Yoga Pose: ఒంటి నొప్పులను తగ్గించే యోగాసనం ఇది.. మరిన్ని లాభాలు కూడా..-how to do uttana shishosana and extended puppy yoga pose benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga Pose: ఒంటి నొప్పులను తగ్గించే యోగాసనం ఇది.. మరిన్ని లాభాలు కూడా..

Yoga Pose: ఒంటి నొప్పులను తగ్గించే యోగాసనం ఇది.. మరిన్ని లాభాలు కూడా..

Yoga Pose - Uttana Shishosana: ఉత్తాన శీర్షాసనం వల్ల చాలా ప్రయోజనాలు దక్కుతాయి. ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఈ ఆసనాన్ని ఎలా వేయాలో లాభాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

Yoga Pose: ఒంటి నొప్పులను తగ్గించే యోగాసనం ఇది.. మరిన్ని లాభాలు కూడా..

యోగాలో ఉండే అనేక ఆసనాలు శారీరకంగా, మానసికంగా చాలా ప్రయోజనాలు అందిస్తాయి. చాలా సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాంటి ఆసనమే 'ఉత్తాన శీర్షాసనం'. ఇది శారీరక లాభాలతో పాటు మానసికంగానూ ప్రశాంతంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఒంట్లోని చాలా నొప్పులను ఈ ఆసనం తగ్గించగలదు. ఈ ఆసనాన్ని పప్పీ పోజ్‍కు పొడగింపు అని కూడా అంటారు. ఈ ఉత్తాన శీర్షాసనం వివరాలు ఇవే.

ఉత్తాన శీర్షాసనం వేసే విధానం

  • ఉత్తాన శీర్షాసనం వేసేందుకు.. ముందుగా ఓ చోట మోకాళ్లపై కూర్చోవాలి. ఆ తర్వాత ముందుకు అరచేతులను నేలకు అనించాలి.
  • ఆ సమయంలో నడుము, మోకాళ్లు సమాతరంగా ఉండాలి.
  • ఆ తర్వాత మోచేతులను వంచాలి. చేతులు మరింత ముందుకు జరిపి నేలకు ఆనించాలి. నడుమను మరింత పైకి తీసుకెళ్లాలి.
  • చేతులు నేలకు పూర్తిగా ఆనాక.. ఛాతిని కింద తాకేలా కిందికి బెండ్ చేయాలి. ఆ సమయంలోనే నడుమును మరింత పైకి వెళ్లేలా చేయాలి.
  • ఆ తర్వాత నుదురు కూడా నేలకు ఆనించాలి. ఈ భంగిమలో కొన్ని సెకన్ల పాటు ఉండాలి.

ఉత్తాన శీర్షాసనం ప్రయోజనాలు

నొప్పులు తగ్గేలా..: ఉత్తాన శీర్షాసనంలో శరీరంలోని చాలా అవయవాలు సాగదీతకు గురవుతాయి. చేతులు, కాళ్లు, మోకాళ్లు, భుజాలు, నడుము, వెన్ను, మెడ, ఛాతి సహా వివిధ అవయవాలపై ఒత్తిడి ఉంటుంది. దీనివల్ల ఈ ఆసనం చేస్తే వాటిలో నొప్పి ఉంటే ఉపశమనం కలుగుతుంది. ఒంటి నొప్పులు తగ్గేలా చేయగలదు. ఈ ఆసనం చేస్తే శరీరం మొత్తం రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది.

నిద్ర పట్టేలా..: నిద్రలేమి సమస్య ఉన్న వారికి కూడా ఈ ఉత్తాన శీర్షాసనం మేలు చేస్తుంది. ఈ ఆసనం చేయడం వల్ల నిద్ర మెరుగ్గా పడుతుంది. నిద్ర నాణ్యత పెరుగుతుంది.

ఊపిరితిత్తులకు..: ఉత్తాన శీర్షాసనం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ఛాతిని అదిమిపెట్టి ఆసనం చేయడం వల్ల ఊపిరితిత్తులు ఉత్తేజితమవుతాయి. ఈ ఆసనం వల్ల గుండెకు కూడా మేలు జరుగుతుంది.

ఒత్తిడి తగ్గుతుంది: ఉత్తాన శీర్షాసనం వల్ల కండరాల్లోని ఒత్తిడి బాగా తగ్గుతుంది. రిలాక్స్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. నడుముకు కూడా చాలా మేలు చేస్తుంది. ఈ ఆసనం వేస్తే శరీరం విశ్రాంతిగా ఫీల్ అవుతుంది. మానసిక ఒత్తిడిని కూడా ఈ ఆసనం తగ్గించగలదు.

కడుపు సమస్యలు తగ్గేలా..: ఉత్తాన శీర్షాసనం వేసే సమయంలో నడుమును పైకి వెళ్లేలా చేయడంతో పొత్తి కడుపుపై ఒత్తిడి పడుతుంది. కడుపులోని అవయవాలకు మసాజ్ చేసినట్టు అవుతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగవుతుంది. గ్యాస్, మలబద్ధకం, గ్యాస్ లాంటి సమస్యలు తగ్గుతాయి.