Water Tank Cool Tips : వేసవిలో వాటర్ ట్యాంక్‌లోని నీరు చల్లగా చేసేందుకు చిట్కాలు
Water Tank Cool In Summer : వేసవిలో నీరు వేడిగా అవ్వడం సహజం. కానీ మన రోజూవారి అవసరాలకు ఉపయోగించే నీరు వేడిగా ఉంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందుకోసమే ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్‌లోని నీరు చల్లగా ఉంచేందుకు ట్రై చేయాలి.
వేసవి వచ్చిందంటే వేడితో ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. ఇక మనం రోజూవారీ అవసరాల కోసం ఉపయోగించే నీరు కూడా వేడిగా మారుతుంది. దీంతో వాటిని ముట్టుకోవాలంటే భయం వేస్తుంది. సూర్యరశ్మితో వేడి అయిన నీటిని స్నానానికి ఉపయోగిస్తే కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఆ నీటిని చల్లగా చేసేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. సాధారణంగా దాదాపు ప్రతీ ఒక్కరి ఇంటిపై నల్లటి వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఎక్కువగా దీనినే ఉపయోగిస్తారు. మిగతా కాలాల్లో సమస్యలేమీ ఉండవు కానీ.. వేసవి వచ్చిందంటేనే ఈ నీటితో సమస్య మెుదలవుతుంది.
మధ్యాహ్నంపూట ఈ ట్యాంకులోని నీరు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. స్నానం చేయాలని అనిపించినా.. ఆ వేడి నీటితో మీకు ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే వాటర్ ట్యాంక్ నీటిని వేసవిలో చల్లగా చేసుకోవాలి. అందుకోసం కొన్ని రకాల చిట్కాలను పాటించాలి. అప్పుడే బాగుంటుంది.
వేసవిలో ట్యాంకర్‌లోని నీరు సులభంగా వేడినీరుగా మారుతుంది. దీని కారణంగా ఇది అత్యవసర అవసరాలకు ఉపయోగించాలంటే.. సరిగా ఉండదు. ట్యాంకర్‌లోని నీటిని కొన్ని సాధారణ పద్ధతులను ఉపయోగించి చల్లబరచవచ్చు. వేసవిలో మీ ఇంటి వాటర్ ట్యాంక్‌లోని నీటిని చల్లగా ఉంచుకోవాలంటే కొన్ని టిప్స్ ఫాలో కావాలి. వేసవిలో సూర్యకాంతి, వేడి కారణంగా నీటి ట్యాంక్‌లోని నీరు చాలా వేడిగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీకు కావాలంటే కొన్ని సాధారణ పద్ధతుల సహాయంతో వాటర్ ట్యాంక్‌లోని నీటిని చల్లబరచవచ్చు.
సాధారణంగా నల్లని నీటి ట్యాంక్ కంటే తెల్లటి నీటి ట్యాంక్ ఉత్తమం. ఎందుకంటే నలుపు రంగు వేడిని వేగంగా గ్రహిస్తుంది. దీని కారణంగా ట్యాంక్ త్వరగా వేడెక్కుతుంది. మీ ఇంట్లో నల్లటి ట్యాంక్ ఉంటే దానికి తెలుపు రంగు వేయండి. దీంతో ట్యాంక్‌లోని నీరు ఎక్కువసేపు చల్లగా ఉంటుంది. నలుపు రంగు అనేది వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది. అదే తెలుపు రంగు అయితే ఆ సమస్య ఉండదు.
నీరు ట్యాంక్ ద్వారా మాత్రమే కాకుండా పైపుల ద్వారా కూడా వేడి అవుతుంది. అటువంటి పరిస్థితిలో సూర్యకాంతి నుండి పైపును రక్షించడానికి ఒక కవర్‌ను ఉపయోగించవచ్చు. కవర్లు మార్కెట్‌లో సులభంగా దొరుకుతాయి. పైపులకు కవర్ చుట్టండి. వాటర్ ట్యాంక్‌లో నీరు చల్లగా ఉంటుంది.
వేసవిలో ట్యాంక్‌లోని నీరు నేరుగా సూర్యరశ్మికి గురికావడం వల్ల వెచ్చగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు ట్యాంక్‌పై సూర్యరశ్మి పడని ప్రదేశంలో ఉంచాలి.
ముందుగా నీటి ట్యాంక్‌ను సూర్యకాంతి నుండి రక్షించడానికి గన్నీ బ్యాగ్‌తో వాటర్ ట్యాంక్‌ను కవర్ చేయండి. తర్వాత టార్పాలిన్‌తో కప్పాలి. ఇది ట్యాంక్‌లోని నీటిని కొంతవరకు చల్లగా ఉంచుతుంది. అవసరమైతే గన్నీ బ్యాగులను మీరు నీటితో తడుపుకోవచ్చు.
అదేవిధంగా ట్యాంక్ అడుగున ఇసుకను నింపి దాని పైన ట్యాంక్ వేస్తే నీరు కాస్త చల్లగా ఉంటుంది.
ఒకవేళ మీకు నీరు చల్లగా ఉండాలంటే సింపుల్ చిట్కా మరొకటి కూడా ఉంది. మధ్యాహ్నంపూట మీ అవసరాలకు సరిపోయేందు నీటిని బకెట్లలో నింపేయండి. తర్వాత వీటిని వాడుకోండి. చల్లగా ఉంటాయి. లేదు అంటే మధ్యాహ్నంపూట మోటర్ వేసి నీరు ట్యాంకులోకి ఎక్కించండి. కాసేపు అయినా కూల్‌గా ఉంటాయి.