కేవలం రెండు వస్తువులతో టేస్టీ వెజ్ చాక్లెట్ కేక్ ఇలా చేసేయండి-how to make a tasty veg chocolate cake with just two ingredients ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  కేవలం రెండు వస్తువులతో టేస్టీ వెజ్ చాక్లెట్ కేక్ ఇలా చేసేయండి

కేవలం రెండు వస్తువులతో టేస్టీ వెజ్ చాక్లెట్ కేక్ ఇలా చేసేయండి

Haritha Chappa HT Telugu

చాక్లెట్ కేక్ రిసిపి: మీరు రాత్రిపూట మిగిలిపోయిన పాత బియ్యంతో చాక్లెట్ కేక్ తయారు చేయవచ్చు. ఇది తయారు చేయడం సులభం మరియు తినడానికి గొప్పది. మరి దీని రెసిపీ ఏంటో తెలుసుకుందాం.

చాకోలెట్ కేక్ (Shutterstock)

పిల్లలు, పెద్దలు కూడా కేక్ తినడానికి ఇష్టపడతారు. అయితే, ప్రతిరోజూ మార్కెట్ నుండి ఖరీదైన కేక్ కొనడం కష్టం. కాబట్టి ఇంట్లోనే కేకులు తయారుచేసుకోవాలి. కేకులు తయారు చేయడం కష్టమేమో అనుకుంటారు కానీ సులువుగానే చేసేయచ్చు. చాక్లెట్ కేక్ సులువుగా ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. దీన్ని వండడం చాలా సులువు. మిగిలిపోయిన అన్నంతో కూడా కేక్ తయారుచేయచ్చు. ఆ స్పాంజి కేక్ చాలా మెత్తగా, రుచిగా ఉంటుంది.

వెజ్ చాక్లెట్ కేక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

మిగిలిపోయిన అన్నం - ఒకటిన్నర కప్పు

చాక్లెట్ కాంపౌండ్ - 300 గ్రాములు

వెజ్ చాక్లెట్ కేక్ రెసిపీ

  1. చాక్లెట్ కేక్ తయారు చేయడానికి ముందుగా చాక్లెట్ కాంపౌండ్ తీసుకోండి.

2. మొదట మీ చాక్లెట్ ను కరిగించండి. ఇందుకోసం మైక్రోవేవ్ లేదా డబుల్ బాయిలర్ పద్ధతిని ఉపయోగించవచ్చు. బాగా కరిగించి మెత్తగా చేయాలి.

3. ఇప్పుడు మిక్సీ గ్రైండర్ తీసుకుని అందులో రాత్రంతా మిగిలిపోయిన అన్నం వేసి రుబ్బుకోవాలి.

4. ఇప్పుడు ఈ అన్నం పిండిని కరిగించిన చాక్లెట్ లో వేసి బాగా కలపుకోవాలి.

5. అందులో రెండు నుంచి మూడు టీస్పూన్ల గోరువెచ్చని నీళ్లు కలపాలి.

6. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. దీని తరువాత, కేక్ మౌల్డ్ లో బటర్ పేపర్ వేయాలి.

7. ఈ కేక్ మౌల్డ్ లో చాక్లెట్ పిండిని వేసి బాగా సెట్ చేయండి.

8. ఈ మిశ్రమాన్ని బేకింగ్ కు బదులుగా సెట్ చేయడానికి ఫ్రిజ్ లో ఉంచండి. మూడు నుంచి నాలుగు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి.

9. కేక్ గట్టిగా మారాక పైన చాక్లెట్ సిరప్ పైన వేయండి. క్రష్డ్ చాక్లెట్ తో కేక్ కు అందమైన రూపాన్ని కూడా ఇవ్వవచ్చు.

10. అంతే టేస్టీ ఇన్ స్టంట్ చాక్లెట్ కేక్ రెడీ.

ఇది నోట్లో పెడితేనే కరిగిపోయేలా ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లోనే దీన్ని వండుకుని చూడండి… తక్కువ సమయంలోనే అయిపోతుంది. ఇది వండడానికి స్టవ్ కూడా అవసరం లేదు.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.