Pulao with leftover rice: మిగిలిన అన్నంతో టేస్టీగా ముంబయి స్టైల్ తవా పులావ్ చేసేయండి
Pulao with leftover rice: ఉదయం పూట అన్నం మిగిలిపోతే రాత్రి పూట డిన్నర్ కోసం మంచి పులావ్ చేసేయండి. ముంబయి స్టైల్ తావా పులావ్ ఎలా చేయాలో, కావాల్సిన పదార్థాలేంటో తెల్సుకోండి.
ముంబయి స్టైల్ తావా పులావ్
మిగిలిన అన్నం ఉంటే దాన్ని ఏం చేయాలో అర్థం కాదు. ప్రొద్దున మిగిలిన అన్నంతో రాత్రి పూట డిన్నర్ కోసం ముంబయి స్టైల్ తవా పులావ్ చేసేయొచ్చు. ఇది తింటే మరో రుచికరమైన ఫ్రైడ్ రైస్ తిన్నట్లే అనిపిస్తుంది. మిగిలిన అన్నం వాడామన్న ఫీలింగ్ రాదు. తయారీ ఎలాగో, కావాల్సిన పదార్థాలేంటో చూసేయండి. దీనికోసం మిగిలిన బాస్మతీ అన్నం లేదా మామూలు అన్నమైనా వాడుకోవచ్చు. ఏదైనా రుచి మాత్రం బాగుంటుంది.
ముంబయి తవా పులావ్ కోసం కావాల్సిన పదార్థాలు:
4 కప్పుల అన్నం
2 చెంచాల బటర్ లేదా నెయ్యి
1 ఉల్లిపాయ, సన్నటి ముక్కలు
అరచెంచా అల్లం వెల్లుల్లి ముద్ద
సగం కప్పు బటానీ
కప్పు క్యాప్సికం ముక్కలు
2 క్యారట్లు, సన్నం ముక్కలు
2 టమాటాలు, సన్నం ముక్కలు
కొద్దిగా కొత్తిమీర తరుగు
అరచెంచా ఉప్పు
2 పచ్చిమిర్చి
2 బంగాళదుంపలు, ఉడికించినవి
2 చెంచాల గరం మసాలా
1 చెంచా పావ్ బాజీ మసాలా(ఆప్షనల్)
ముంబయి తవా పులావ్ తయారీ విధానం:
- ముందుగా కడాయి పెట్టుకుని బటర్ లేదా నెయ్యి వేసుకుని కరిగించుకోవాలి. వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి.
- పచ్చి వాసన పోయాక క్యాప్సికం ముక్కలు, టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి.
- కాసేపాగి ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర వేసుకుని వేగనివ్వాలి.
- ఇందులో ఉడికించి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, పచ్చి లేదా ఉడికించుకున్న బటానీలు వేసుకోవాలి.
- ఇప్పుడు అన్నాన్ని కాస్త పొడిగా చేసుకుని బాగా మసాలాలో కలిసేలా కలియబెట్టాలి.
- ఇప్పుడు మరికొద్దిగా కొత్తిమీర చల్లుకుని తినేయడమే. దీన్ని రైతా లేదా పాపడ్ తో సర్వ్ చేసుకుంటే
టాపిక్