Mango Rice : మీరు వంటలో నిపుణులు కాకపోయినా.. మ్యాంగో రైస్ ఇలా రుచిగా చేయెుచ్చు-how to make mango rice for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mango Rice : మీరు వంటలో నిపుణులు కాకపోయినా.. మ్యాంగో రైస్ ఇలా రుచిగా చేయెుచ్చు

Mango Rice : మీరు వంటలో నిపుణులు కాకపోయినా.. మ్యాంగో రైస్ ఇలా రుచిగా చేయెుచ్చు

Anand Sai HT Telugu
Mar 25, 2024 06:30 PM IST

Mango Rice For Breakfast : మ్యాంగో రైస్ ఎప్పుడైనా తిన్నారా? ఉదయం అల్పాహారంలోకి చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది.

మ్యాంగో రైస్
మ్యాంగో రైస్ (Unsplash)

వేసవి కాలం నడుస్తుంది. ఇది మామిడి పండ్ల సీజన్. ఈ సీజన్‌లో నిమ్మకాయ, చింతపండుతో చేసుకునే పులిహోరకు బ్రేక్ ఇవ్వండి. వెరైటీగా మ్యాంగో రైస్ చేసుకోండి. నిమ్మకాయతో ఎప్పుడైనా పులిహోర చేసుకోవచ్చు. కానీ మామిడితో రెసిపీలు చేసుకోవాలంటే వేసవి సరైన టైమ్. అందుకే మీరు ఈ వేసవిలో ఉదయం పూట మ్యాంగో రైస్ చేసి తినండి. చాలా ఈజీగా తయారు చేయవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మ్యాంగో రైస్ తయారీ విధానం చూద్దాం..

yearly horoscope entry point

మ్యాంగో రైస్‌కు కావాల్సిన పదార్థాలు

ఒక మామిడికాయ 1 (తొక్క తీసి తురిమినది), ఉల్లిపాయలు 2, ఎండు మిరపకాయలు 3-4, పచ్చిమిర్చి 2, ఉప్పు 1/2 tsp, కొద్దిగా తురిమిన కొబ్బరి, బియ్యం 2 కప్పులు, వేరుశనగ గింజలు, కరివేపాకు కొద్దిగా, మినపప్పు పప్పు 1/2 టేబుల్ స్పూన్, శనిగ పప్పు 1/ 2 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ల నూనె,

మ్యాంగో రైస్ తయారీ విధానం

మందపాటి అడుగున ఉన్న బాణలిలో నూనె వేసి వేడయ్యాక పప్పులు వేసుకుని కాసేపు వేయించాలి.

తర్వాత కరివేపాకు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండు మిర్చి వేసుకోవాలి.

ఇప్పుడు మామిడికాయ తురుము, ఉప్పు, పసుపు వేసి కాసేపు వేయించాలి.

దానికంటే ముందు అన్నం వండుకోవాలి. మెత్తగా చేసుకోకూడదు. తయారైన అన్నాన్ని బాగా మిక్స్ చేసి పైన తయారైన రెసిపీలో వేసుకోవాలి.

పైన కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, 10 నిముషాలు అలాగే ఉంచి సర్వ్ చేస్తే మామిడికాయ అన్నం రెడీ.

మామిడికాయ ప్రయోజనాలు

ఈ వేసవిలో మామిడి తింటే శరీరానికి మంచిది. ఇది శరీరంలో డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. వేసవిలో శరీరంలో సోడియం సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియకు మంచిది మామిడిపండ్లు. ఇది మలబద్ధకం, అజీర్ణం, ఆమ్లత్వం, గుండెల్లో మంటలను నివారిస్తుంది.

మామిడికాయలో విటమిన్ బి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. రక్త ప్రసరణకు సహాయపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. కాలేయ ఆరోగ్యానికి చాలా మంచిది మామిడి. ఇది కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది. తద్వారా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మామిడి కాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మామిడిలో విటమిన్ సి ఉంటుంది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. కండరాల నొప్పులను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

మామిడికాయ అన్నం చేయడానికి కాస్త పులుపుగా పండని మామిడికాయను వాడాలి. అప్పుడే టేస్ట్ సూపర్ గా ఉంటుంది. ఈ మామిడికాయ రైస్ తయారు చేసిన వెంటనే తినాలి. ఇది బ్రేక్ ఫాస్ట్ ‌లాగా కూడా తినవచ్చు. కాస్త వేడిగా ఉన్నప్పుడే తాజాగా తింటే చాలా బాగుంటుంది. ఒక్కో రకం మామిడికాయలు ఒక్కో రుచిని ఇస్తాయి.. ఈ రెసిపీకి ఎప్పటికీ బోర్ కొట్టదు. ఈ వేసవిలో మామిడి రైస్ ఎంజాయ్ చేయండి.

Whats_app_banner