Almond Chutney : బాదం చట్నీ.. అల్పాహారంలోకి ఇలా తయారు చేయండి
Almond Chutney Recipe Telugu : బాదం ఆరోగ్యానికి మంచిది. కానీ కొందరు తినలేరు. పిల్లలు అయితే వద్దు అని మారం చేస్తారు. అందుకే బాదం చట్నీ తయారు చేయండి.
డ్రైఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు. కానీ కొందరు పిల్లలు తినేందుకు ఇష్టపడరు. ఎలాగైనా తినిపించాలని ప్రయత్నిస్తారు.. వర్కౌట్ కాదు. అందుకే వారు బాదం తినేందుకు కొత్త పద్ధతి ఉంది. మీ పిల్లలకు పోషకాహారం ఇవ్వాలని ఆలోచిస్తే.. చిన్న చిట్కా పాటిస్తే చాలు. బాదంపప్పుతో చట్నీ చేయండి. ఈ బాదం చట్నీ ఇడ్లీ, దోసెతో రుచిగా ఉంటుంది. ఇది పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.
బాదం చట్నీని తయారు చేయడం కూడా సులభమే. ఎలా చేయాలో కింద ఉంది.
బాదం చట్నీకి కావాల్సిన పదార్థాలు
బాదం - 1/2 కప్పు, వెల్లుల్లి - 1 లవంగం, అల్లం - 1/4 అంగుళాలు, పచ్చిమిర్చి - 2, కరివేపాకు - కొద్దిగా, ఆవాలు - 1/4 tsp, మినపప్పు - 1/4 టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 1 టేబుల్ స్పూన్
బాదం చట్నీ తయారీ విధానం
1.ముందుగా బాదంపప్పును గోరువెచ్చని నీటిలో 15-30 నిమిషాలు నానబెట్టాలి.
2. తర్వాత నానబెట్టిన బాదంపప్పును మిక్సీ జార్ లో వేసి అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి.
3. తర్వాత ఒక గిన్నెలో తయారు చేసిన చట్నీ వేయండి.
4. గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, ఉల్లి, కరివేపాకు వేయాలి. కొన్ని మినపప్పు వేసి వేయించాలి.
5. చివరగా తయారు చేసుకున్న బాదం పేస్ట్ తీసి అందులో వేయాలి. కాసేపు అటు ఇటు తిప్పుకోవాలి. అంతే రుచికరమైన బాదం చట్నీ రెడీ.
బాదం పప్పును నేరుగా తినలేని వారు ఇలా చట్నీ చేసుకుని తినొచ్చు. బాదం వంటి గింజలను తీసుకుంటే.. ఆరోగ్యకరమైన బరువు పెరుగుతారు. బాదం శరీర ద్రవ్యరాశి, బలాన్ని పెంచే సామర్థ్యంతో ఉంటుంది. వాత, పిత్త దోషాల నుండి ఉపశమనం పొందొచ్చు.
బాదంపప్పులు నానబెట్టి తీసుకుంటే.. మధుమేహం, బలహీనత వంటి కొన్ని సమస్యలను నివారించడంలో సహాయపడవచ్చు. స్థూలకాయం, ప్రీడయాబెటిస్ మెటబాలిక్ సిండ్రోమ్ వంటి క్లినికల్ డిజార్డర్స్‌తో సంబంధం ఉన్న పరిస్థితులలో బాదం ఉపయోగపడుతుంది. బాదంపప్పును రోజువారీగా తీసుకోవడం వల్ల శరీర కణజాలాలకు తేమను అందిస్తుంది. చర్మం రంగు మెరుగుపడుతుంది. తెల్ల జుట్టు, జుట్టు రాలడాన్ని కూడా నయం చేస్తుంది. అందుకే అల్పాహారంలోకి బాదం చట్నీ చేసుకుని తినండి.