Fake Potatoes: మార్కెట్లోకి నకిలీ బంగాళాదుంపలు! అసలైన ఆలూని గుర్తించడం ఎలా?
Fake Potatoes: మీరు తినే బంగాళదుంపలు అసలైనవేనా? మార్కెట్లోకి చెలామణి అవుతున్న నకిలీ ఆలుగడ్డలను పొరబాటున మీరు తినేస్తున్నారా? ఒకసారి చెక్ చేసుకోండి. అసలైన వాటికి నకిలీ వాటికి మధ్య తేడాను ఇలా గమనించండి.
చాలా మంది బాగా ఇష్టపడి తినే కూరగాయల్లో బంగాళదుంపలు ఒకటి. పలు దేశాల్లో వీటిని ప్రధాన ఆహారంలో భాగంగా ఉపయోగిస్తారు. దీనిని ఏ కూరగాయతోనైనా మిక్స్ చేసి వండుకుని తినేయొచ్చు. ముఖ్యంగా సాంబార్ లాంటి వంటకాల్లో ఈ ఆలుగడ్డ స్థానం ప్రత్యేకం. రుచికి అద్భుతంగా ఉండే బంగాళదుంపల క్రేజ్, వీటికి మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకుని కేటుగాళ్లు ఫేక్ చేయడం మొదలుపెట్టేశారు. అది కూడా సింథటిక్ మెటేరియల్ తో తయారుచేసి మార్కెట్లో అమ్మేస్తున్నారు. లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో మోసగాళ్లు తాజా బంగాళాదుంపలతో కలిపి విక్రయిస్తున్నారని మనలో చాలా మందికి తెలియని విషయం.
నకిలీ బంగాళాదుంప అంటే ఏమిటి?
నకిలీ బంగాళాదుంపలను కుళ్లిపోయిన లేదా పాడైపోయిన బంగాళాదుంపల రసాయనాలను ఉపయోగించి తాజాగా తయారుచేస్తారు. తాజా బంగాళాదుంపలతో కలపడం ద్వారా ఏది అసలైనదో, ఏది నకిలీదో మనకు తెలియకపోవచ్చు. కాబట్టి నకిలీ బంగాళాదుంపను తెలుసుకోవడానికి కాస్త పరీక్షగా చూడాలి. ఎలా అంటే వాటిని తెలుసుకునేందుకు కొన్ని ట్రిక్స్ ప్లే చేయక తప్పదు మరి. మీరు కూడా ప్రయత్నించవచ్చు.
బంగాళాదుంపలను కట్ చేయండి
మార్కెట్లో మీరు కొనుగోలు చేసిన బంగాళదుంప అసలైనదా లేక నకిలీదా అని తెలుసుకోవడానికి బంగాళాదుంపలను ముందుగా కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసినప్పుడు బంగాళాదుంప బయటి భాగం (తొక్క తీసిన తర్వాత) లోపలి భాగం రెండూ ఒకే రంగులో ఉంటే అది అసలైనదని అర్థం. అది నకిలీ బంగాళాదుంప అయితే లోపలి రంగు వేరేలా ఉంటుంది.
మట్టితో గుర్తించవచ్చు
అసలైన బంగాళాదుంపలకు నకిలీ బంగాళాదుంపల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి బంగాళాదుంపపై ఉన్న మట్టిని గమనించండి. నిజమైన బంగాళాదుంపను శుభ్రం చేయాలంటే పలుమార్లు రుద్దాలి. అప్పుడే మట్టి తొలగి పోయి బంగాళదుంప శుభ్రమవుతుంది. కానీ నకిలీ బంగాళాదుంపలను నీటిలో వేస్తే మట్టి వెంటనే కరిగిపోతుంది.
వాసన ద్వారా గుర్తించవచ్చు
బంగాళదుంపల వాసన చూసినప్పుడు అవి సహజమైన వాసనను కలిగి ఉంటాయి. ఒకవేళ మీరు నకిలీ బంగాళాదుంపల వాసనను గమనిస్తే అవి రసాయనాల వాసనతో మిళితమై ఉంటాయి. అంతేకాకుండా, ఇంతకుముందు చెప్పినట్లుగా, నకిలీ బంగాళాదుంపల రంగు కూడా వాసనను బట్టి మారుతుంది.
నీటిలో ముంచి పరిశీలించడం
నకిలీ బంగాళాదుంపలను నీటిలో ముంచడం ద్వారా తేేడా గమనించవచ్చు. నిజమైన బంగాళాదుంపలు నీటిలో మునిగిపోతాయి, కానీ నకిలీ బంగాళాదుంపలు కొన్నిసార్లు రసాయనాలు ఉండటం వల్ల నీటిలో పైకి తేలుతూ కనిపిస్తాయి. ఈ విధంగా బంగాళాదుంప నిజమైనదా కాదా ఇట్టే తెలిసిపోతుంది.
నకిలీ బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది?
నకిలీ బంగాళాదుంపలు ఆరోగ్యానికి హానికరం. దీన్ని తినడం వల్ల మూత్రపిండాలు, పేగులు, కాలేయం, చెవులు, ముక్కు, కళ్లు కూడా దెబ్బతినే అవకాశం ఉందట. అంతేకాకుండా కడుపు నొప్పి, మలబద్ధకం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం