Testosterone food: ఆ సత్తువ తగ్గిందా? ఈ ఆహారంతో చెలరేగిపోండి-how to increase testosterone levels know booster food sources here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  How To Increase Testosterone Levels Know Booster Food Sources Here

Testosterone food: ఆ సత్తువ తగ్గిందా? ఈ ఆహారంతో చెలరేగిపోండి

HT Telugu Desk HT Telugu
Mar 20, 2023 08:01 PM IST

Testosterone Boosters: టెస్టొస్టెరోన్ లెవెల్స్ తగ్గితే మీలో సెక్స్ డ్రైవ్ తగ్గుతుంది. మరి మళ్లీ పుంజుకోవాలంటే ఈ ఆహారం తరచూ తీసుకోండి.

7 రకాల ఆహారాలతో టెస్టోస్టెరోన్ లెవెల్స్ పెంచుకోండి
7 రకాల ఆహారాలతో టెస్టోస్టెరోన్ లెవెల్స్ పెంచుకోండి (unsplash)

Testosterone Boosters: లైంగిక శక్తి బాగుండాలంటే మీలో టెస్టొస్టెరోన్ లెవెల్స్ తగినంతగా ఉండాలి. టెస్టొస్టెరోన్ అనేది ఒక హార్మోన్. ఇది వృషణాల్లో ఉత్పత్తి అవుతుంది. మహిళల అండాశయంలో కూడా టెస్టొస్టెరోన్ ఉత్పత్తి అయినా… అది చాలా స్వల్పమొత్తమే. టెస్టొస్టెరోన్ కౌమార దశలో ఉత్పత్తి అవడం ప్రారంభమై వయస్సు పెరుగుతున్న కొద్దీ తగ్గుతూ ఉంటుంది. టెస్టొస్టెరోన్ సెక్స్ డ్రైవ్‌లో కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే స్పెర్మ్ ఉత్పత్తిలో ముఖ్య భూమిక పోషిస్తుంది. ఎముకలు, కండరాల ఆరోగ్యంలో కూడా దీనిది ప్రధాన పాత్రే. అలాగే ఎర్ర రక్త కణాల ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా పురుషుడి మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది.

టెస్టొస్టెరోన్ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు సెక్స్ డ్రైవ్ తగ్గుతుంది. అలాగే శక్తి తగ్గుతుంది. బరువు పెరుగుతారు. డిప్రెషన్ బారిన పడుతారు. ఎప్పుడూ మూడీగా కనిపిస్తారు. ఆత్మ గౌరవం తగ్గుతుంది. శరీరంపై వెంట్రుకలు తగ్గుతాయి. ఎముకలు పలుచనవుతాయి. టెస్టొస్టెరోన్ తగ్గినప్పుడు సెక్స్‌పై ఆసక్తి తగ్గడం, ఎముకల్లో బలం తగ్గడం, ఏకాగ్రత తగ్గడం, డిప్రెషన్ వంటి లక్షణాలు గమనించవచ్చు.

వయస్సు పైబడిన కొద్దీ టెస్టొస్టెరోన్ లెవెల్ తగ్గడం సహజమే. కానీ టెస్టొస్టెరోన్ తగ్గడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. వృషణాలకు దెబ్బ తగలడం వంటి కారణాలతో పాటు పలు ఇతర వ్యాధులు కూడా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సకు ఉద్దేశించిన కీమో థెరపీ వల్ల కూడా టెస్టొస్టెరోన్ తగ్గుతుంది. అలాగే ఎయిడ్స్, కిడ్నీ వ్యాధులు, రోజూ మద్యపానం, లివర్ సిరోసిస్ వంటి సమస్యల వల్ల టెస్టొస్టెరోన్ త్గుతుంది.

అండాశయం తొలగించినప్పుడు, అలాగే పిట్యూటరీ గ్రంథి పనిచేయనప్పుడు, హైపోథాలమస్, అడ్రినల్ గ్రంథులు పనిచేయనప్పుడు మహిళల్లో టెస్టొస్టెరోన్ తగ్గుతుంది.

టెస్టొస్టెరోన్ పెరిగేందుకు దోహదపడే ఆహారం

  1. అల్లం: అల్లం పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. 2012లో జరిగిన ఓ అధ్యయనంలో మూడు నెలలపాటు రోజూ అల్లం సప్లిమెంట్ తీసుకున్న 75 మంది బృందంలో 17.7 శాతం మందిలో టెస్టొస్టెరోన్ స్థాయి పెరిగింది. 2013లో నిర్వహించిన మరో అధ్యయనంలో కూడా డయాబెటిస్ ఉన్న ఎలుకలకు అల్లం ఇచ్చినప్పుడు 30 రోజుల్లోనే టెస్టొస్టెరోన్, యాంటీయాక్సిడెంట్లు పెరిగాయి.
  2. ఉల్లిగడ్డ: ఉల్లి గడ్డ రక్తాన్ని పలుచన చేసి గుండెకు మేలు చేస్తుందని మనకు తెలుసు. అయితే ఇది టెస్టొస్టెరోన్ లెవెల్స్ కూడా పెంచుతుంది. ఈమేరకు పలు అధ్యయనాలు కూడా రుజువు చేశాయి.
  3. దానిమ్మ: చాలా కాలం నుంచి దానిమ్మ కాయలు సంతానోత్పత్తి సామర్థ్యం పెంపు, లైంగిక సామర్థ్యం పెంపునకు పేరుగాంచాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి, ఒత్తిడి తగ్గడానికి దోహదపడుతాయి. 2012 లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం దానిమ్మ కాయలు పురుషులు, మహిళల్లో టెస్టొస్టెరోన్ లెవెల్స్ పెంచాయి. 14 రోజుల పాటు 60 మంది ఆరోగ్యవంతులు దానిమ్మ రసం తాగగా, వారిలో 24 శాతం మేర టెస్టొస్టెరోన్ స్థాయి పెరిగింది. వారి మానసిక స్థితి, బ్లడ్ ప్రెషర్ స్థాయి కూడా మెరుగైంది.
  4. విటమిన్ డీ: విటమిన్ డీ కూడా టెస్టొస్టెరోన్ లెవెల్స్‌ను పెంచుతుంది. సూర్యరశ్మి నుంచి లభించే విటమిన్ డీ ద్వారా టెస్టొస్టెరోన్ లెవల్ పెరుగుతుంది. అలాగే విటమిన్ డీ లభించే మొక్కల ఆధారిత ఆహారం కూడా టెస్టొస్టెరోన్ స్థాయిని పెంచుతుంది.
  5. ఆకు కూరలు: పాల కూర వంటి ఆకు కూరల్లో మెగ్నిషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి. ఇది టెస్టొస్టెరోన్ లెవెల్స్ పెంచుతుంది.
  6. కొవ్వు చేపలు, చేప నూనె: ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలు తినడం ద్వారా టెస్టొస్టెరోన్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే ఫిష్ ఆయిల్, ఒమెగా-3 సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. మాకరెల్, హెరింగ్, సాల్మన్, సార్డైన్స్, ట్రౌట్ తదితర చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
  7. ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్‌లో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీని ద్వారా టెస్టొస్టెరోన్ లెవెల్స్ పెరుగుతాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్