Ginger Oil for Hair: సిల్కీ, స్మూత్ హెయిర్ కావాలా? అద్భుతంగా పనిచేసే అల్లం నూనె తయారీ, వాడే విధానం తెలుసుకోండి!
Ginger Oil for Hair: ఈ రోజుల్లో వెంట్రుకల సమస్యలు లేని వారంటూ ఎవ్వరూ లేరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ జుట్టు రాలడం, తెల్లబడటం, చుండ్రు వంటి రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అవన్నింటికీ చెక్ పెట్టే అద్భుతమైన అల్లం నూనె ఎలా తయారు చేయాలి, ఎలా వాడాలి తెలుసుకుందాం.
వెంట్రుకల ఆరోగ్యం కోసం కొబ్బరి నూనె వాడి ఉంటారు. ఉసిరి, బాదం నూనెలను కూడా ఉపయోగించి ఉంటారు. కానీ అల్లం నూనె ఎప్పుడైనా వాడారా? అసలు ఈ పేరైనా విన్నారా? అల్లం నూనె గురించి తెలియని వారు వెంట్రుకల విషయంలో చాలా లాభాలను మిస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే అల్లం కేవలం వంటలకు ఉపయోగించే పదార్థం మాత్రమే కాదు. అందమైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం సహాయపడే గొప్ప సాధనం. అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వెంట్రుకలను కుదుళ్ల నుంచీ బలంగా తయారుచేసేందుకు సహాయపడతాయి. అల్లం నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం సమస్య తగ్గడంతో పాటు సిల్కీగా , స్మూత్ గా, ఆరోగ్యంగా తయారవుతుంది. అందమైన మెరిసే కురులను మీ సొంతంచేస్తుంది.
అల్లం నూనె వల్ల కలిగే ప్రయోజనాలు:
- రక్తప్రసరణను మెరుగుపరచడం
- యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు పెంచడం
- యాంటీ ఆక్సిడెంట్లు పెంచడం
- వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచడం
అల్లం నూనె తయారీ విధానం:
పదార్థాలు:
1. రెండు అంగుళాల తాజా అల్లం
2. కొబ్బరి నూనె – 1 కప్పు
3. చిన్న గ్లాస్ జార్ లేదా కంటెయినర్
తయారీ విధానం:
- అల్లంపై పొట్టును తొలగించి సన్నని ముక్కలుగా తరగండి.
- కొబ్బరి నూనెను వేడి చేసుకుని అందులో అల్లం ముక్కలు వేయండి.
- ఈ మిశ్రమాన్ని పావు గంట వరకూ మరిగించండి.
- కొబ్బరి నూనె ముదురు రంగు సంతరించుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని చల్లార్చుకోండి.
- దానిని ఒక మెష్ సహాయంతో వడకట్టుకుని ఒక గాజు సీసాలో పోసుకోండి.
- దీనిని వెలుతురు పడని ప్రదేశంలో రెండు మూడు వారాల పాటు నిల్వ చేయాలి.
జుట్టు ఆరోగ్యానికి అల్లం నూనెను వాడే విధానం:
1. మసాజ్: అల్లం నూనెను కుదుళ్ల నుంచి వెంట్రుకలు మొత్తానికి అంటేలా మసాజ్ చేయాలి. ఇది తలపై రక్త ప్రసరణను మెరుగుపరచి, ఆరోగ్యకరమైన జుట్టు ఎదుగుదలకు సహాయపడుతుంది.
2. నూనె ఇంకేంతవరకూ ఉంచండి: ఉత్తమ ఫలితాల కోసం, ఆయిల్‌ను తలపై అప్లై చేసి రాత్రంతా ఉంచండి. మరుసటి రోజు మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోండి.
3. షాంపూ/కండిషనర్‌కు జోడించండి: మీరు ఎల్లప్పుడూ ఉపయోగించే షాంపూ లేదా కండిషనర్‌లో కొన్ని బొట్ల వరకూ అల్లం నూనెను జోడించవచ్చు.
ఇది జుట్టు ఎదుగుదలకు తోడ్పడంతో పాటు డాండ్రఫ్ ను నివారించి కేశాలను బలపరుస్తుంది. అల్లంలో ఉండే పోషకాల సహాయంతో కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ ఆయిల్ ను రెగ్యూలర్ గా వాడటం వల్ల మీ వెంట్రుకలు బలంగా మారతాయి.
అల్లం నూనె - కొబ్బరి నూనెతో హెయిర్ మాస్క్ వల్ల ప్రయోజనాలు
- రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక టేబుల్ స్పూన్ అల్లం నూనె కలపండి.
- ఈ మిశ్రమాన్ని తలకు, కుదుళ్లకు అంటేలా మసాజ్ చేయండి.
- అలా ఒక అరగంట సేపు ఉంచి గంట తర్వాత కడిగేయండి.
- ఆ తర్వాత దీని వల్ల జుట్టుకు అందిన కండీషనింగ్, వెంట్రుకల ఎదుగుదల మీకే స్పష్టంగా తెలుస్తుంది.
సంబంధిత కథనం