Hair Growth Tips : జుట్టు పెరగడం ఎలా? ఇదిగో ఆయుర్వేద చిట్కాలు-how to grow hair faster and thicker as per ayurveda know in details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Growth Tips : జుట్టు పెరగడం ఎలా? ఇదిగో ఆయుర్వేద చిట్కాలు

Hair Growth Tips : జుట్టు పెరగడం ఎలా? ఇదిగో ఆయుర్వేద చిట్కాలు

HT Telugu Desk HT Telugu
Sep 15, 2023 03:15 PM IST

Ayurveda Hair Care Tips : జుట్టు రాలడం అనేది పురుషులు, మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్య. అనారోగ్యకరమైన జుట్టు సంరక్షణ, హార్మోన్ల మార్పులు, ఒత్తిడి వంటి వివిధ కారణాలు జుట్టు రాలే సమస్యకు దారితీస్తాయి. కొన్ని చిట్కాలు పాటించి.. దీని నుంచి బయటపడొచ్చు.

జుట్టు పెరగడానికి చిట్కాలు
జుట్టు పెరగడానికి చిట్కాలు (unsplash)

ఒత్తిడి మీ శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మీ జుట్టు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీనికి భయపడవద్దు. ఎందుకంటే ఆయుర్వేదం మీకు అవసరమైన పరిష్కారాన్ని అందిస్తుంది. జుట్టు రాలడం సమస్యను ఎదుర్కొంటే.. ఇక్కడ కొన్ని ఉత్తమమైన ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి.

ఆయుర్వేద జుట్టు సంరక్షణ విషయానికి వస్తే భృంగరాజ్ నూనె ఉత్తమమైనది. జుట్టు పోషణకు ప్రసిద్ధి చెందినది భృంగరాజ్. ఈ నూనెను మీ తలకు పట్టించి మసాజ్ చేయండి. ఇది తలకు రక్త ప్రసరణను పెంచుతుంది. జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. జుట్టు మూలాలను బలపరుస్తుంది. ఒత్తిడితో కూడిన జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఉసిరి, ఇండియన్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు. ఇది విటమిన్ సి యొక్క గొప్ప మూలం. ఈ సూపర్ ఫ్రూట్ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మీ జుట్టుకు అద్భుతాలు చేస్తుంది. ఉసిరిని పచ్చిగా తీసుకోవడం లేదా మీ జుట్టు సంరక్షణ దినచర్యలో జోడించడం వల్ల ఒత్తిడి ప్రేరిత జుట్టు రాలడాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు మూలాలకు పోషణనిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. మెరుపును జోడిస్తుంది.

అశ్వగంధ మూలిక ఒత్తిడి కారణంగా జుట్టు రాలడాన్ని ఎదుర్కోవడానికి మీకు చాలా సహాయపడుతుంది. మీ శరీరం ఒత్తిడికి అనుగుణంగా సహాయపడుతుంది. జుట్టు రాలడానికి కారణమయ్యే కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. క్యాప్సూల్స్ లేదా హెర్బల్ టీ రూపంలో మీ దినచర్యకు అశ్వగంధను జోడించడం వల్ల మీ జుట్టు సహజ మెరుపు, ప్రకాశాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.

వేప ఆయుర్వేద వైద్యంలో ముఖ్యమైనది. ఇందులోని యాంటీమైక్రోబయల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఒత్తిడితో కూడిన జుట్టు రాలడాన్ని తగ్గించడంతోపాటు వివిధ స్కాల్ప్ సమస్యలకు ఒక మందు. వేప తలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మంటను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఉత్తమ ఫలితాల కోసం వేప నూనె లేదా వేప ఆధారిత జుట్టు ఉత్పత్తులను ఉపయోగించవచ్చు.

కలబంద మీ జుట్టుకు అద్భుతాలు చేస్తుంది. జుట్టు సంరక్షణ విషయంలో కలబంద చాలా ముఖ్యమైన అంశం. ఇది స్కాల్ప్ pH స్థాయిని సమతుల్యం చేయడానికి, జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి, ఒత్తిడి కారణంగా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలోవెరా జెల్‌ను నేరుగా మీ తలకు అప్లై చేయండి. మీ జుట్టును తేమ చేస్తుంది. నిగనిగలాడే షైన్ ఇస్తుంది.

Whats_app_banner