పుచ్చకాయ తింటే కడుపు నిండుతుంది, దాహం తీరుతుంది, మంచి పోషకాలు శరీరానికి అందుతాయి.

WhatsApp channel

సంబంధిత కథనం