Flies In Home : ఇంట్లోకి ఈగలు రాకుండా ఏం చేయాలి? చాలా సింపుల్-how to get rid of flies naturally at home all you need to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Flies In Home : ఇంట్లోకి ఈగలు రాకుండా ఏం చేయాలి? చాలా సింపుల్

Flies In Home : ఇంట్లోకి ఈగలు రాకుండా ఏం చేయాలి? చాలా సింపుల్

Anand Sai HT Telugu
Nov 24, 2023 11:54 AM IST

How To Avoid Flies : ఇంట్లో ఈగల బెడద అనేది కామన్. కానీ వాటిని చూస్తుంటే మాత్రం తెగ చిరాకు లేస్తుంది. వాటిని తరిమికొట్టేందుకు ఎంత ప్లాన్ చేసినా కుదరదు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే ఒక్క ఈగ కూడా మీ ఇంటికి రాదు.

ఈగలు తరిమికొట్టేందుకు చిట్కాలు
ఈగలు తరిమికొట్టేందుకు చిట్కాలు

కొన్నిసార్లు ఇంట్లో ఈగలు బెడద ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు చేతితో ఊపి ఊపి అలసిపోతాం. అయినా అవి తిరుగుతూనే ఉంటాయి. ఇక చేసేదేమీ లేక పెద్దగా పట్టించుకోం. అయితే బయట తిరిగే ఈగలు ఆహారం మీదా, మన మీదా వాలడం మంచిది కాదు. బ్లోయర్లు, కాయిల్స్, స్ప్రేలు వంటి అనేక పద్ధతులతో ఈగలను తరిమికొట్టేందుకు ప్రయత్నించినా.. మళ్లీ వచ్చి ఇబ్బందిగా మారతాయి. వాటిని తరిమికొట్టడానికి కొన్ని ఇంటి నివారణలను ఉపయోగించవచ్చు.

ఇంట్లో ఈగలు ఇబ్బందిగా ఉంటే కొన్ని చిట్కాలను ఉపయోగించడం వల్ల ఇంట్లో ఒక్క ఈగ కూడా ఉంటుంది. ఈగల వలన చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. చాలా డేంజర్. వాటిని రాకుండా చేయాలి. అందుకే కొన్ని చిట్కాలు పాటించాలి.

బహిర్భూమిలో పడి ఉన్న మలం, చెత్తాచెదారంపై ఈగలు వాలడం, మళ్లీ అవే ఇంట్లోకి వచ్చి.. ఆహార పదార్థాలపై ఉండటం తలచుకుంటేనే అసహ్యంగా ఉంటుంది. దీని వల్ల వ్యాధులు కూడా వస్తాయి. కొంతమందికి విరేచనాలు, వాంతులు వంటి కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. అందుకే మీ కోసం కొన్ని చిట్కాలు అందిస్తున్నాం.

ఈగలు వెనిగర్ వాసనను ఇష్టపడవు. ఒక గిన్నె తీసుకుని పావు కప్పు నూనెలో వెనిగర్, యూకలిప్టస్ ఆయిల్ కలపాలి. ఇంట్లో ఖాళీ సీసాలో పోయాలి. దాని మూతకు రంధ్రం చేసి, ఈగలు ఎక్కడ నుండి వస్తాయో పిచికారీ చేయాలి. మీ ఇంట్లో దీని కోసం స్ప్రే బాటిల్ ఉంటే, దాన్ని ఉపయోగించండి. ఇలా చేస్తే.. ఈగలు రావు.

యాపిల్‌ను ముక్కలుగా కోసి అందులో ఒక లవంగం వేసి ఈగలు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ ఉంచండి. ఈగలు కుట్టవు. ఈ వాసన కూడా ఈగలకు నచ్చదని అంటారు.

ఉప్పు కలిపిన నీటిని బాగా మరిగించి, స్ప్రే బాటిల్‌లో పోసి వంటగది మూలల్లో స్ప్రే చేయండి. ఉప్పు నీటితో ఈగలు దరిచేరవు. దీన్ని పిచికారీ చేయడం వల్ల ఈగలు దూరంగా ఉంటాయి.

వెనిగర్ తో డిష్ సోప్ కలపండి. కిచెన్ ప్యాడ్, ఓవెన్, ఈగలు చేరే ప్రదేశాలపై స్ప్రే చేసి తుడవండి. ఈగలు ఉండవు. ఈ ఇంటి చిట్కాలు మీకు సహాయపడతాయి. అదే సమయంలో మీరు కొన్ని పనులను సరిగ్గా చేయాలి. శుభ్రంగా ఉంచుకోవాలి.

ఈగలు తులసి వాసనను ఇష్టపడవు. తులసి మొక్కను పెట్టుకుంటే ఈగల బెడద పోతుంది. తులసి స్ప్రేని సిద్ధం చేయడానికి, ఒక గుప్పెడు తులసి ఆకులను తీసుకొని నీటిలో మరిగించండి. కొన్ని తులసిని చూర్ణం చేసి ఉంచండి. మరిగించిన తులసి నీళ్లను చల్లార్చి, దానిలో తులసి ఆకుల చూర్ణం కలిపి స్ప్రే బాటిల్‌లో పోయాలి. దీనిని ఉపయోగిస్తే కూడా ఫలితం ఉంటుంది.

ఇంట్లో చెత్త ఎక్కువగా ఉంటే ఈగలు వస్తాయి. కాలువలు తెరిచి ఉంచడం, ఆహార వ్యర్థాలను పారవేయకుండా వదిలేయడం, పాత్రలను సరిగ్గా శుభ్రం చేయకుండా వదిలేయడం ఈగలకు విందుగా మారతాయి. ఇంటిని సరిగ్గా శుభ్రం చేస్తే ఈగల సమస్య ఉండదు. ఆహార పదార్థాలను తెరిచి ఉంచవద్దు. ఈగల వలన చాలా సమస్యలు వస్తాయి.. అందుకే శుభ్రంగా ఉండాలి.

Whats_app_banner