Ginger Plant: ఇంట్లోనే అల్లం మొక్కను ఇలా పెంచేయండి, ఈ టిప్స్ తో సులువుగా పెంచుకోవచ్చు-how to grow a ginger plant at home you can grow it easily with these tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ginger Plant: ఇంట్లోనే అల్లం మొక్కను ఇలా పెంచేయండి, ఈ టిప్స్ తో సులువుగా పెంచుకోవచ్చు

Ginger Plant: ఇంట్లోనే అల్లం మొక్కను ఇలా పెంచేయండి, ఈ టిప్స్ తో సులువుగా పెంచుకోవచ్చు

Haritha Chappa HT Telugu
Published Feb 11, 2025 08:30 AM IST

అల్లంను దాదాపు ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తుంటారు.దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.అల్లం గొంతునొప్పి, దగ్గు, జలుబు నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. చాలా మంది దీనిని మార్కెట్ నుండి కొనుగోలు చేస్తారు. అల్లం ఇంట్లో సులభంగా పెంచవచ్చు.

అల్లం పెంచడం ఎలా?
అల్లం పెంచడం ఎలా? (Pixabay)

అల్లంను అనేక వంటకాల్లో ఉపయోగిస్తారు. మాంసాహారానికి అల్లం తప్పనిసరి. శాకాహారానికి కూడా అల్లం విరివిగా ఉపయోగిస్తారు. టీలో అల్లం వేసుకుని తాగే వారు ఎక్కువే. అల్లం వేసిన టీ తాగడానికి కూడా రుచికరంగా ఉంటుంది. అల్లం కషాయంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం గొంతునొప్పి, దగ్గు, జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే దాదాపు ప్రతి ఒక్కరూ అల్లంను మార్కెట్ నుండి కొనుగోలు చేస్తారు.

కానీ, అల్లంను ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు. ఇలా పెంచుకుంటే ఇంట్లోనే తాజా అల్లం దొరుకుతుంది. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి. ఇంట్లో అల్లం ఎలా పండించాలో ఇక్కడ తెలుపబడింది.

ఎలాంటి అల్లం?

అల్లం మొక్కను పెంచడానికి ముందు నల్లగా ఉన్న అల్లాన్ని ఎంపికచేసుకోవాలి. అల్లం మరీ పెద్దగా ఉంటే కొంచెం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం ముక్కలు ఒకటి నుండి ఒకటిన్నర అంగుళాల పొడవు ఉండేలా చూసుకోవాలి. అల్లం ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి.

అల్లం మొక్కను పెంచడం ఎలా?

అల్లం మొక్కను పెంచేందుకు కొంచెం పెద్ద కుండీని తీసుకోవాలి. అందులో సారవంతమైన మట్టిని వేయాలి. ఆ మట్టి మరీ గట్టిగా కాకుండా వదులుగా ఉండేలా చూసుకోవాలి. నది నుండి తెచ్చిన మట్టి అయినా మంచిది. పాత్రలో మట్టి పోసి దానిపై నీరు చల్లాలి. గంట తర్వాత అల్లం ముక్కలను అందులో నాటాలి.

అల్లం కుండీని కాంతి తగిలేలా ఉంచాలి. ప్రతిరోజూ నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. ప్రకాశవంతమైన ప్రదేశంలో ఉంచాలి. ఉదయాన్నే సూర్యరశ్మి తగలేగా కుండను పెట్టడం మంచిది. అయితే నేరుగా సూర్యరశ్మి తగలకూడదు. అయితే ఈ కుండీలను కిటికీల దగ్గర ఉంచితే కొంత వెలుతురు వస్తుంది. మట్టి ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మట్టి ఎండిపోయిన తర్వాత నీరు పోయాలి.

ఒకే కుండీలో ఎక్కువ అల్లం ముక్కలు నాటుతాం కాబట్టి ఎక్కువ మొక్కలు మొలకెత్తుతాయి. నాటిన అల్లం నుంచి మొలకలు సుమారు 3 నుంచి 8 వారాల్లో వస్తాయి. మొక్క కొద్దిగా పెరగనివ్వాలి. ఆ తర్వాత అల్లం మొక్కలను కోసి మళ్లీ వివిధ కుండీల్లో సారవంతమైన మట్టిలో నాటాలి.

అల్లం మొక్కలు నాటిన కుండీలను కాంతికి దగ్గరగా ఉంచాలి. సూర్యరశ్మి తగలడం మంచిది. క్రమం తప్పకుండా నీరు పోయాలి. అవసరమైతే లిక్విడ్ ఆర్గానిక్ ఎరువును ఉపయోగించవచ్చు. అల్లం సాగు సుమారు 8 నెలల్లో పూర్తవుతుంది. ఈ విధంగా ఇంట్లో అల్లం పండించవచ్చు.

అల్లంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అల్లంలో విటమిన్ సి, బి6, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అల్లం తినడం వల్ల జీర్ణ సమస్యలు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తగ్గుతాయి. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం