Wheat Khichdi : హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. గోధుమలతో కిచిడీ.. తిన్నారంటే వదిలిపెట్టరు
Wheat Khichdi Recipe : గోధుమలు ఆరోగ్యానికి మంచివి. అయితే వీటితో కిచిడీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా చేసేయెుచ్చు.
బ్రేక్‌ఫాస్ట్ అంటే.. మనం రోజులో మొదట తినేది.. బ్రేక్‌ఫాస్ట్ ఫుల్‌గా తింటేనే రోజంతా యాక్టివ్‌గా ఉంటాం. అలా అని అన్‌హెల్తీవి తింటే.. ఆరోగ్యం పాడవుతుంది. ఎప్పుడూ తినే ఇడ్లీ, దోశ, వడ, ఉప్మానే కాకుండా.. కిచిడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కిచిడీని రకరకాలుగా చేస్తారు. ఈరోజు హెల్తీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ కిచిడీ వారానికి ఒక్కసారి తిన్నా చాలు.. బాడీకి కావాల్సిన పోషకాలు అందుతాయి.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
కిచిడీ తయారు చేసేందుకు కావల్సిన పదార్థాలు
దంచిన గోధుమలు – 1 కప్పు
పొట్టుతో ఉన్న పెసలు – 1 కప్పు
మెంతి ఆకులు – 1 కప్పు
పొడి మెంతి – అర టీస్పూన్
బీన్స్ – గుప్పెడు
పచ్చి బఠానీలు – గుప్పెడు
క్యారట్ – 1 లేదా 2
పచ్చి మిరపకాయలు – 3
కరివేపాకు
ఆవాలు, జీలకర్ర, ఇంగువ
నల్ల మిరియాల పొడి
పసుపు
ఉప్పు
నెయ్యి
కిచిడీ తయారు చేసే విధానం
ముందుగా కుక్కర్ తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో నెయ్యి వేయండి. నెయ్యి వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఆవాలు, జీలకర్ర, ఇంగువ, నల్ల మిరియాల పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కూరగాయలు వేయాలి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. దంచిన గోధుమలు, పెసలు వేసి 6 కప్పుల నీటిని పోయాలి. మీకు కిచిడీ ఇంకా గుజ్జులా కావాలంటే కొంచెం నీటిని ఎక్కువగా పోయవచ్చు.
ఇప్పుడు 3 విజిల్స్ వచ్చే వరకూ ప్రెషర్ కుక్కర్‍లో ఉడికించాలి. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే హెల్తీగా ఉండే కిచిడీ రెడీ. దీన్ని టమాటా చట్నీ, రైతాలతో తినవచ్చు. ఉదయాన్నే వేడి వేడిగా చేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది. ఇందులో కూరగాయలు, పప్పులు ఉంటాయి కాబట్టి మనకు పోషకాలు, శక్తి కూడా లభిస్తాయి. చాలా త్వరగా దీన్ని తయారు చేసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ అంటే హడావుడి లేకుండా.. సింపుల్‌గా అన్నీ కలిపేసుకుని ఇలా చేసుకోవచ్చు. టైమ్ సేవ్ అవుతుంది. ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. డైట్‌లో ఉన్నవాళ్లకు ఇది చాలా మంచి ఐటమ్.. లంచ్‌లోకి కూడా చేసుకోవచ్చు.
టాపిక్