Sleeping Tips : రాత్రిపూట సరిగా నిద్రపోయేందుకు ఈ చిట్కాలు ఫాలో అవ్వండి-how to get good sleep brush at night avoid mobile follow these simple tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleeping Tips : రాత్రిపూట సరిగా నిద్రపోయేందుకు ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

Sleeping Tips : రాత్రిపూట సరిగా నిద్రపోయేందుకు ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

Anand Sai HT Telugu
Mar 18, 2024 06:30 PM IST

Sleeping Tips : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర ఉండాలి. అయితే నిద్ర సరిగా పట్టేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి.

నిద్ర సమస్యలు
నిద్ర సమస్యలు (Unsplash)

ప్రతి వ్యక్తికి తగినంత నిద్ర అవసరం. నిద్ర సరిగా లేకపోతే శరీరానికి రకరకాల సమస్యలు వస్తాయి. బరువు కూడా పెరుగుతూనే ఉంటుంది. చాలా అలసటగా అనిపిస్తుంది. నిద్రలేమితో బాధపడటం అనేది చాలా సమస్యలను తీసుకొస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి రోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేని వారు చాలా మంది ఉన్నారు. దీనివల్ల రోజంతా పని చేసే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. మీరు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు కూడా మంచి నిద్ర పొందడానికి ఈ చిట్కాలను అనుసరించండి. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

బ్రష్ చేయండి

రోజూ రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయండి. చర్మాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖానికి క్రీం రాసుకుని గట్టిగా నిద్రపోండి. ఇలా చేస్తే రాత్రిపూట బాగా నిద్ర పడుతుంది. ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. రాత్రిపూట బ్రష్ చేయడం వలన మీ దంత సమస్యలు తగ్గుతాయి. బ్యాక్టిరియా వృద్ధి చెందదు.

ప్రాణాయామం చేయండి

మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు ఒత్తిడి, ఆందోళనను దూరంగా ఉండండి. పడుకునే ముందు కనీసం 10 నిమిషాల పాటు ప్రాణాయామం చేయండి. ఇలా చేసిన తర్వాత ఊపిరి పీల్చుకుని వదలండి. మీకు ఉన్న ఒత్తిడిని ఇది దూరం చేస్తుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. దీంతో రాత్రిపూట మీ నిద్ర చాలా బాగుంటుంది. పడుకునే ముందు మాత్రం వ్యాయామం చేయకండి. కావాలంటే సాయంత్రం చేసుకోవచ్చు.

డైరీ రాయండి

డైరీ రాయాలంటే రాత్రి పడుకునే ముందు రాసుకోవచ్చు. కవితలు, కథలు రాయాలనుకుంటే రాయవచ్చు. అప్పుడు మీ ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందని మీరే చూస్తారు. మీ మనస్సుపై ఒత్తిడి ఉండదు. ఆందోళన చాలా వరకు తగ్గుతుంది. రాత్రిపూట నిద్ర బాగా పడుతుంది. శరీరంలో ఎటువంటి సమస్యలు ఉండవు. మీ మనసులో ఉన్నది పేపర్ మీద పెడితే చాలా ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

తేలికపాటి ఆహారం తీసుకోవాలి

రాత్రి బాగా నిద్రపోవాలంటే తేలికపాటి ఆహారం తీసుకోవాలి. నిద్రవేళకు కనీసం మూడు నుండి నాలుగు గంటల ముందు తినండి. అలాగే రాత్రిపూట చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక కొవ్వు లేదా కెఫిన్ కలిగిన ఆహారాన్ని ఎప్పుడూ తినకూడదు. రాత్రి పడుకునే ముందు పాలు లేదా అరటిపండు తినవచ్చు. ఇది మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది నిద్రకు ఉపకరిస్తుంది.

మెుబైల్ చూడకూడదు

రాత్రి పడుకునే ముందు ఎప్పుడూ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ఎక్కువగా ఉపయోగించకండి. ఇది శరీరం నుండి మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మొబైల్ ఫోన్ ఉంటే దానిని మీ పక్కనే ఉన్న టేబుల్‌పై నిశ్శబ్దంగా ఉంచండి. నిద్రించడానికి 1 గంట ముందు నుంచి స్క్రీన్ చూడకూడదు. అప్పుడు మీరు ఈజీగా నిద్రపోతారు.

నిద్ర సరిగా లేకుంటే మెుత్తం శ్రేయస్సు మీద ప్రభావం పడుతుంది. మీ రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. సరైన నిద్ర మీ మెుత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రాత్రి 9 గంటలలోపు పడుకోవాలి. ఉదయం త్వరగానే లేవాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు.