Leftover Rice Dosa: మిగిలిన అన్నంతో టేస్టీగా, క్రిస్పీగా దోశలు.. చేసేయండిలా..
Dosa With Leftover Rice Recipe: మిగిలినపోయిన అన్నాన్ని తినాలనిపించడం లేదా.. అయితే రుచికరంగా దోశలు వేసుకోవచ్చు. క్రిస్పీగా, టేస్టీగా ఇవి ఉంటాయి. మిగిలిన అన్నంతో దోశలు ఎలా వేసుకోవాలంటే..
Dosa With Leftover Rice Recipe: మిగిలిన అన్నంతో టేస్టీగా, క్రిస్పీగా దోశలు.. చేసేయండిలా..
మిగిలిపోయిన అన్నంతో డిఫరెంట్‍గా ఏమైనా చేయాలనుకుంటున్నారా.. అయితే రుచికరంగా ఉండే దోశలు వేసుకోవచ్చు. చల్లటి అన్నం కొన్నిసార్లు తినాలని అనిపించదు. అలాంటప్పుడు అన్నంతో ఈ దోశలు తయారు చేసుకోవచ్చు. రాత్రి మిగిలిన అన్నంతోనూ ఉదయం వీటిని రెడీ చేయవచ్చు. క్రిస్పీగా ఈ దోశలు వస్తాయి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. మిగిలిన అన్నంతో దోశలు ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
మిగిలిన అన్నంతో దోశలకు కావాల్సిన పదార్థాలు
- రెండు కప్పుల అన్నం
- ఒక కప్పు ఉప్మా రవ్వ
- ఓ కప్పు పుల్లటి పెరుగు
- అర కప్పు మైదాపిండి (లేదా గోధుమ పిండి)
- పిండి గ్రైండ్ చేసుకునేందుకు నీరు
- దోశ కాల్చుకునేందుకు నూనె
- టీ స్పూన్ వండ సోడా
- తగినంత ఉప్పు
మిగిలిన అన్నంతో దోశలు చేసుకునే విధానం
- ముందుగా మిక్సీ జార్‌లో అన్నం, రవ్వ, మైదాపిండి, పెరుగు, నీరు వేసుకోవాలి. వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- వీటితో పిండి చేస్తే కాస్త బిగుసుగా ఉంటుంది. అందుకే కాస్తకాస్త నీళ్లు వేసుకుంటూ మిక్సీని ఆపిఆపి గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న పిండిలో తగినంత ఉప్పు, వంటసోడా వేసి కలపాలి. దోశ పిండిలా జారుగా ఉండేందుకు అవసరమైతే కొన్ని నీరు పోసి కలపాలి.
- పిండిని బాగా కలిపాక ఓ 15 నిమిషాలు పక్కన పెట్టాలి.
- ఆ తర్వాత స్టవ్‍పై పెనం పెట్టి వేడి చేసుకోవాలి. కాస్త నూనె వేసుకొని సగం తరిగిన ఉల్లిపాయతో పెనంపై బాగా రాయాలి.
- పెనం బాగా వేడెక్కాక తయారు చేసుకున్న దోశ పిండిని వేసుకోవాలి. దోశలా గుడ్రంగా గరిటెతో రుద్దాలి. కాస్త మందంగానే దోశ వేసుకోవాలి.
- దోశ కాస్త కాలిన తర్వాత మధ్యలో, అంచుల వెంట నూనె వేసుకోవాలి.
- దోశ ఓ వైపు కాలాక మరోవైపు కాసేపు కాల్చాలి. అంతే ఆ తర్వాత దోశను ప్లేట్‍లోకి తీసేసుకోవచ్చు. మిగిలిన అన్నంతో దోశ రెడీ అయిపోతుంది.
కొబ్బరి చట్నీ, అల్లం చట్నీని అంచుకొని ఈ దోశలను తినొచ్చు. మిగిలిన అన్నంతో ఏం చేయాలా అని ఆలోచించినప్పుడు ఈ దోశలు వేసుకోవచ్చు. రాత్రి చేసిన అన్నం ఎక్కువ మిగిలితే ఉదయం చేసుకునేందుకు ఈ దశలు మంచి బ్రేక్‍ఫాస్ట్ ఆప్షన్‍గా ఉంటుంది. 30 నిమిషాల్లోగానే ఈ దోశలను చేసేసుకోవచ్చు.