SBI Bank: ఎస్‌బిఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక బ్యాలెన్స్ తెలుసుకోవడం చాలా ఈజీ!-how to check sbi account balance via sbi whatsapp banking service ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  How To Check Sbi Account Balance Via Sbi Whatsapp Banking Service

SBI Bank: ఎస్‌బిఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక బ్యాలెన్స్ తెలుసుకోవడం చాలా ఈజీ!

HT Telugu Desk HT Telugu
Aug 29, 2022 09:12 PM IST

SBI WhatsApp Banking Service: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నెలలో తన కస్టమర్ల కోసం WhatsApp బ్యాంకింగ్ సేవను ప్రారంభించింది. ఈ SBI వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు ద్వారా మినీ స్టేట్‌మెంట్, ఖాతా బ్యాలెన్స్‌‌ను ఈజీగా తెలుసుకోవచ్చు.

SBI WhatsApp Banking Service:
SBI WhatsApp Banking Service:

భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం గత నెలలో WhatsApp బ్యాంకింగ్ సేవను ప్రారంభించింది. SBI వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు ద్వారా మినీ స్టేట్‌మెంట్, ఖాతా బ్యాలెన్స్‌ను తక్షణమే చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ మినీ స్టేట్‌మెంట్‌లో కస్టమర్ చివరి ఐదు లావాదేవీల వివరాలను SBI అందిస్తుంది. కొత్తగా ప్రారంభించిన వాట్సాప్ బ్యాంకింగ్ సేవల గురించి ట్విటర్ ఖాతాదారులకు తెలియజేసింది ఎస్‌బీఐ. “మీ బ్యాంక్ ఇప్పుడు వాట్సాప్‌లో ఉంది. మీ ఖాతా బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ తెలుసుకోండి" అనే క్యాప్షన్‌తో ఈ పోస్టు చేసింది.

SBI వాట్సాప్ బ్యాంకింగ్ కోసం ఎలా నమోదు చేసుకోవాలి

SBI వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను పొందడానికి ముందుగా మీరు మీ ఖాతాను నమోదు చేసుకోవాలి. దీని కోసం SMS ద్వారా మీ అంగీకారాన్ని తెలయజేయాలి. రిజిస్టర్ కాని వారు సేవలు పొందేందుకు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని బ్యాంకు నుంచి మెసేజ్ వస్తుంది. మీరు SBI వాట్సాప్ బ్యాంకింగ్ సేవల కోసం నమోదు చేసుకోకుంటే, బ్యాంక్‌ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి WAREG A/c నంబర్‌ను 72089333148కి SMS పంపండి. ముందుగా ఈ సేవలకు సంబంధించిన T&Cను Bank.sbiలో వీక్షించవచ్చు.

SBI వాట్సాప్ బ్యాంకింగ్ సేవను ఎలా పొందాలి

1: ముందుగా నమోదు చేసుకోండి.

2: నమోదు చేసుకున్న తర్వాత, +919022690226లో SBIకి 'హాయ్' అని పంపండి. లేదా మీరు SBI WhatsApp సందేశానికి రీప్లై ఇవ్వవచ్చు

4. మీరు సందేశాన్ని పంపిన తర్వాత మీరు క్రింది రిప్లై పొందుతారు.

ప్రియమైన కస్టమర్,SBI Whatsapp బ్యాంకింగ్ సేవలకు స్వాగతం!

దయచేసి దిగువన ఉన్న ఏవైనా ఎంపికల నుండి ఎంచుకోండి.

1. ఖాతా బ్యాలెన్స్

2. మినీ స్టేట్‌మెంట్

3. WhatsApp బ్యాంకింగ్ నుండి డి-రిజిస్టర్ చేసుకోండి

మీకు కావాల్సిన సర్వీస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీరు మినీ స్టేట్‌మెంట్‌ని ఎంచుకున్నట్లయితే, మీరు గత ఐదేళ్ల స్టేట్‌మెంట్‌లను పొందుతారు.

WhatsApp channel

సంబంధిత కథనం