Dark Lips Home Remedy: మీ పెదవులు నల్లగా మారాయా? అయితే ఇవి ట్రై చేయండి
Dark Lips Home Remedy: స్మోకింగ్ ఎక్కువగా చేయడం వల్లనో, ఎండలో ఎక్కువగా తిరగడం వల్లనో లేదా జీన్స్ వల్లనో చాలామందికి పెదవులు నల్లగా ఉంటాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో పెదవులపై నలుపు రంగును తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలు ఎంత ప్రభావవంతంగా పని చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, పొగాకు, మద్యం వంటి అలవాట్లు, ఆరోగ్య పరిస్థితుల కారణంగా చర్మం మాదిరిగానే.. పెదవులపై రంగు కూడా మారుతుంది. అన్నీ కారణాలు కలిసి డార్క్ లిప్స్‌కు దారితీస్తాయి. అయితే మీరు కొన్ని సింపుల్ రెమీడీస్తో ఈ నలుపుదనాన్ని తగ్గించుకోవచ్చు.
ట్రెండింగ్ వార్తలు
సహజంగా, ఇంట్లోనే తయారుచేసుకోగలిగే నివారణలతో మీ పెదవులను ఎలా రక్షించుకోవాలి.. వాటిని సహజంగా మెరిసేలా ఎలా చేయవచ్చో.. వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తేనె-చక్కెర స్క్రబ్
మీరు బ్యూటీ కోసం ఏమైనా కొత్తగా ప్రయత్నించాలనుకుంటే ముందుగా మృతచర్మాన్ని తొలగించుకోవాలి. అప్పుడే మీకు మంచి ఫలితాలు వస్తాయి. పెదవులకు కూడా అంతే. ముందుగా పెదవులపై ఉన్న మృత చర్మ కణాలు తొలగించుకోవాలి. దీనికోసం ఇంట్లోనే న్యాచురల్ స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. చక్కెర, తేనె కలిపి స్క్రబ్ చేసుకుంటే.. అది పెదవులపై మృత కణాలను తొలగించి.. సహజంగా మెరిసే, మృదువైన పెదవులను అందిస్తుంది.
ఈ స్క్రబ్ కోసం మీరు టీ స్పూన్ చక్కెరలో తేనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్క్రబ్‌ను మీ పెదవులపై అప్లై చేసి వృత్తాకార కదలికలలో స్క్రబ్ చేయాలి. సున్నితంగా మసాజ్ చేసి అనంతరం వెచ్చని నీటితో శుభ్రం చేయండి. ఇది గొప్ప ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేసి.. పెదవులకు మెరుపును అందిస్తుంది.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనె పోషణ, హైడ్రేటింగ్, మాయిశ్చరైజింగ్ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇది మీ పెదవులను పొడి బారనీయకుండా.. డల్‌గా కనిపించకుండా హైడ్రేటింగ్‌గా ఉంచుతుంది. పెదవులకు స్క్రబ్ చేసిన తర్వాత కొబ్బరి నూనెతీసుకుని పెదాలకు అప్లై చేయండి.
మెరుగైన ఫలితాల కోసం మీరు ప్రతిరోజూ రెండుసార్లు దీనిని ట్రై చేయవచ్చు. ఇలా చేయడం వల్ల పెదపులు హైడ్రేటింగ్ ఉండి నల్లబడకుండా ఉంటాయి.
కలబంద
చర్మ సంబంధిత సమస్యలకు అలోవెరా ఒక గొప్ప సహజమైన పరిష్కారంగా చెప్పవచ్చు. ఇది పెదవులను కాంతివంతం చేయడంలో కూడా మెరుగైన ఫలితాలు అందిస్తుంది.
కలబంద అలోయిన్‌తో నిండి ఉంటుంది. ఇది బలమైన డిపిగ్మెంటేషన్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మీ పెదవులపై ఉన్న నలుపు రంగును తొలగిస్తుంది. దీనికోసం మీరు అలోవెరా నుంచి తాజా జెల్ తీసుకుని పెదవులకు అప్లై చేయండి. కొంతసేపు అలాగే ఉంచి శుభ్రం చేయండి. మెరుగైన ఫలితాలకోసం రెగ్యూలర్‌గా అప్లై చేయండి.
కీరదోస రసం
కీరదోస మీ పెదాలను ఎలా ప్రకాశవంతం చేస్తుంది అనుకుంటున్నారా? అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, సిలికా సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి పిగ్మెంటేషన్, డల్నెస్ను పోగట్టడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి.
దీనికోసం మీరు కీరదోసను మెత్తగా గ్రైండ్ చేసి.. ఆ పేస్ట్‌ను మీ పైదాలపై అప్లై చేయండి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి.. నీటితో శుభ్రం చేయండి. మెరుగైన ఫలితాల కోసం ఈ రెమెడీని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు చేయండి.
పసుపు
పసుపు మీ పెదాలను ప్రకాశవంతంగా చేయడంలో మీకు చాలా సహాయం చేస్తుంది. 2010లో నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. ఈ అధ్యయనంలో పసుపులోని మెలనిన్ ఇన్హిబిటర్‌గా పనిచేస్తుందని తేలింది. మెలనిన్ పెదవులు నల్లగా మారడానికి ప్రేరేపిస్తుంది. పసుపు అప్లై చేయడం వల్ల ఆ నలుపు రంగు పోతుంది. దీనికోసం ఒక టేబుల్ స్పూన్ పాలను తీసుకుని.. దానికి తగిన మొత్తంలో పసుపు పొడిని కలపండి. పేస్ట్‌లా చేసి పెదవులపై అప్లై చేయాలి. ఆరినవెంటనే చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తూ మీ అధరాలను నల్లగా మారిపోకుండా కాపాడుకోవచ్చు.
టాపిక్