సమోసా అనగానే బంగాళాదుంపలు, ఉల్లిపాయలతో నిండి ఉంటుంది. అవి లేకుండా సమోసా పూర్తి కాదనుకుంటారు. ఈ రెండూ అవసరం లేకుండా పనీర్, పచ్చి బఠానీలతో వండే ఈ సమోసా చాలా రుచిగా ఉంటుంది. పనీర్ మటర్ సమోసా ఎలా తయారు చేయాలో ఇక్కడ చెప్పాము.
మైదా పిండి - ఒక కప్పు
ఉప్పు -రుచికి సరిపడా
నీళ్లు - సరిపడా
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
పచ్చిబఠాణీలు - అర కప్పు
పనీర్ తురుము - రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
గరం మసాలా - అర స్పూను
మిరియాల పొడి - పావు స్పూను
పచ్చిమిర్చి - రెండు
4. స్టఫింగ్ చేయడానికి బఠానీలను ముందుగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత అందులో తురిమిన పనీర్ వేయాలి.
5. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర, ఉప్పు, గరంమసాలా, మిరియాలపొడి వేసి కలపాలి.
6. ఇప్పుడు మైదా పిండి మిశ్రమం నుంచి చిన్న ముద్ద తీసుకోండి. దాన్ని రోలింగ్ పిన్ తో రోటీలా ఒత్తుకోవాలి.
7. ఆ పూరీని సమోసాలాగా తయారు చేసుకుని అందులో పనీర్ స్టఫింగ్ నింపాలి. తరువాత సమోసా చివరను నీటితో అతికించండి. త
8. బాణలిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేసి వేడి చేయాలి. ఆ వేడి నూనెలో 4 లేదా 5 సమోసాలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
9. సమోసాలు వేయించేటప్పుడు మంట మీడియంలో ఉంచాలి. వేయించాక వాటిని తీసి టిష్యూ పేపర్లపై వేయాలి. దీన్ని పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి. అంతే టేస్టీ పనీర్ సమోసా తయారైనట్టే.
ఇందులో మనం బంగాళాదుంపలు, ఉల్లిపాయలు వాడలేదు. కానీ వీటి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. జైనులు ఇలా సమోసాలను వండుకుంటారు. వారు ఉల్లిపాయ తినేందుకు ఇష్టపడరు. మీరు కూడా ఈ పనీర్ రెసిపీని ప్రయత్నించండి.