Home Care Tips : ఇది ఒక్క చుక్క చాలు.. బొద్దింకలు, దోమలు, ఈగలు మటుమాయం-how to get rid of cockroach mosquitoes ants and other insects heres solution ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Home Care Tips : ఇది ఒక్క చుక్క చాలు.. బొద్దింకలు, దోమలు, ఈగలు మటుమాయం

Home Care Tips : ఇది ఒక్క చుక్క చాలు.. బొద్దింకలు, దోమలు, ఈగలు మటుమాయం

Anand Sai HT Telugu Published Jan 15, 2024 05:00 PM IST
Anand Sai HT Telugu
Published Jan 15, 2024 05:00 PM IST

Home Care Tips In telugu : ఇంట్లో దోమలు, ఈగలు, బొద్దింకలు ఉంటే చిరాకు వేస్తుంది. వాటిని తరిమికొట్టేందుకు చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.

బొద్దింకల నివారణ చిట్కాలు
బొద్దింకల నివారణ చిట్కాలు (unsplash)

కొందరి ఇళ్లలో బొద్దింకలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. మరికొందరి ఇళ్లలో ఈగలు, చీమలు దండయాత్ర చేస్తుంటాయి. వాటిని పంపేందుకు ఎన్నో చిట్కాలు పాటించి ఉంటారు. కానీ అస్సలు అవి వెళ్లవు. కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే ఈజీగా వాటిని ఇంట్లో నుంచి తరిమికొట్టొచ్చు. ఇంటి చుట్టూ తిరిగే బొద్దింకలు, బల్లులు, వానపాములు, దోమలు వంటి కీటకాలను వదిలించుకోవడానికి సులభమైన హోం రెమెడీస్ ఉన్నాయి.

బొద్దింకలు, బల్లులు, దోమలు, ఈగలు లాంటివి ఇంట్లోకి వచ్చి ఇబ్బంది పెడతాయి. వాటిని తరిమికొట్టేందు దుకాణానికి వెళ్లి ఖరీదైన కెమికల్స్, స్ప్రేలు కొనుక్కున్నా పూర్తిగా వదిలించుకోవడం కష్టమే. మళ్లీ మళ్లీ అవి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. వంటగదిలో బల్లులు, బొద్దింకలు, దోమల వంటి కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించే సులభమైన ఇంటి నివారణలను తెలుసుకోవాలి.

బొద్దింకలు, బల్లులు, దోమలను పూర్తిగా వదిలించుకోవడానికి మీ వద్ద ఉన్న ఏదైనా జ్వరం మాత్రను ఇంట్లో ఉంచండి . అలాగే, బగ్ బాల్స్‌ను కొనుగోలు చేసి ఉంచండి. ఒక చిన్న వెడల్పాటి పాన్ తీసుకోండి. ముందుగా అందులో పౌడర్ టాబ్లెట్, ఇన్‌సెక్ట్ బాల్ పౌడర్ వేయాలి.

ఆ తర్వాత బేకింగ్ సోడా - 1 టేబుల్ స్పూన్, కంఫర్ట్ - 1 టేబుల్ స్పూన్, ఈ పదార్థాలన్నింటినీ బాగా కలపండి. 1/2 లీటర్ నీరు పోసి అన్ని పదార్థాలను ముద్దలు లేకుండా కరిగించండి. మనకు ఉపయోగపడే ద్రవం సిద్ధమైనట్టే. ఈ ద్రవాన్ని బాటిల్‌లో పోసుకోండి.

మీ ఇంట్లో బల్లులు, బొద్దింకలు, దోమలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అన్ని ప్రదేశాలలో దీనిని స్ప్రే చేయాలి. వారానికి ఒకసారి ఈ స్ప్రేని పిచికారీ చేస్తూ ఉండండి. మీ ఫర్నిచర్‌లోని చిన్న కీటకాలన్నీ కూడా చనిపోతాయి. రాత్రి పడుకునే ముందు ఈ ద్రవాన్ని ఒక క్యాప్ఫుల్ సింక్ లేదా బాత్రూమ్ డ్రెయిన్‌లో పోయాలి. వాష్ బేసిన్‌లో కూడా పోయాలి. ఇలా చేయడం వల్ల రాత్రి పూట ఇంట్లోకి బొద్దింకలు రాకుండా చేయెుచ్చు. వంట గదిలోకి చీమలు రావు.

అంతే కాకుండా వేపనూనె లేదా పొడిలో బొద్దింకలను చంపే శక్తిమంతమైన పదార్థాలు ఉంటాయి. వేపనూనె లేదా వేపపూల పొడిని నీళ్లలో కలిపి బొద్దింకలు సంచరించే చోట పిచికారీ చేయాలి. ఇలా చేస్తే బొద్దింకలు పూర్తిగా నశిస్తాయి. యూకలిప్టస్ నూనె ఈగలను తరిమికొట్టడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాటన్ క్లాత్‌పై కొన్ని చుక్కలు వేసి, ఈగలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో వేయండి. బిర్యానీ ఆకులు, లవంగాలు, యూకలిప్టస్‌లను తలుపులు లేదా కిటికీలకు వేలాడదీయడం వల్ల ఈగలు తరిమికొట్టవచ్చు.

కిటికీలు, తలుపుల దగ్గర బంతి పువ్వులను నాటండి. ఎందుకంటే ఈ పువ్వుల సువాసన దోమలను తరిమికొడుతుంది. 6-7 వెల్లుల్లి ముక్కలు, లవంగాలను ఒక గ్లాసు నీటిలో మరిగించాలి. తర్వాత ఈ ద్రవాన్ని తీసుకుని స్ప్రే బాటిల్‌లో పోయాలి. అప్పుడు బొద్దింకలు, బల్లులు మొదలైన కీటకాల కదలికలు ఉన్న ప్రదేశంలో ఈ ద్రవాన్ని పిచికారీ చేయండి. దీని వాసన బొద్దింకలు, బల్లులు వంటి కీటకాలను తరిమికొడుతుంది.

Whats_app_banner