Masala Chicken Fry : డిఫరెంట్ ఫ్లేవర్ చికెన్.. మసాలా గ్రైండ్ చేయకుండానే రెసిపీ-how to make masala chicken fry without grinding masala at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Masala Chicken Fry : డిఫరెంట్ ఫ్లేవర్ చికెన్.. మసాలా గ్రైండ్ చేయకుండానే రెసిపీ

Masala Chicken Fry : డిఫరెంట్ ఫ్లేవర్ చికెన్.. మసాలా గ్రైండ్ చేయకుండానే రెసిపీ

Anand Sai HT Telugu Published Apr 22, 2024 11:00 AM IST
Anand Sai HT Telugu
Published Apr 22, 2024 11:00 AM IST

Masala Chicken Fry : నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే బాగా ఇష్టం. అయితే ఎప్పుడూ ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు కాస్త వెరైటీ రుచితో తినండి.

చికెన్ ఫ్రై
చికెన్ ఫ్రై (Unsplash)

భారతీయులు ఆహార ప్రియులు. వారికి సీజనలిటీ పెద్ద సమస్య కాదు. ఏ సమయంలోనైనా అన్ని ఆహారాన్ని తినాలనే మనస్సు మనవారికి ఉంటుంది. సీజన్ ప్రకారం ఇదే ఆహారం తినాలనేమి నియమాలు పెట్టుకోరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే స్పైసీ ఫుడ్ నిత్యం తింటారు. చికెన్ నుండి అనేక రకాల వంటకాలు తయారు చేయవచ్చు. చికెన్‌ని పులుసులో తినకుండా కాస్త డ్రైగా తినాలనుకుంటే ఈ చికెన్ ఫ్రైని ప్రయత్నించవచ్చు.

చికెన్ ఫ్రైని సరైన విధానంలో వండితే మంచి రుచి వస్తుంది. కింద చెప్పే పద్ధతిలో వండి చూడండి. బాగుంటుంది. ఈ ఫ్రైని ఎలా చేయాలి? అని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్‌గా చేసేయెుచ్చు. సమయం కూడా ఎక్కువగా తీసుకోదు. దాని తయారీకి కావలసిన పదార్థాలు ఏంటి? ఆ రెసిపీ ఏంటో చూద్దాం..

చికెన్ ఫ్రైకి కావలసిన పదార్థాలు

చికెన్ - 500 గ్రాములు, ఉల్లిపాయ-2, పచ్చిమిర్చి - 2, ఉల్లిపాయ - 1/4 స్పూన్, జీలకర్ర - 1/4 tsp, దాల్చినచెక్క - 1, ఏలకులు - 2, లవంగాలు - 2, పలావ్ ఆకు - 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్, కరివేపాకు - కొంత, టొమాటో-2, పసుపు పొడి - 1/4 tsp, రెడ్ చిల్లీ పౌడర్ - 1/2 tsp, గరం మసాలా పొడి - 1/2 tsp, కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు, నల్ల మిరియాల పొడి - 1 tsp, నీరు - 1/2 కప్పు, వంట నునె కావల్సినంత, రుచికి ఉప్పు

చికెన్ ఫ్రై తయారీ విధానం

ముందుగా ఒక పాత్రలో నూనె వేసి, నూనె వేడయ్యాక అందులో జీలకర్ర, చెక్క, లవంగాలు, మెంతులు, పలావ్ ఆకులు వేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.

ఉల్లిపాయ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటా ముక్కలు వేసి వేయించాలి.

దీని తరువాత కరివేపాకు, పసుపు, కారం పొడి, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి 1 నిమిషం వేయించాలి. ఈ ఫ్రైలో కడిగిన చికెన్ వేసి కలపాలి.

రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసి 2 నిమిషాలు వేయించాలి. తర్వాత చిన్న కప్పులో నీళ్లు పోసి తక్కువ మంట మీద 20 నిమిషాలు వేడి చేయాలి.

మీరు కోరుకున్న విధంగా ఉడికించాలి. చివరగా కొన్ని మిరియాల పొడి వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి. అంతే చికెన్ ఫ్రై మీ ముందు సిద్ధంగా ఉంది.

ధనియాల పొడి వేయకుండా దీన్ని ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఇది ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. దీని కోసం మీరు మసాలా దినుసులను రుబ్బుకోవాల్సిన అవసరం లేదు.

Whats_app_banner