Tips for Control Eating: తిండి తగ్గించాలని అనుకున్నా అలా చేయలేకున్నారా? ఈ 5 టిప్స్ పాటిస్తే కంట్రోల్ చేయొచ్చు!
Tips for Control Over Eating: తక్కువ తినాలని అనుకున్నా.. చాలా మంది అలా చేయలేరు. తినడానికి కూర్చుంటే కంట్రోల్ తప్పేసి తినేస్తుంటారు. అయితే, ఆహారం తక్కువగా తీసుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.
“ఇక నుంచైనా ఆహారం తక్కువగా తినాలి” ఈ మాటను చాలా మంది అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆలోచనను చేస్తుంటారు. అతిగా తినకూడదని అనుకుంటారు. అయితే, తక్కువగా తినాలని అనుకున్నా.. కొందరు అలా చేయలేరు. ముందు ఎంత ఆలోచించినా.. తినేందుకు కూర్చోగానే కంట్రోల్ తప్పి ఎక్కువగా లాగించేస్తుంటారు. ఇలా కొనసాగిస్తుంటారు. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే తక్కువగా తినాలనే ప్రయత్నానికి తోడ్పడుతాయి. కంట్రోల్‍గా ఆహారం తీసుకునేందుకు సహకరిస్తాయి. ఆ చిట్కాలు ఇవే.
చిన్న ప్లేట్‍లు
ఆహారాన్ని చిన్న ప్లేట్‍లలో వడ్డించుకోవడం వల్ల తక్కువగా తినే అవకాశం ఉంటుంది. చిన్న ప్లేట్‍లో ఆహారం తక్కువగా పడుతుంది. దీంతో అది అయిపోయాక రెండోసారి వడ్డించుకునేందుకు కాస్త గ్యాప్ దొరుకుతుంది. దీంతో తక్కువగా తినాలనే ఆలోచన గుర్తుకు వస్తుంది. పెద్ద ప్లేట్‍లో ఎక్కువగా ఆహారం పెట్టుకునే అవకాశం ఉండటంతో.. కంట్రోల్ తప్పి నాన్‍స్టాప్‍గా ఆహారం తినే ఛాన్స్ ఉంటుంది. అందుకే భోజనం చేసేందుకు చిన్న ప్లేట్‍లు, బౌల్స్ ఉపయోగించాలి. తిండి తగ్గించేందుకు ఇవి తోడ్పడతాయి.
నిదానంగా తింటూ.. నీరు తాగుతూ..
త్వరత్వరగా తింటే కూడా ఆహారం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఆహారాన్ని నెమ్మదిగా.. బాగా నములుతూ తినాలి. తక్కువ తక్కువ నోట్లో పెట్టుకొని నమలాలి. ఇలా చేయడం వల్ల ఆహారం తిన్న సంతృప్తి ఎక్కువగా కలుగుతుంది. శరీరానికి బాగా పడుతుంది. ఎక్కువ సేపు తిన్నట్టు ఫీల్ ఉంటుంది. అలాగే, ఆహారం తీసుకునే మధ్య నీరు కూడా తాగాలి. దీంతో కడుపు నిండినట్టుగా అనిపించి.. తక్కువగా తినొచ్చు.
టీవీ, మొబైళ్లు చూడొద్దు
తినే సమయంలో ముఖ్యంగా టీవీ, మొబైల్ చూడకూడదు. వీటిపై దృష్టి పెడితే.. ఎంత తింటున్నామో కూడా పట్టించుకోలేరు. ఎక్కువగా తినే అవకాశాలు ఉంటాయి. అందుకే తినే సమయంలో పూర్తి దృష్టి ఆహారంపై ఉండాలి. అప్పుడే కంట్రోల్ తప్పకుండా తినే అవకాశం ఉంటుంది. అనుకున్నం తినొచ్చు.
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే కడుపు త్వరగా నిండిన ఫీలింగ్ కలుగుతుంది. క్యాలరీలు ఎక్కువగా తీసుకోకుండా ఉండొచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉండే కాయధాన్యాలు, ఆకుకూరలు, బీన్స్, ఓట్స్, క్యారెట్ సహా కూరగాయాలు ఎక్కువగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. పండ్లు కూడా తీసుకోవాలి. స్నాక్స్‌గానూ ఫైబర్ ఎక్కువగా ఉండేవి తీసుకోవాలి. దీంతో ఎక్కువగా ఆహారం తినడాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.
బబుల్‍గమ్ నమలడం
చిటికీమాటికీ ఆకలి అవుతుంటే బబుల్‍గమ్ నమలవచ్చు. బబుల్‍గమ్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. స్నాక్స్ ఎక్కువగా తినాలనే ఆశను తగ్గించుకోవచ్చు. బబుల్‍గమ్ తర్వాత ఆహారాన్ని ఎక్కువగా తీసుకోలేం.
సంబంధిత కథనం