Relationship tips: నెగెటివ్ థింకింగ్ చేస్తున్నారా? మీ బంధానికి ఈ ముప్పు తప్పదు-how negative thinking patterns affect your relationship know expert tips here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Relationship Tips: నెగెటివ్ థింకింగ్ చేస్తున్నారా? మీ బంధానికి ఈ ముప్పు తప్పదు

Relationship tips: నెగెటివ్ థింకింగ్ చేస్తున్నారా? మీ బంధానికి ఈ ముప్పు తప్పదు

HT Telugu Desk HT Telugu
Dec 02, 2022 07:45 PM IST

Relationship tips: మీరు నెగెటివ్ థింకింగ్‌తో ఉంటే మీ బంధానికి ప్రమాదం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

నెగెటివ్ థింకింగ్‌తో బంధాలకు బీటలు
నెగెటివ్ థింకింగ్‌తో బంధాలకు బీటలు (pexels)

ఎంతో బలంగా ఉన్న బంధం కూడా కుప్పకూలడానికి చాలా కారణాలు ఉంటాయి. మీరనుకున్నట్టుగా భాగస్వామిని మోసం చేయడం అనే కారణం బంధాలు బీటలు వారడానికి ప్రధాన కారణమే అయినప్పటికీ.. నెగెటివ్ థింకింగ్ అనేది అంతకంటే ప్రమాదకరం. బంధాలను విచ్ఛిన్నం చేసే అన్ని కారణాలలో కెల్లా ఈ నెగెటివ్ థింకింగ్ ముందుంటుందని సైకాలజిస్టులు చెబుతున్న మాట.

మీ బంధం ఆరోగ్యకరంగా ఉండాలంటే ముందుగా మీరు నెగెటివ్ థింకింగ్ వదిలేయాలని సూచిస్తున్నారు. యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి వాటితో బాధపడుతున్న వారు తరచుగా ఈ నెగెటివ్ థింకింగ్‌ ఆలోచనల పరంపరలతో సతమవుతారు. అంతిమంగా ఇది మీ బంధం బీటలు వారేలా చేస్తుంది. ఒక బంధంలో ఉన్నప్పుడు మీరు అప్పుడప్పుడు ఆందోళనకు గురవడం సహజమే. అయితే ఆ బంధం గురించి నిరంతరం నిరాశతో కూడిన ఆలోచనలు వస్తుంటే మాత్రం ఆ బంధానికి శ్రేయస్కరం కాదు.

అధీకృత లైఫ్ అండ్ రిలేషన్‌షిప్ కోచ్ ఎకోరి కె.బెంజమిన్ ఈ అంశంపై పలు సూచనలు చేశారు. 4 రకాల నెగెటివ్ థింకింగ్ ప్యాటర్న్స్ మీ బంధాన్ని దెబ్బతీస్తాయని ఆయన విశ్లేషించారు.

1. బ్లాక్ అండ్ వైట్ థింకింగ్

విపరీతమైన ఆలోచనను, లేదా విభజిత ఆలోచనలను బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ అంటారు. అంటే మీరు మనుషులను రెండు దృక్కోణాల్లో చూస్తారు. అంటే పరిపూర్ణతగా లేదా పూర్తి వైఫల్యాలుగా ఆలోచిస్తారు. ఇక ఇందులో మధ్యస్తం అనేది ఉండదు. ఈ ఆలోచన ధోరణి ఎక్కువగా రిలేషన్‌షిప్స్‌లో ఉంటుంది. మీరొక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీ నుంచి వెలువడే పదాలు ‘ఎప్పటికీ, ఎల్లప్పుడూ, అసాధ్యం, ఎప్పటికీ కాదు..’ వంటి పదాలే కనిపిస్తాయి. ఇక మీ భాగస్వామి గురించి మీరు వ్యతిరేకంగానే ఆలోచిస్తారు. ‘నా భాగస్వామి నన్ను ప్రేమించదు ఎందుకంటే ఆమె ఉదయం నన్ను ముద్దుపెట్టుకోవడం ఎప్పుడూ మరిచిపోతుంది..’ వంటి స్టేట్‌మెంట్సే మీ నుంచి కనిపిస్తాయి.

2. ఒక నిర్ణయానికి రావడం

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూడకుండా, మీ భాగస్వామి గతంలో ఎప్పుడో మిమ్మల్ని హర్ట్ చేశారని చెప్పి దానినే భూతద్దంలో పెట్టి చూస్తారు చూడండి. అలాంటప్పుడు మీరు ఏ విషయంలోనైనా వెంటనే ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. తగిన ఆధారాలు ఉన్నప్పటికీ, మీరు వ్యతిరేక ఆలోచనలతో ఏదో ఒక అంచనాకు వస్తారు. ఏదో ఊహించుకుంటారు. ఇతరుల ఆలోచన ఇదీ అని అనుకుని దానినే వాస్తవంగా భావిస్తారు.

3. బ్లేమ్ గేమ్

నిందించడం అంటే.. ప్రతికూల సంఘటనకు ఇతరులపై బాధ్యత మోపడం. దాని నుంచి మీకు స్వేచ్ఛ లభించినట్టవుతుంది. కానీ మీ భాగస్వామికి చాలా కోపం తెప్పిస్తుంది. దీని వల్ల ఎలాంటి పరిష్కారమూ లభించదు. మీ చర్యలకు మీరు బాధ్యత తీసుకుంటే అది మీ తప్పుల నుంచి మీరు నేర్చుకునేలా చేస్తుంది. మీ బంధాన్ని ఆనందమయం చేస్తుంది.

4. భావోద్వేగాలు వర్సెస్ వాస్తవాలు

మీరు ఆత్రతకు లేదా నిరుత్సాహానికి లోనైనప్పుడు కేవలం ఆ భావోద్వేగంతో మీ స్వీయ గుర్తింపును, జీవితాన్ని నిర్వచించడం సరికాదు. లేదంటే అది మీ బంధాన్ని నాశనం చేస్తుంది. మీ ఫీలింగ్స్ కంటే మీకు విలువ ఎక్కువని గుర్తించాలి. భావోద్వేగాలు ఎప్పటికీ వాస్తవాలు కావు. వ్యక్తులు వారి ఫీలింగ్స్‌ను బట్టి వారిని నిర్వచించాలని కోరుకోకూడదు.

టాపిక్