Matchmaking Tips | మీరు ఇష్టపడేవారు మిమ్మల్ని ఇష్టపడాలంటే ఇవిగో టిప్స్!
Matchmaking Tips: మీరు ఇష్టపడే వారు మిమ్మల్ని ఇష్టపడి మీ మధ్య సంబంధం కుదరాలంటే జాగ్రత్తగా డీల్ చేయలి. మీ ఫస్ట్ డేట్ లో ఎలా వ్యవహరించాలో ఇక్కడ టిప్స్ ఉన్నాయి.
మీ జీవితంలో మీరు చాలా ఇష్టపడే ప్రత్యేకమైన వ్యక్తి ఒకరు ఉన్నారంటే ఆ భావన ఎంతో అద్వితీయమైనది. మీరు ఇష్టపడే వారు మిమ్మల్ని కూడా ఇష్టపడుతున్నారంటే మీరు నిజంగా అదృష్టవంతులే. కానీ మీ మధ్య ఆ మ్యాజిక్ జరగాలంటే అందుకు సరైన సందర్భంలో సరైన విధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. మాటల్లో చెప్పలేనివి మనసుతో చెప్పాలి, మన నడవడికతో చెప్పాలి.

మీరు ఇష్టపడే అమ్మాయి లేదా అబ్బాయితో మీరు మొదటిసారిగా బయటకు వెళ్తున్నప్పుడు లేదా వారిని చాలా కాలం తర్వాత కలుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ మాత్రం తేడా వచ్చినా వారి వైఖరిని మార్చుకోవచ్చు. ‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్’ అంటారు. అందుకే వారిపై మీకున్న సదభిప్రాయం మరో మెట్టుకు చేరి, మీ మధ్య మరింత దగ్గరి బంధం ఏర్పడాలంటే మీరు వారిని తొలి సమావేశంలోనే ఆకట్టుకోవాలి.
First Date- Matchmaking Tips
మనం ఇష్టపడే వారిని కలుస్తున్నప్పుడు చాలా రకాల ఆలోచనలు మదిలో మెదులుతాయి. ఎలా మాట్లాడాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎలా మాట్లాడితే ఇంప్రెస్ అవుతారో అనే కొన్ని రకాల ఆందోళనలు మొదలవుతాయి. కానీ కూల్‌గా ఉండండి, దీని గురించి ఏమాత్రం చింతవద్దు. ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి, వీటిని పాటించి మీ మ్యాచ్ ఫిక్స్ చేసుకోండి.
మీరు మీలాగే ఉండండి
మీరు వారిని కలవబోతున్నారంటే వారికి మీపై ఒక అభిప్రాయం, అవగాహన ఉండే ఉంటుంది. కాబట్టి మీరు వారిని ఆకట్టుకోవడానికి మీది కాని కొత్త పాత్రలోకి దూరాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి వారో, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో అలాగే నడుచుకోండి. ఇంప్రెస్ చేయడానికి వింత ప్రయత్నాలు చేయవద్దు. వారితో మీరు సౌకర్యంగా ఉండేందుకు ప్రయత్నించండి, వారు అలాగే సౌకర్యంగా ఉండేలా చేయండి.
మాటలపై దృష్టి పెట్టండి
ఇద్దరు కలిసినపుడు సంభాషణ అనేది అత్యంత కీలకమైన విషయం. మీ గురించి మీరు నొక్కిచెప్పే బదులు, సాధారణంగా మాట్లాడండి. మీరు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో ఆ విషయంపై దృష్టిపెట్టండి. ఆ విషయంపై వారి అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. దాని గురించి మాట్లాడేందుకు వారికి అవకాశం ఇవ్వండి. సంభాషణ పూర్తిగా మృదువుగా ఉండాలి. అందులో నిజాయితీ కూడా కనిపించాలి.
సరైన దుస్తులను ఎంచుకోండి
మీరు మీ వ్యక్తిత్వానికి తగినట్లుగా దుస్తులు వేసుకోవాలి. మీరు ఎంచుకున్న దుస్తులతో సౌకర్యంగా ఉండాలి. మీ వార్డ్రోబ్ మీ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతుందని గుర్తుంచుకోండి. మీరు రిలాక్స్‌డ్‌గా కనిపించాలనుకుంటే బూట్లు, సాదా టీ-షర్ట్ ధరించండి. లైట్ షేడ్స్ కలిగిన దుస్తులు, ఇస్తీ చేసిన దుస్తులు ధరించాలి. మీరు హుందాగా కనిపించాలి. మీ మానసిక స్థితికి అనుగుణంగా దుస్తులు ధరించండి. మీ వ్యక్తిత్వానికి బాగా సరిపోయే దుస్తులు, కేశాలంకరణ, రూపాన్ని ఎంచుకోండి.
అతి చేయవద్దు
ఏ విషయంలోనూ అతి చేయవద్దు. అన్ని ముందుగానే చెప్పేయడం, మీరేంటో పూర్తిగా తెలియజేయడం ద్వారా ఇక తెలుసుకోవాల్సింది ఏమి ఉండదు. ఎంత తక్కువలో ఉంటే అంత ఎక్కువ తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. మేకప్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. మీ స్కిన్ టోన్‌ను వీలైనంత సహజంగా ఉంచుకోవడం మంచిది. అధిక వినియోగం ఏ రకంగా ఉపయోగపడదు.
సువాసన వెదజల్లండి
మీరు పరిశుభ్రంగా కనిపించాలి, మీ నుంచి మంచి సువాసన రావాలి. అలా అని ఘాటైన పెర్ఫ్యూమ్ ఎంచుకోకూడదు. మీరు ఇంటి నుండి బయలుదేరే ముందు స్ప్రే చేయండి. ఏదో ఒక పెర్ఫ్యూమ్ మాత్రమే ఉపయోగించండి, తేలికైన స్వీట్ పెర్ఫ్యూమ్ ఎంచుకోండి. మీరు ఉపయోగించే ప్రత్యేకమైన పెర్ఫ్యూమ్ మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది, వారికి మీపై మరింత మంచి అభిప్రాయం కలుగుతుంది.
సంబంధిత కథనం