Drumstick For Weight Loss : మునక్కాయలతో బరువు తగ్గడం ఎలా? చాలా సింపుల్
Drumstick For Weight Loss In Telugu : మునగకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గేందుకు కూడా మునక్కాయలను ఉపయోగించొచ్చు.
మునగ కాయ బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుందని తెలుసా? మునగ మన దేశానికి చెందినది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీని ఆకులు, పువ్వులతో కూడా ఔషధ ఉపయోగాలున్నాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మునగకాయలను(Drumstick) ఆహారంలో కూడా ఉపయోగిస్తారు.
ట్రెండింగ్ వార్తలు
మునగకాయను కషాయం చేసి తాగితే బరువు(Drumstick For Weight Loss) తగ్గుతారు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, కాల్షియం వంటి ఖనిజాలు ఉన్నాయి. శరీర బరువును తగ్గించి(Weight Loss) శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని అందిస్తాయి.
మీరు తరచుగా అవాంఛిత శరీర కొవ్వుతో బాధపడుతుంటే.. మునగకాయల కషాయం చేసి తాగాలి. అప్పుడు కొవ్వు ఎలా కరిగిపోతుందో మీరు చూడొచ్చు. ఇలా తాగితే షుగర్ లెవెల్ అదుపులోకి వస్తుంది. ఈ కషాయం తాగేటప్పుడు టీ, కాఫీ, నీళ్లు తాగవచ్చా లేదా అని డాక్టర్‌ని సంప్రదించాలి. లేదంటే షుగర్ లెవెల్ పాడు చేస్తుంది.
మునగకాయ రసం ఎముకలను బలపరుస్తుంది. దీని ఆకుల్లో కాల్షియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇది బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండాలంటే డ్రమ్ స్టిక్ టీ(Drumstick Tea) తాగండి. లేదా దీని ఆకుకూరలు వండుకుని ఆహారంగా తీసుకోవచ్చు.
డ్రమ్ స్టిక్ టీలో ఉండే పోషకాలు పొట్టకు చాలా మేలు చేస్తాయి. ఇది మలబద్ధకం, అపానవాయువు సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారు దీన్ని ప్రయత్నించవచ్చు. రక్తహీనత సమస్యకు ఇది చాలా ఉపయోగపడుతుంది. మునగలోని పోషకాలు రక్తహీనతతో పోరాడగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
మీకు ఏదైనా మెదడు సంబంధిత సమస్య ఉంటే, మునగకాయలను తినండి. దీన్ని తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. మునగకాయలను వండుకుని తినవచ్చు. దీన్ని డికాక్షన్‌గా, సూప్‌గా కూడా తీసుకోవచ్చు. మీ ఆహారంలో మునగ లేదా దాని ఆకులను ఉంచుకోండి. ఆరోగ్యంగా ఉండండి.
మునక్కాయతో బరువు తగ్గించే గుణంతోపాటు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అధిక రక్తపోటు ఉన్న వారికి మునక్కాయ మేలు చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. మునగలో ఉండే పోషకాలు రక్తనాళాలలో చెడు కొలెస్ట్రాల్(Bad Cholesterol) పేరుకుపోకుండా చేస్తాయి. ఇది తింటే.. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.
మునక్కాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో దీనిని మాంసాహారంలాగా భావిస్తారు. ఎందుకంటే దానిలో పోషకాలు అలా ఉంటాయి మరి. ఈ చెట్టు వేరు నుంచి ఆకు వరకూ అన్ని ఉపయోగపడతాయి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మునగ చాలా సాయపడుతుంది. అనేక వ్యాధులను తగ్గించే శక్తి ఉంది.