Social anxiety in teens: మీ పిల్లల్లో సోషల్ యాంగ్జైటీ కనిపిస్తోందా? నిపుణుల సూచనలివే-how to identify social anxiety in teens know parenting tips from experts to deal with it ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  How To Identify Social Anxiety In Teens Know Parenting Tips From Experts To Deal With It

Social anxiety in teens: మీ పిల్లల్లో సోషల్ యాంగ్జైటీ కనిపిస్తోందా? నిపుణుల సూచనలివే

పిల్లల్లో సోషల్ యాంగ్జైటీ ఇలా గుర్తించండి
పిల్లల్లో సోషల్ యాంగ్జైటీ ఇలా గుర్తించండి (Photo by Bastian Riccardi on Pexels)

Social anxiety in teens: మీ పిల్లల్లో సోషల్ యాంగ్జైటీ కనిపిస్తోందా? నిపుణుల సలహాలు తెలుసుకుని వాటిని గుర్తించి మీ పిల్లలకు అండగా నిలవండి.

నలుగురిలో కలవలేకపోవడమే సోషల్ యాంగ్జైటీ. దీనినే సోషల్ ఫోబియా అని కూడా అంటారు. కొందరు పిల్లల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. నలుగురితో కలిసినప్పుడు భయం, అసౌకర్యం వల్ల ఇది ఏర్పడుతుంది. నలుగురూ తమను చూస్తున్నప్పుడు వాళ్లు ఏమనుకుంటున్నారోనన్న భయం, ఇతరులు తమను జడ్జ్ చేస్తారన్న భయం వల్ల ఈ సోషల్ యాంగ్జైటీ ఏర్పడుతుంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ సోషల్ యాంగ్జైటీ కారణంగా స్కూల్‌కు వెళ్లకపోవడం, లేదా ఆఫీస్‌కు వెళ్లకపోవడం, కొత్త వారిని కలవడానికి ఇష్టపడకపోవడం, చివరకు ఇల్లు వదిలివెళ్లాలనిపించకపోవడం వంటి సమస్యలు ఏర్పడుతాయి. ముఖ్యంగా ఇది కౌమారదశలో ఉన్న పిల్లల జీవన నాణ్యతపై ప్రభావం చూపుతుంది. అందువల్ల సోషల్ యాంగ్జైటీని గుర్తించి తగిన సహాయం అందించడం అవసరం.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ (ఐఐఏడీ) అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఉషా పటేల్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాలపై మాట్లాడారు. సోషల్ యాంగ్జైటీకి సంబంధించి కొన్ని సంకేతాలు, లక్షణాలు వివరించారు.

సోషల్ యాంగ్జైటీ సంకేతాలు, లక్షణాలు

  1. దైనందిన ఘటనల్లో సెల్ప్ కాన్షియస్‌నెస్ ఎక్కువగా ఉండడం.
  2. ఇతరుల ముందు అవమానాలకు గురవుతానేమోన్న భయాందోళన
  3. సామాజిక సందర్భాల నుంచి దూరంగా ఉండడం
  4. రాబోయే సామాజిక సంఘటనల గురించి తీవ్రమైన ఆందోళన
  5. నలుగురితో కలిసి ఉన్నప్పుడు వణుకు, చెమట పట్టడం, గుండె దడ వంటి శారీరక లక్షణాలు

విద్యార్థుల ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు, వారు తిరిగి పుంజుకునేందుకు వీలుగా తల్లిదండ్రులు, టీచర్లు, విద్యార్థుల్లో బిహేవియరల్ సైన్స్ మార్గదర్శిలా పనిచేస్తుంది. నాన్-కాగ్నిటివ్ స్కిల్స్‌పై ఫోకస్ చేసే టెక్నిక్స్ అనుసరించడం, ఎమోషనల్ ఇంటిలిజెన్స్ పెంపొందించడం, సోషల్ యాంగ్జైటీ విషయాల్లో పిల్లలకు సహాయకారిగా ఉండడం వల్ల వారిలో సానుకూల ఆలోచనలు మెరుగవుతాయి.

నోయిడాలోని ఐఎంఎస్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ కుల్‌నీత్ సూరీ ఈ అంశాలపై మాట్లాడారు. ‘విద్యార్థులు, టీనేజర్లు, వయోజనులు స్వతంత్రంగా ఆలోచించడానికి, సందర్భాలు తమకు అనుకూలంగా లేనప్పుడు ప్రవర్తనలో మార్పులు చేసుకోవడం వంటివి మెటా కాగ్నిటివ్ స్కిల్స్ వల్ల సాధ్యపడతాయని ఇటీవలి అధ్యయనం తెలిపింది. ఉమ్మడి ప్రయోజనాలు షేర్ చేసుకోవడం పిల్లల్లో సోషల్ యాంగ్జైటీని దూరం చేస్తాయి. ఇది తరగతి గదిలో చురుకైన భాగస్వామ్యం వల్ల ఇది సాధ్యమవుతుంది..’ అని వివరించారు. సోషల్ యాంగ్జైటీని డీల్ చేసేందుకు ఆమె పలు సూచనలు ఇచ్చారు.

  1. యాంగ్జైటీ లక్షణాలు తగ్గేందుకు వీలుగా కొన్ని వ్యాయామాలను పిల్లలు వారి రోజువారీ షెడ్యూలులో చేర్చుకోవాలి. సోషల్ యాంగ్జైటీ వల్ల ఎదురయ్యే శారీరక ప్రతికూలతలను తగ్గించడం జాగరూకత (మైండ్‌ఫుల్‌నెస్) విధానాన్ని అవలంబించడం, మెడిటేషన్, యోగా, డీప్ బ్రీతింగ్ వంటి వల్ల సాధ్యపడుతుంది.
  2. తక్కువగా భయపెట్టేవాటిని ముందుగా డీల్ చేయాలి. మీకు మీరుగా వాటిని డీల్ చేయగలరేమో చూడాలి. తద్వారా మీరు ఆందోళన ఎదుర్కొంటున్న సందర్భాల్లో మీరు మెరుగ్గా ప్రవర్తించగలుగుతారు.
  3. ట్రైనింగ్ సెషన్ల ద్వారా పాజిటివ్ మైండ్‌సెట్ అలవరచుకుంటే రిలేషన్‌షిప్స్ పటిష్టమవడంలో ప్రయోజనం ఉంటుంది. మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. చదువపై ఫోకస్ పెరుగుతుంది.
  4. టీనేజర్లు కార్యనిర్వాహక నైపుణ్యాలు అలవరచుకోవడంలో సహాయపడాలి. వారు ప్లాన్ చేసుకుని, ఫోకస్ పెంచుకుని విజయవంతం కావడంలో సహాయపడాలి. దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పరచుకుని అవి విజయవంతమయ్యే దిశగా కృషి చేస్తే సోషల్ యాంగ్జైటీని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

సరైన మార్గదర్శకతం, అసెస్‌మెంట్ ఉంటే టీనేజర్లు సోషల్ యాంగ్జైటీని సులువుగా అధిగమించగలరు. వారు సోషల్ యాంగ్జైటీ ఎదుర్కొంటున్నట్టు మీరు అనుమానిస్తే మానసిక ఆరోగ్య నిపుణులు మీ పిల్లల లక్షణాలు గమనించి చికిత్స అందిస్తారు. వారు దానిని అధిగమించి సంతోషంగా జీవించగలిగేలా చేస్తారు.

WhatsApp channel