Kalakand: నోట్లో పెట్టగానే కరిగిపోయే కలాకండ్ రెసిపీ, స్వీట్ షాప్ కన్నా బెస్ట్ రుచిలో-how to make kalakand at home in sweet shop style taste ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kalakand: నోట్లో పెట్టగానే కరిగిపోయే కలాకండ్ రెసిపీ, స్వీట్ షాప్ కన్నా బెస్ట్ రుచిలో

Kalakand: నోట్లో పెట్టగానే కరిగిపోయే కలాకండ్ రెసిపీ, స్వీట్ షాప్ కన్నా బెస్ట్ రుచిలో

Koutik Pranaya Sree HT Telugu
Aug 26, 2024 03:30 PM IST

Kalakand: కలాకండ్ అంటే సాధారణంగా బయటినుంచే ఎక్కువగా తెచ్చుకుంటాం. కానీ కాస్త ఓపిక తెచ్చుకుంటే మీరు మర్చిపోలేని రుచితో కలాకండ్ రెడీ అవుతుంది. ఆ రెసిపీ తయారీ ఎలాగో చూడండి.

కలాకండ్
కలాకండ్

శ్రావణ మాసం అంతా పండగలే. ఒక పండగ అయ్యేలోపు మరో పండగ వచ్చేస్తుంది. ప్రతి పండగకు ఇంట్లో, దేవునికి ప్రత్యేకంగా ఏదైనా వండాల్సిందే. ఒకసారి కలాకండ్ రెసిపీ ప్రయత్నించండి. దీన్ని ఎక్కువగా బయట నుంచే తెచ్చుకుంటారు కానీ, ఇంట్లో తయారు చేశారంటే రుచి అద్భుతంగా ఉంటుంది.

కలాకండ్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

1 డబ్బా మిల్క్ మెయిడ్ లేదా కండెన్స్డ్ మిల్క్

పావు కేజీ పన్నీర్ లేదా కోవా

2 చెంచాల జీడిపప్పు తరుగు

పావు చెంచా యాలకులపొడి

1 లీటర్ చిక్కటి పాలు

1 చెంచా రోజ్ వాటర్

పావు కప్పు పంచదార

కలాకండ్ తయారీ విధానం:

  1. కలాకండ్ తయారీ కోసం ముందుగా ఒక పాత్రలో పాలు పోసుకుని బాగా మరిగించుకోవాలి.
  2. పాలు కాస్త చిక్కబడటం మొదలయ్యాక అందులో మిల్క్ మెయిడ్ వేసి కలుపుకుని మరో 5 నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం చిక్కబడ్డాక కోవా కూడా వేసి కలుపుకోవలి. మిల్క్ మెయిడ్‌లో పంచదార ఉంటుంది. కానీ అది సరిపోదనుకుంటే కాస్త పంచదార కలుపుకోవచ్చు.
  3. తర్వాత అందులో రోజ్ వాటర్, యాలకుల పొడి వేసి మరికాసేపు మరిగించుకోవాలి.
  4. కాసేపటికి బాగా చిక్కగా అయిపోతుంది మిశ్రమం. బాగా గట్టిగా అయిపోయి అంచులు వదిలేస్తుంది.
  5. అంతలోపు ఒక ట్రేకు నెయ్యి అంతటా రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న ట్రేలో పోసుకోవాలి. మీద జీడిపప్పు, పిస్తాను సన్నగా ముక్కల్లాగా చేసుకుని వేసుకోవాలి.
  6. ఫ్రిజ్‌లో రెండు గంటలు పెట్టుకుంటే బాగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇష్టం ఉన్న ఆకారంలో కట్ చేసుకుంటే చాలు. కలాకండ్ రెడీ అయినట్లే.

 

 

 

టాపిక్