Rats In Home : ఇలా చేస్తే ఒక్క ఎలుక కూడా మీ ఇంట్లోకి అస్సలు రాదు
Get Rid Of Rats In Telugu : ఇంట్లో ఎలుకలు ఉంటే ఆ చిరాకు చెప్పలేనంతగా ఉంటుంది. ఇంటి చుట్టు పక్కల కనిపించినా కొందరికి ఏదోలా అనిపిస్తుంది. అందుకే వాటిని తరిమికొట్టేందుకు చిట్కాలు వెతకాలి. ఇప్పుడు చెప్పబోయే టిప్స్ మీకు చాలా ఉపయోగపడతాయి.
ఎలుకలను తరిమికొట్టేందుకు చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు. వాటిని చంపేందుకు కూడా బోనులాంటిది తెచ్చి చూశారేమో. అయినా వాటి బెడద తగ్గదు. కాస్త తెలివిగా చిట్కాలు పాటిస్తే.. మళ్లీ మీ ఇంటివైపునకు ఎలుకలు రాకుండా చేయెుచ్చు. సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. ఎలుకలను ఇంట్లో నుండి తరిమికొట్టడానికి ఉపయోగపడేవి ఏంటో తెలుసుకోవచ్చు.
గ్రామం, నగరం అనే తేడా లేకుండా చాలా ఇళ్లలో ఎలుకల బెడద ఉంటుంది. ఎలుకలు మన బట్టలు, ఆహారం, పుస్తకాల నుండి ప్రతిదీ పాడు చేస్తాయి. వివిధ ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయి. ఇంట్లో ఎలుకలు ఉంటే మనశ్శాంతి ఉండదు. ఎలుకల బెడద నుంచి పూర్తిగా బయటపడాలంటే దుకాణంలో కొన్ని రకాల ఉత్పత్తులు కొని ఉపయోగిస్తారు. నిత్యం దుకాణాల్లోని ఉత్పత్తులను కొని వాడే బదులు ఇంట్లోని ఉత్పత్తులతో ఎలుకల నుంచి ఉపశమనం పొందొచ్చు. దుకాణాల నుంచి కొనే మందులు మనుషులకు హానికరం. ఈ కింది చిట్కాలు పాటించి ఎలుకలు మీ ఇంటికి రాకుండా చేయండి.
పుదీనా వాసనను ఎలుకలు ఇష్టపడవు. చిన్న గుడ్డ ముక్కపై కొంచెం పుదీనా నూనెను చల్లి, ఎలుకలు వచ్చే ప్రవేశద్వారం, మూలలు, రంధ్రాలలో ఉంచండి. ఎలుకలు సాధారణంగా మూలల్లో నివసిస్తాయి. ఈ వస్త్రాన్ని ప్రతి 2 రోజులకు ఒకసారి మార్చాలి. ఈ పుదీనా నూనె సువాసన మీ ఇంటిని తాజాగా ఉంచుతుంది. ఎలుక రాకుండా కూడా ఉపయోగపడుతుంది.
ఉల్లి ఘాటైన వాసన మనుషులకే కాదు ఎలుకలకు కూడా చికాకు కలిగిస్తుంది. ఉల్లిపాయలు కుళ్ళిపోయే అవకాశం ఉన్నందున, వాటిని ప్రతి 2 రోజులకు మార్చాలి. కాస్త కట్ చేసి.. ఎలుకలు వచ్చే ప్రదేశంలో పెట్టాలి. కుళ్ళిన ఉల్లిపాయలు దుర్వాసనతో కూడినవి. అందుకే మారుస్తూ ఉండాలి.
ఒలిచిన, తరిగిన వెల్లుల్లిని నీళ్లలో కలిపి ఎలుకల నివారణ మందును తయారు చేసుకోవచ్చు. దీనిని సీసాలో పోసి స్ప్రే లాగా పిచికారీ చేయవచ్చు. ఇది గోడల పగుళ్లు, మూలలు, రంధ్రాలు వంటి ప్రతిచోటా స్ప్రే చేయవచ్చు. ఇలా చేస్తే ఎలుకలు రావు.
ఎలుకలు కూడా లవంగాల వాసనను ఇష్టపడవు. కొన్ని లవంగాలను గుడ్డలో వేసి చిన్న కట్టలా కట్టి ఎలుక వచ్చే చోట ఉంచవచ్చు. లవంగం నూనెలను సీసాలో పోసి స్ప్రే చేసుకోవచ్చు.
బంగాళాదుంప పొడిని ఎలుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో చల్లుకోవచ్చు. ఎలుకలు తిన్నప్పుడు, బంగాళాదుంప పొలుసులు ఎలుకల ప్రేగులలో మంటను కలిగిస్తాయి. చివరికి వాటిని చంపుతాయి.
ఎలుకలను తరిమికొట్టేందుకు సహజ మార్గాలను వెతకండి. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ఉపయోగిస్తే.. ప్రమాదం. ఇంట్లో చిన్న పిల్లలు ఉండే ఇంకా డేంజర్. ఎలుకలు ఇంటివైపునకు రాకుండా చేసుకుంటే మంచిది. అవి ఇంట్లోనే చనిపోయేలా చేస్తే.. దుర్వాసన ఇబ్బంది కలిగిస్తుంది.