Paneer burji: పన్నీర్ బుర్జీ ఇలా 2 రకాలుగా చేసి చూడండి, సింపుల్‌గా పూర్తయ్యే టేస్టీ రెసిపీలు-how to make paneer burji recipes in 2 ways amritsari style and mumbai style ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Paneer Burji: పన్నీర్ బుర్జీ ఇలా 2 రకాలుగా చేసి చూడండి, సింపుల్‌గా పూర్తయ్యే టేస్టీ రెసిపీలు

Paneer burji: పన్నీర్ బుర్జీ ఇలా 2 రకాలుగా చేసి చూడండి, సింపుల్‌గా పూర్తయ్యే టేస్టీ రెసిపీలు

Koutik Pranaya Sree HT Telugu
Aug 24, 2024 11:30 AM IST

Paneer burji: పనీర్ ఈ శతాబ్దంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆహార పదార్ధం. మీరు కూడా పనీర్ తో కొత్తగా ఏమి చేయాలా అని ఆలోచిస్తుంటే, ఈ వర్షాకాలంలో కొన్ని మసాలా మరియు ఆహ్లాదకరమైన వంటకాలు ఇక్కడ ఉన్నాయి. జయంతి రంగనాథన్ తీసుకొచ్చారు.

పన్నీర్ బుర్జి రెసిపీ
పన్నీర్ బుర్జి రెసిపీ

పన్నీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. స్పైసీగా హెల్తీగా ఏదైనా తినాలనుకుంటే పనీర్ బుర్జి తయారు చేసుకోవచ్చు. పండగరోజునా సింపుల్ గా అయ్యేలా, ప్రత్యేకంగా తినాలనిపిస్తే వీటిని ప్రయత్నించొచ్చు. వీటిని అన్నంతో, చపాతీలతో పాటూ సాయంత్రం పూట స్నాక్ లాగా పావ్ లేదా బ్రెడ్ తోనూ సర్వ్ చేయొచ్చు. చాలా సింపుల్ గా చేయగల ఈ 2 రకాల బుర్జి రెసిపీలు చూసేయండి.

అమృత్ సర్ పనీర్ బుర్జి:

కావలసిన పదార్థాలు:

• పనీర్: 200 గ్రాములు

• శనగపిండి: 1 చిన్న కప్పు

• పెరుగు: 1 చిన్న కప్పు

• ఉల్లిపాయ: 2

• టొమాటో: 1

• వెల్లుల్లి, అల్లం పేస్ట్: 2 టీస్పూన్లు

• పసుపు: 1 టీస్పూన్

• ఎండుమిర్చి: 1 టీస్పూన్

• పచ్చిమిర్చి: 1

• ధనియాల పొడి: 1 టీస్పూన్

• గరం మసాలా: 1 టీస్పూన్

• పాలు: 2 టీస్పూన్లు

• జీలకర్ర: 1/2 టీస్పూన్

• నూనె: తగినంత

• కాశ్మీరీ ఎండుమిర్చి: 1

• ఉప్పు: రుచికి తగినంత

• సన్నగా తరిగిన కొత్తిమీర: 2

అమృత్ సర్ పనీర్ బుర్జి తయారీ విధానం:

  1. వేయించిన శనగపిండి, పెరుగు ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. అదే మిశ్రమంలో పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మెంతి వేసి పక్కన పెట్టుకోవాలి.
  2. బాణలిలో మూడు చెంచాల నూనె వేసి బాగా వేడి చేయాలి. దాంట్లో కశ్మీరీ ఎండు మిరపకాయలను వేయాలి. వేగాక శనగపిండి, పెరుగు మిశ్రమంలో ఈ తాలింపు వేసి బాగా కలపాలి.
  3. అదే బాణలిలో 3 టీస్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర వేయాలి. అది వేగిన తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి.
  4. ఉల్లిపాయ బంగారు రంగులోకి మారిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.
  5. అందులో తరిగిన టమోటాలు, ఉప్పు వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు శెనగపిండి పెరుగు మిశ్రమం వేసి బాగా ఉడికించాలి. మసాలా వేడయ్యాక అందులో పనీర్ ముక్కలు వేసి వేయించాలి.
  6. అందులో పాలు పోసి ఐదు నిమిషాలు మూతపెట్టాలి. భుర్జీని కొత్తిమీరతో గార్నిష్ చేసి పరాఠా లేదా కుల్చాతో సర్వ్ చేయొచ్చు.

ముంబై పనీర్ బుర్జి

ముంబై పనీర్ బుర్జి తయారీకి కావలసిన పదార్థాలు:

• పనీర్: 200 గ్రాములు

• ఉల్లిపాయ: 2

• టమాట: 2

• క్యాప్సికమ్: 1

• పచ్చిమిర్చి: 3

• వెల్లుల్లి రెబ్బలు: 8

• నల్ల మిరియాల పొడి: 1 టీస్పూన్

• ఎండుమిర్చి: 1 టీస్పూన్

• పావ్ బాజీ మసాలా: 2 టీస్పూన్లు

• బటర్: 2 టీస్పూన్లు

• నూనె: 2 టీస్పూన్లు

• సన్నగా తరిగిన కొత్తిమీర: 4 టీస్పూన్లు

• ఉప్పు: రుచికి తగినంత

తయారీ విధానం:

  1. పనీర్‌ను ముందుగా చేత్తో నలిపి బుర్జీ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  2. బాణలిలో వెన్న, నూనె వేయాలి. అది వేడి అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలి. బంగారు రంగు వచ్చే వరకు బాగా వేయించాలి.
  3. వెల్లుల్లి రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా వేడయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేయాలి.
  4. కాసేపటికి నూనె అన్ని పక్కల నుంచి తేలుతుంది. మసాలా ఉడికిపోయాక సన్నగా తరిగిన క్యాప్సికం వేసి మూతపెట్టి మూడు నుంచి ఐదు నిమిషాలు ఉడికించాలి.
  5. ఉప్పు, మిరియాలపొడి, ఎండుమిర్చి, పావ్ బాజీ మసాలా వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత పనీర్ కూడా వేసి వేయించాలి.
  6. పనీర్ కొద్దిగా ఉడికిపోతే చివరగా కొత్తిమీర బాగా వేసి కలపాలి. బ్రెడ్, పావ్ లేదా రోటీతో, అన్నంలోకీ బాగుంటుంది.