Weight loss with Fenugreek: మెంతులను ఈ ఐదు రకాలుగా తీసుకుంటే బరువు తగ్గుతారు!
Weight loss with Fenugreek: బరువు తగ్గేందుకు మెంతులు చాలా ఉపయోగపడతాయి. అయితే, వీటిని ఎలా తీసుకోవాలో చాలా మందికి సందేహంగా ఉంటుంది. మెంతులను ఎలా తీసుకోవచ్చో ఇక్కడ తెలుసుకొని ఫాలో అవండి.
మెంతులను వంటింట్లో ఉండే అద్భుత ఔషధమని చెప్పవచ్చు. దీనివల్ల అన్ని ప్రయోజనాలు ఉంటాయి. మెంతుల్లో విటమిన్ ఏ, బీ6, సీ, కే, పోటాషియం ఫోలిక్, యాసిడ్, కాపర్ సహా మరిన్ని ముఖ్యమైన పోషకాలు మెంతుల్లో ఉంటాయి. చాలా రకాలుగా ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తగ్గేందుకు కూడా మెంతులు ఎంతో ఉపయోగపడతాయి. అయితే, వీటిని ఎలా తీసుకోవాలో చాలా మందికి డౌట్ ఉంటుంది. మెంతలను ఎలా తీసుకోవాలో ఇక్కడ చూడండి.
బరువును మెంతులు తగ్గించలవా?
శరీర బరువు తగ్గాలని అనుకుంటున్న వారికి మెంతులు ఎంతగానో సాయపడతాయి. వీటిల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని తీసుకుంటే కడుపు నిండిన తృప్తి చాలాసేపు ఉంటుంది. చిటికీమాటికీ ఆకలి కాకుండా చేస్తుంది. దీంతో ఆహారం తక్కువే తినడం వల్ల బరువు తగ్గే జర్నీకి ఉపయోగకరంగా ఉంటుంది.
శరీరంలో జీవక్రియలను మెంతులు మెరుగుపరుస్తాయి. దీనివల్ల క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. ఇలా కూడా వెయిట్ లాస్ అయ్యేందుకు మెంతులు తోడ్పడతాయి. తీపి పదార్థాలు ఎక్కువగా తినాలనే ఆశను కూడా మెంతులు తగ్గిస్తాయి. దీంతో క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండేందుకు సహకరిస్తాయి. ఇలా బరువు తగ్గేందుకు మెంతులు ఉపయోగపడతాయి. వీటిని ఎలా వాడొచ్చంటే..
మెంతులను తీసుకోండిలా..
నానబెట్టిన మెంతుల నీళ్లు: మెంతుల నుంచి ప్రయోజనాలను మెరుగ్గా పొందేందుకు ఇదో అత్యుత్తమ మార్గం. మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్ని ఆ నీటిని పరగడుపున తాగాలి.
మెంతుల టీ: మెంతులతో టీ కూడా చేసుకోవడం బాగుంటుంది. వేడిగా ఉన్న నీటిలో మెంతులను వేయాలి. మెంతుల్లోని సారంమంతా నీటిలో దిగే వరకు కాసేపు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత ఆ నీటిని తాగాలి. మెంతులను తీసుకునేందుకు ఇది కూడా మంచి మార్గం.
మొలకెత్తిన మెంతులు: మెంతులను మొలకెత్తేలా చేసి తినేయవచ్చు. ఇలా తీసుకుంటే పోషకాలు మరింత మెరుగ్గా శరీరానికి అందుతాయి. ఈ మొతలెత్తిన మెంతులను నేరుగా అయినా తినొచ్చు.. సలాడ్లలో అయినా కలుపుకొని తీసుకోవచ్చు.
పొడిగా వంటల్లో..: మెంతులను మొత్తటి పొడిగా చేసుకోవాలి. దాన్ని వివిధ రకాల వంటలు, సూప్‍లు, స్మూతీల్లో కలుపుకొని తీసుకోవచ్చు. మెంతులు తీసుకునేందుకు ఇదో సులభమైన ఆప్షన్.
తేనెతో..: మెంతుల పొడిని తేనెతో కలిపి రోజూ ఓ స్పూన్ తీసుకోవచ్చు. మెంతుల్లోని చేదును తేనెలోని తీపి బ్యాలెన్స్ చేస్తుంది. నిమ్మరసం నీళ్లలోనూ మెంతిపొడిని కలుపుకొని ఉదయాన్నే తాగొచ్చు. ఇలా పద్ధతుల్లో తీసుకుంటే మెంతులు ఓవరాల్ ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా ప్రయోజనాలను చేకూరుస్తాయి.
టాపిక్