Mushroom toast: మష్రూమ్స్‌తో రుచికరమైన టోస్ట్, ఉదయాన్నే తింటే ఆరోగ్యం-how to make mushroom toast recipe for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mushroom Toast: మష్రూమ్స్‌తో రుచికరమైన టోస్ట్, ఉదయాన్నే తింటే ఆరోగ్యం

Mushroom toast: మష్రూమ్స్‌తో రుచికరమైన టోస్ట్, ఉదయాన్నే తింటే ఆరోగ్యం

Mushroom toast: ఉదయం పూట అల్పాహారంలోకి లైట్‌గా రుచిగా ఏదైనా తినాలనుకుంటే మష్రూమ్ టోస్ట్ ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ ఇది.

మష్రూమ్ టోస్ట్

పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని అల్పాహారంలో ఏ రకంగా అయినా చేర్చుకునే ప్రయత్నం చేయాలి. దానికోసం ఇలా మష్రూమ్ టోస్ట్ చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఫ్యాన్సీ ఫుడ్ తింటున్నట్లు అనిపిస్తుంది. ఈ మష్రూమ్ టోస్ట్ తయారీ విధానం చూసేయండి.

మష్రూమ్ టోస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

4 బ్రౌన్ బ్రెడ్స్

1 చెంచాడు బటర్

5 వెల్లుల్లి రెబ్బలు

1 తరిగిన ఉల్లిపాయ ముక్కలు

1 కప్పు తరిగిన పుట్టగొడుగులు

1 టీస్పూన్ చిలీ ఫ్లేక్స్

1/2 టీస్పూన్ మిరియాల పొడి

1 టీస్పూన్ ఆరిగానో(ఆప్షనల్)

ఉప్పు- రుచికి తగినంత, రుచికి తగినంత

2 చెంచాల ఓట్స్ పొడి లేదా మైదా

1 కప్పు పాలు -

1 చిన్న క్యూబ్ చీజ్

తాజా కొత్తిమీర సన్నటి తరుగు

మష్రూమ్ టోస్ట్ తయారీ విధానం:

  1. మష్రూమ్ టోస్ట్ తయారు చేయడానికి, ముందుగా పుట్టగొడుగులను బాగా శుభ్రం చేయండి.
  2. శుభ్రం చేయడానికి మైదాను వాడితే మురికి సులభంగా తొలిగిపోతుంది.
  3. తర్వాత బాణలిలో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వీటిని బటర్‌లో వేయించాలి.
  4. బంగారు రంగు వచ్చాక పుట్టగొడుగులు వేసి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, మిరియాల పొడి వేసి కలపాలి.
  5. బాగా కలిపి ఓట్స్ పౌడర్ లేదా మైదా, పాలు, చీజ్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టకోవాలి.
  6. బ్రెడ్ ను కాస్త బటర్ వేసి టోస్ట్ చేయాలి. ఇప్పుడు మష్రూమ్ ఫిల్లింగ్ ను టోస్ట్ మీద స్ప్రెడ్ చేసి చీజ్ తురుము వేసి తినండి. చాలా రుచిగా ఉంటుంది.