Spinach Corn Omelette : పాలకూర మొక్కజొన్న ఆమ్లెట్.. లొట్టలేసుకుంటూ తినొచ్చు
Spinach Corn Omelette Recipe : పాలకూర మెుక్కజొన్న ఆమ్లెట్ గురించి ఎప్పుడైనా విన్నారా? సాయంత్రపూట వేడి వేడి వేడిగా లాగించేయెుచ్చు. దీని తయారీ విధానం ఎలానో తెలుసుకోండి.
సాయంత్ర వేళలో వేడి వేడిగా నోట్లోకి ఏదైనా వెళితే.. హాయిగా ఉంటుంది. అసలే చలికాలం కదా.. ఇంకా ఎంజాయ్ చేయెుచ్చు. అయితే ఇటు ఆరోగ్యానికి, అటు టేస్టీగా ఉండేందుకు కొత్తగా ఏదైనా ట్రై చేయండి. అందులో భాగంగా పాలకూర మెుక్కజొన్న ఆమ్లెట్ తయారు చేయండి. ఈ రెసిపీ ఎలా చేయాలో ప్లాట్ ఫామ్ 65 చెఫ్ వీహెచ్ సురేశ్ చెబుతున్నారు. ఈజీగా చేసేయెుచ్చ.. ఎంచక్కా లాగించేయెుచ్చు.
ట్రెండింగ్ వార్తలు
కావాల్సిన పదార్థాలు
మొక్కజొన్న : 20 గ్రాములు
పాలకూర : 50 గ్రాములు
కోడి గుడ్డు : 2
పచ్చి మిరపకాయ : 3
ఉప్పు : సరిపడేంత
తయారు చేసే విధానం
Step1 : ముందుగా ఒక స్వీట్ కార్న్ తీసుకుని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి
Step2 : ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గుడ్డు పగలగొట్టి అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి
Step3 : తర్వాత తరిగిన పాలకూర, గతంలో ఉడికించిన స్వీట్ కార్న్, తరిగిన పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి.
Step4 : ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకుని, నూనె వేడి చేసి, గుడ్డు మిశ్రమాన్ని పాన్ అంతటా సమానంగా విస్తరించేలా చూసుకోవాలి
Step5 : రెండువైపులా మంచిగా కాల్చాలి. అంతే పాలకూర మొక్కజొన్న ఆమ్లెట్ సిద్ధం.
ఈ రెసీపీ చేసేందుకు టైమ్ ఎక్కువగా తీసుకోదు. అంతేకాదు.. పదార్థాలు కూడా తక్కువే పడతాయి. ఈజీగా చేసేయెుచ్చు.. టేస్టీగా తినేయెుచ్చు. పాలకూర మెుక్కజొన్న రెసిపీని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం ఈరోజే ఈ కొత్త రెసిపీని ట్రై చేయండి.