Potato Idli Recipe : బఠాణీ బంగాళదుంప ఇడ్లీ.. చేయడం చాలా ఈజీ.. హెల్తీ కూడా..
Idli Recipe In Telugu : ఇడ్లీ అనేది సాధారణ అల్పాహారం. అయితే దీనిని రోజూ ఒకేలాగా తింటే బోర్ కొడుతుంది కదా. అందుకే కొత్తగా ఇడ్లీని ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ఉదయాన్నే ఇడ్లీ చేయాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే మీకోసం అద్భుతమైన ఇడ్లీ రెసిపీ ఉంది. ఈ ఇడ్లీ వంటకం పిల్లలకు ఇష్టంగా తింటారు. ఉదయం తయారు చేయడానికి కూడా సరైనది. చాలా ఈజీగా చేసేయెుచ్చు. ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది.
ట్రెండింగ్ వార్తలు
ఈ ఇడ్లీ లోపల బంగాళదుంప, బఠాణీ మసాలాతో చేస్తారు. తినేందుకు చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలాగా ఇడ్లీ తినేవారికి కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు బఠాణీ పొటాటో ఇడ్లీని ఎలా తయారు చేయాలో చూద్దాం..
కావాల్సిన పదార్థాలు..
ఇడ్లీ రవ్వ - 2 కప్పులు, పెరుగు - 1 కప్పు ఉప్పు, కావాల్సినంత ఉడకబెట్టిన బఠాణీలు- 1 కప్పు, ఉడకబెట్టిన బంగాళదుంప - 1 కప్పు, కారం పొడి - 1/2 tsp, పసుపు పొడి - 1 tsp, ధనియాల పొడి - 1/2 tsp, ఆవాలు - 1 tsp, కరివేపాకు - కొద్దిగా, నూనె - 1 tsp, ఉప్పు తగినంత.
ఎలా చేయాలి అంటే..
ముందుగా పెరుగులో రవ్వ, ఉప్పు, నీరు కలిపి మూతపెట్టి 1 గంట నాననివ్వాలి. తర్వాత ఒక గిన్నెలో ఉడికించిన బఠాణీలు, బంగాళదుంపలను మెత్తగా నూరుకోవాలి.
తరువాత స్టౌ మీద గిన్నె పెట్టి అందులో నూనె పోసి ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు చేయాలి. అందులో వేసి వేగిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇదంతా బంగాళదుంప, బఠాణీలు కలుపుకోవాలి.
తర్వాత మిక్స్ చేసిన ఇడ్లీ పిండిని తీసుకుని, ఇడ్లీ ప్లేట్‌లో వేసుకోవాలి. దానిపై బంగాళాదుంప మిశ్రమాన్ని చెంచా వేసి, మళ్లీ దానిపై ఇడ్లీ పిండిని పోయాలి.
ఇలాగే అన్ని ఇడ్లీకు ఇలానే చేయాలి. ఇడ్లీ పిండిని పోసి, ఇడ్లీ పాత్రలో వేసి మరిగించి దింపితే, రుచికరమైన బఠాణీ బంగాళాదుంప ఇడ్లీ రెడీ. తినేందుకు కొత్తగా, టేస్టీగా ఉంటుంది.