Paneer jalebi: జ్యూసీ పన్నీర్ జిలేబీ.. ఇంట్లోనే పది నిమిషాల్లో రెడీ-how to make sweet paneer khoya jalebi at home in easy way ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Paneer Jalebi: జ్యూసీ పన్నీర్ జిలేబీ.. ఇంట్లోనే పది నిమిషాల్లో రెడీ

Paneer jalebi: జ్యూసీ పన్నీర్ జిలేబీ.. ఇంట్లోనే పది నిమిషాల్లో రెడీ

Koutik Pranaya Sree HT Telugu
Jul 29, 2024 03:30 PM IST

Paneer jalebi: ఏదైనా కొత్త రుచి ఆస్వాదించాలనుకుంటే ఇంట్లో పనీర్ జిలేబీని తయారు చేయవచ్చు. ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

పన్నీర్ జిలేబీ
పన్నీర్ జిలేబీ (Shutterstock)

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో పనీర్ జిలేబీ ఒక ప్రసిద్ధ స్వీట్. అలాగనీ జిలేబీలు వేయడం రాదని ఊరుకోకండి. ఇంట్లో సాస్ బాటిల్ లేదా కాస్త పెద్ద రంధ్రం ఉన్న సీసా ఉంటే దాంట్లో పిండి నింపి సింపుల్ గా జిలేబీలు చేసేయొచ్చు. సాధారణంగా జిలేబీల కోసం మైదా వాడతారు. ఈ పన్నీర్ జిలేబీలో మైదాతో పాటూ పన్నీర్, కాస్త కోవా కూడా కలుపుతాం. దాంతో రుచి మామూలు జిలేబీ కన్నా బాగుంటుంది.చాలా సింపుల్ రెసిపీ తయారీ, కావాల్సిన పదార్థాలు చూసేయండి.

పనీర్ జిలేబీ తయారీకి కావాల్సిన పదార్థాలు:

200 గ్రాముల పనీర్

200 గ్రాముల మైదా

50 గ్రాముల సన్నం రవ్వ

100 గ్రాముల కోవా

8-10 యాలకులు

1 లీటర్ పంచదార పాకం

నెయ్యి డీప్ ఫ్రై సరిపడా

పనీర్ జిలేబీ తయారుచేసే విధానం:

  1. పన్నీర్ జిలేబీ తయారీకి ముందుగా పనీర్, మైదా, సెమోలినా, కోవా అన్నింటిని మిక్స్ చేసి ఉండల్లేకుండా పిండిలా చేసుకోవాలి. అవసరమైతేనే నీటిని వాడండి. తర్వాత ఈ పిండిని మెత్తగా అయ్యే వరకు బాగా కలపాలి.
  2. మెత్తని పేస్ట్ రెడీ అయ్యాక ఫ్రై చేసుకోవడమే.
  3. వేయించడానికి కడాయిలో నెయ్యి వేడి చేయండి.
  4. ఇప్పుడు జారుడుగా కలుపుకున్న పిండిని సాస్ బాటిల్ లో నింపుకోవాలి.
  5. మీకెలా వేయొస్తే అలాగా జిలేబీ ఆకారం కాస్తైనా వచ్చేలా చూడండి. బాటిల్ తిప్పుతూ జిలేబీలు వేడి నెయ్యిలో వేయండి.
  6. రంగు మారేంత వరకు వేయించి జిలేబీలను బయటకు తీయండి.
  7. వేడిగా ఉన్నప్పుడే తీసి పంచదార పాకంలో వేయాలి.
  8. మీరు జిలేబీలకు రంగు కావాలి అనుకుంటే.. మీరు సిరప్కు 1 నుండి 2 చిటికెల పసుపు లేదా ఫుడ్ కలర్ కలుపుకోవచ్చు. లేదంటే కుంకుమ పువ్వు కూడా కలుపుకోవచ్చు.

చక్కెర సిరప్ తయారీ విధానం:

సిరప్ తయారు చేయడానికి, ఒక పాత్రలో ఒక కప్పు చక్కెర, 1 కప్పు కంటే కొంచెం ఎక్కువ నీరు జోడించండి. పంచదార నీటిలో కరిగిన తర్వాత సిరప్ ను 2 నుంచి 3 నిమిషాలు ఉడికించాలి. సిరప్ ను చెక్ చేయడానికి చెంచాలోకి 2 నుండి 3 చుక్కలు తీసుకోండి. అది చల్లారిన తర్వాత సిరప్ ను వేలు, బొటనవేలులో తీసుకుని చూడండి. కాస్త అంటుకున్నట్లు అయితే చాలు. సాగాల్సిన అవసరం లేదు. అందులో కుంకుమపువ్వు వేసి కలుపుకుంటే పంచదార సిరప్ రెడీ.

Whats_app_banner