అక్షయ తృతీయనాడు 50వేల రూపాయల బడ్జెట్‌లోనే బంగారు నగలు ఇలా కొనుగోలు చేయండి-how to buy gold jewellery on akshaya tritiya within a budget of rs 50000 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  అక్షయ తృతీయనాడు 50వేల రూపాయల బడ్జెట్‌లోనే బంగారు నగలు ఇలా కొనుగోలు చేయండి

అక్షయ తృతీయనాడు 50వేల రూపాయల బడ్జెట్‌లోనే బంగారు నగలు ఇలా కొనుగోలు చేయండి

Haritha Chappa HT Telugu

అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఎంతో మంచిదని చెబుతారు. కానీ బంగారం రేట్లు పెరిగిపోయాయి. కాబట్టి రూ.50,000 బడ్జెట్ లో ఎలాంటి బంగారు నగలను తీసుకోవచ్చో తెలుసుకోండి.

తక్కువ రేటులో వచ్చే గోల్డ్ జ్యూయలరీ (Lalitha jewellery)

అక్షయ తృతీయ వచ్చేస్తోంది. ఆరోజు బంగారం కొనడం వల్ల అన్ని రకాలుగా మేలు జరుగుతుందని నమ్ముతారు. అయితే బంగారం రేటు కొండెక్కి కూర్చొంది. తులం బరువున్న జ్యూయలరీ కావాలంటే కనీసం లక్ష ముప్పైవేల రూపాయలకు పైగా ఖర్చు చేయాలి. యాభై వేల రూపాయల బడ్జెట్‌లోనే మీరు చిన్న చిన్న బంగారు వస్తువులను తీసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి వస్తువుల్ని ఎంపిక చేసుకోవాలో తెలుసుకోండి.

బంగారు నాణాలు

50వేల బడ్జెట్‌లోనే మీకు బంగారు నాణాలు దొరుకుతాయి. 24 క్యారెట్లలో ఉంటాయి. ఈ 24 క్యారెట్ల బంగారు నాణాన్ని తీసుకుంటే దాన్ని ఇంట్లోనే భద్రపరచుకోవచ్చు. మీ దగ్గర మరికొంత సొమ్ము కూడినప్పుడు ఈ బంగారు నాణాన్ని ఇచ్చి అదనపు సొమ్మును చెల్లించి ఏదైనా వస్తువుని తీసుకుని అవకాశం ఉంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు మీరు రూ.50,000 ఖర్చుపెట్టగలిగితే వీలైనంతవరకు 24 క్యారెట్ల బంగారు నాణాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి.

స్టడ్స్ లేదా డ్రాప్స్

22 క్యారెట్ల బంగారు చెవి పోగులు తక్కువ ధరలో కూడా లభిస్తాయి. చెవిపోగుల్లో రోజువారీ ధరించడానికి మంచి ఎంపికలు ఉంటాయి. స్టడ్స్, డ్రాప్స్ వంటి చెవిరింగులు ఉత్తమ ఎంపిక. మీకు ఇవి 50 వేల రూపాయలలోపే వస్తాయి. అలాగే సాధారణ బంగారు గొలుసుతో వేసుకోవడానికి లాకెట్ లేదా పెండెంట్ వంటివి కూడా మీకు 50 వేల రూపాయలలోపే వచ్చే అవకాశం ఎక్కువ. 50 వేల రూపాయలకు వచ్చే ఈ పెండెంట్లు అందంగా మాత్రమే కాదు మందంగా కూడా ఉంటాయి.

చిన్న పిల్లల జ్యూయలరీ

చిన్నపిల్లలకు యాభైవేల రూపాయలలోపే బంగారు ఉంగరాలు, చెవి పోగులు అధికంగా వస్తూ ఉంటాయి. అలాగే తేలికపాటి బంగారు చైన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అక్షయ తృతీయకు మీ బడ్జెట్లో పిల్లలకు ఏదైనా కొనేందుకు ప్రయత్నించండి. అవి తక్కువ ద్వారా లోనే వచ్చే అవకాశం ఉంది.

నాలుగు గ్రాముల్లోనే

బంగారు చెవి రింగులు మూడు నుంచి నాలుగు గ్రాముల వరకు ఉండే వాటిని ఎంపిక చేసుకుంటే మీకు 50 వేల రూపాయలలోపే దాని ఖర్చు అవుతుంది. ప్రతిరోజూ వాటిని డైలీవేర్ గా ఉపయోగించుకోవచ్చు. నాలుగు గ్రాముల బరువుంటే ఉంగరం లేదా చెవిపోగులు కూడా రూ.50,000 లోపే మీకు వచ్చేస్తాయి. నాలుగు గ్రాముల ఉంగరం అంటే మీకు వేలి నిండుగానే కనిపిస్తుంది.

లైట్ వెయిట్ జ్యూయలరీ

ఇప్పుడు లైట్ వెయిట్ జ్యూయలరీ కూడా ఫ్యాషన్ గా మారింది. ఈ లైట్ వెయిట్ జ్యూవెలరీలో చాలా తక్కువ ధరకే బంగారు ఆభరణాలు లభిస్తాయి. అయితే వీటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి వస్తుంది. మీరు రూ.50,000 బడ్జెట్ లోనే బంగారాన్ని కొనాలనుకుంటే మీరు నాలుగు గ్రాముల బరువున్న వస్తువులనే ఎంపిక చేసుకోవాలి. జీఎస్టీ, మేకింగ్ చార్జెస్ అన్నీ కలిపి ఆ వస్తువుకు మీరు రూ.50,000 చెల్లించాల్సి వస్తుంది.

అక్షయ తృతీయనాడు కేవలం బంగారమే కొనాలని లేదు. 50 వేల రూపాయలతో మీరు వెండి వస్తువులు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. వెండి దీపం కుందులు, వెండి పళ్లెం వంటివి కొంటే 50 వేలకు వస్తాయి.

ఈ అక్షయ తృతీయకు మీ బడ్జెట్ రూ.50,000 అయితే కాస్త తెలివిగా మేము చెప్పిన విధంగా వస్తువులు కొనేందుకు ప్రయత్నించండి. దీనివల్ల మీరు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మీరు అనుకున్న బడ్జెట్లోనే వస్తువును కొనగలరు.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం