Neem and Fenugreek Hair Pack : జుట్టు సంరక్షణకు వేప, మెంతి హెయిర్ ప్యాక్.. ఎలా తయారు చేయాలి?-how to make neem and fenugreek hair pack for hair growth white hair to black hair dandruff ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  How To Make Neem And Fenugreek Hair Pack For Hair Growth White Hair To Black Hair Dandruff

Neem and Fenugreek Hair Pack : జుట్టు సంరక్షణకు వేప, మెంతి హెయిర్ ప్యాక్.. ఎలా తయారు చేయాలి?

HT Telugu Desk HT Telugu
Sep 08, 2023 05:00 PM IST

Neem and Fenugreek Hair Pack : జుట్టు రాలడం అనేది పురుషులు, మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్య. యువత నుంచి పెద్దల వరకు అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలడానికి వివిధ కారణాలు ఉండవచ్చు. అయితే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే.. సమస్య నుంచి బయటపడొచ్చు.

హెయిర్ ప్యాక్
హెయిర్ ప్యాక్

జుట్టు రాలడం(Hair Loss) అనేది సాధారణ సమస్యే అయినా.. ఇబ్బందికరంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం, రూపానికి సంబంధించినది కావడంతో కాస్త ఎక్కువగా కేర్ తీసుకోవాలి. జుట్టు రాలడం సమస్యను పరిష్కరించడానికి వివిధ పరిష్కారాలు ఉన్నాయి. జుట్టు రాలడం సమస్యకు సహజ పరిష్కారం కోసం చూస్తున్నట్లయితే వేప, మెంతి హెయిర్ ప్యాక్(Neem and Fenugreek Hair Pack) మంచి ఎంపిక. ఇది శతాబ్దాలుగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి, జుట్టు రాలడాన్ని నిరోధించడానికి ఉపయోగిస్తున్నారు. ఈ హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేయాలో, దాని ప్రయోజనాలను తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

మెంతి గింజలను(Fenugreek Seeds) రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నానబెట్టిన మెంతి గింజలను మెత్తగా పేస్ట్ చేయాలి. కొన్ని వేప ఆకులను(Neem Leaves) తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. మెంతి పేస్ట్, వేప ముద్దను కలిపి పేస్ట్ లా చేయాలి. జుట్టు మూలాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతూ, మీ తలకు, జుట్టుకు మిశ్రమాన్ని అప్లై చేయాలి. తర్వాత, 30 నిమిషాల నుండి గంట వరకు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటిలో తేలికపాటి షాంపూతో మీ జుట్టును కడగాలి.

వేప, మెంతి హెయిర్ ప్యాక్ మీ జుట్టు పెరుగుదలను(Hair Growth) ప్రోత్సహిస్తుంది. ఈ రెండూ జుట్టు మూలాలను ఉత్తేజపరిచే, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే సామర్థ్యం ఉన్నాయి. వేపలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు శిరోజాలను ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. ఇది జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. వేప, మెంతులు చుండ్రును కలిగించకుండా చేస్తాయి. తలని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఈ హెయిర్ ప్యాక్‌(Hair Pack)ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల జుట్టు మూలాలు బలపడతాయి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. వేప, మెంతి సహజ లక్షణాలు జుట్టుకు లోతైన కండిషనింగ్‌ను అందిస్తాయి. వేప, మెంతి హెయిర్ ప్యాక్ జుట్టు రాలడానికి సహజమైన, సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. మీరు ఇంట్లోనే ఈ అద్భుతమైన హెయిర్ ప్యాక్‍ని తయారు చేసుకోవచ్చు. ఈ ప్యాక్‌ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల జుట్టు పెరగడమే కాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఇది చుండ్రు(Dandruff)ను నియంత్రిస్తుంది. జుట్టును బలపరుస్తుంది. ఆరోగ్యకరమైన, మెరిసే జుట్టు కోసం వేప, మెంతి ప్యాక్ ప్రయత్నించండి.

జుట్టును సరిగా చూసుకుంటేనే.. రాలడం సమస్య రాదు. సరైన ఆహారం తినాలి. ప్రోటిన్ ఫుడ్ తీసుకోండి. ఒత్తిడిని దూరం చేసుకోవాలి. రసాయనాలు ఎక్కువగా ఉండే షాంపూలను కూడా వాడకూడదు. వాటిని ఎక్కువగా ఉపయోగిస్తే.. మీ జుట్టు నాశనం అవుతుంది.

WhatsApp channel