How To Eat Apple : యాపిల్ ఎలా తినాలి? తోలు తీసి తింటే మంచిదేనా?
How To Eat Apple In Telugu : యాపిల్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కొంతమందికి ఎలా తినాలో తెలియదు. యాపిల్‍ను తోలుతో తినవచ్చా? లేకుండా తినాలా? అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది.
ఏదైనా తినేముందు, తినేప్పుడు చాలా మందికి సందేహాలు వస్తుంటాయి. కొన్నింటిని ఎలా తినాలి? సరిగా తినడం ఎలా? అనే రకరకాల ప్రశ్నలు తలెత్తుతాయి. అలాంటి వాటిలో యాపిల్‍ను తోలుతో తినవచ్చా? అనేది ఒకటి. దానికి సంబంధించిన విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
యాపిల్ ఆరోగ్యానికి(Apple Health Benefits) చాలా మంచిది. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఓ ఇంగ్లీష్ సామెత ఉంది. ఇది అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. రోజూ యాపిల్ తింటే అనేక ప్రయోజనాలు ఉంటాయి.
యాపిల్ గుండెను ఆరోగ్యంగా(Apple Heart Health) ఉంచుతుంది, ఎముకలు బలంగా, మెదడును చురుకుగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అయితే కొంతమంది యాపిల్ జ్యూస్ కూడా తాగుతుంటారు. కొందరు తోలు లేకుండా తింటారు, మరికొందరు తోలుతో తింటారు. అసలు యాపిల్ ఎలా తినాలో తెలుసుకుందాం.
ఆపిల్ తొక్కలో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. యాపిల్ తొక్క.. జీర్ణ సమస్యలను దూరం చేసి చర్మాన్ని అందంగా మార్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది కణాలలో ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
యాపిల్‌ను తోలు తీసి తినడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే యాపిల్ సైడర్ వెనిగర్ ఒలిచిన యాపిల్స్ నుంచి తయారవుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌తో చాలా సమస్యలను పరిష్కరించవచ్చు. యాపిల్‍ను తొక్కతో తింటే, తొక్క తీసి తింటే గానీ హాని ఉండదు.
యాపిల్‌ను ఎలా తినాలి అనేది వ్యక్తి గత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదానికీ రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. దీంతో అవి మెరిసేలా కనిపిస్తాయి. ఏదైనా పండు తినే ముందు నీళ్లతో శుభ్రంగా కడగాలి. యాపిల్ ను తొక్క తీసి నేరుగా తింటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు.
యాపిల్‍ను శుభ్రంగా కడగండి. ఆ తర్వాత ఒక చాకు తీసుకుని.. దానిపై గీకండి. దాని మీద నుంచి ఒక రకమైన తెల్లని రసాయనం బయటకు వస్తుంది. ఇటీవలి కాలంలో యాపిల్స్ ఇలానే ఉంటున్నాయి. అవి తాజాగా ఉండేందుకు వాటి మీద స్ర్పే చేయడంతో ఇలాంటి తెల్లటి కెమికల్ పదార్థం వస్తుంది.