చాణక్యుడు తన చాణక్య నీతిలో గొప్ప గొప్ప విషయాలు వివరించాడు. డబ్బుకు సంబంధించిన విషయాలను పేర్కొన్నాడు. చాణక్యుడి ప్రకారం డబ్బును ఇష్టం వచ్చినట్టుగా చూస్తే.. అది మిమ్మల్ని దరిద్రులను చేస్తుంది. నేటి ప్రపంచంలో ప్రాథమిక అవసరాలు, విలాసాలు రెండింటికీ డబ్బు అవసరం. చాణక్య నీతిలో చాణక్యుడు సంపద గురించి ఎన్నో విషయాలు పేర్కొన్నాడు. చాణక్యుడి ప్రకారం కొన్ని విషయాలపై శ్రద్ధ చూపకపోతే ధనవంతుడు కూడా పేదవాడు అవుతాడు.
చాణక్యుడు ప్రకారం, ఒక వ్యక్తిని పేదరికానికి దారితీసేందుకు చాలా కారణాలు ఉన్నాయి. చాణక్య నీతిలో వ్యక్తి ఆర్థిక నాశనానికి దారితీసే కొన్ని అంశాలను ప్రస్తావించాడు. డబ్బును సక్రమంగా ఉపయోగించడం గురించి కొన్ని సలహాలు ఇచ్చాడు. మీరు వాటిని చూడవచ్చు.
చాణక్య నీతి ప్రకారం ధనవంతుడు తన డబ్బును ఎప్పుడూ దాచిపెట్టకూడదు. డబ్బును సరైన పనికోసం పెట్టుబడి పెట్టాలి. డబ్బు దాచిపెట్టేవారి దగ్గర లక్ష్మీదేవి ఎక్కువ కాలం నిలవదు. కాలక్రమేణా డబ్బు దాని విలువను కోల్పోవడం ప్రారంభమవుతుంది. డబ్బును మంచి ప్రదేశంలో పెట్టుబడి పెట్టడం వల్ల డబ్బు పెరుగుతుంది. మీకు భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే డబ్బును ఎక్కడైనా పెట్టుబటి పెట్టండి.
చాణక్యుడు ప్రకారం అధర్మ మార్గాన్ని అనుసరించే వ్యక్తి వద్ద డబ్బు ఎప్పుడూ ఉండదు. అధర్మ మార్గాన్ని అనుసరించేవారికి ఎక్కువ డబ్బు రావడం ప్రారంభిస్తే వారు త్వరలో వినాశన మార్గంలో పడతారని తెలుసుకోండి. అందుకే మంచి మార్గంలో డబ్బును సంపాదించాలి. అప్పుడే జీవితంలో ముందుకు సాగుతారు.
దానం చేయడం చాలా మంచి విషయం. మనిషి తన శక్తి మేరకు మాత్రమే దానధర్మాలు చేయాలని చాణక్యుడు చెబుతున్నాడు. ఆదాయానికి మించి విరాళాలు ఇవ్వడం వల్ల పేదవారిగా మారిపోతారు. ఎల్లప్పుడూ మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఖర్చు చేయాలి. అతిగా ఖర్చు చేస్తే మీరు త్వరలోనే దరిద్రులవుతారు. మీరు సంపాదించిన డబ్బును ఆదా చేయండి. దానికి తగ్గట్టుగా ఇతరులకు సాయం చేయాలి.
మీరు మీ ఖర్చులను నియంత్రించుకోకపోతే ఎంత డబ్బు సంపాదించినా ఉపయోగం లేదు. మీరు జీరోకి వెళ్లిపోతారు. అప్పుడు మళ్లీ ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఎక్కువ డబ్బు సంపాదించడం వల్ల ధనవంతులు కాలేరు. డబ్బును సక్రమంగా వినియోగించకుంటేనే ధనవంతులుగా ఉంటారు.
మీ దగ్గర ఉన్న డబ్బు గురించి గర్వపడకూడదని చాణక్య నీతి చెబుతుంది. ఎప్పుడూ జీవితంలో వినయంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. డబ్బు విషయంలో అహంకారాన్ని మనసులోకి రానివ్వకూడదు. అహం మీ తెలివిని పాడు చేస్తుంది. ఒకరి సంపద త్వరగా నశిస్తుంది. అహంకారానికి దూరంగా ఉండండి, మీ ప్రవర్తనలో వినయంగా ఉండండి.
డబ్బు విషయంలో చాణక్యుడు చెప్పిన మాటలు ఫాలో అయితే మీరు జీవితంలో సంతోషంగా ఉండవచ్చు. చాణక్య నీతి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చెబుతుంది. వాటిని పాటిస్తే మీరు మంచి జీవితాన్ని పొందవచ్చు.