Traveling Abroad: విదేశాలకు ప్రయాణం చేస్తున్నప్పుడు మీతో పాటు ఎంత డబ్బును తీసుకువెళ్లవచ్చో తెలుసా?-how much money can you take with you when traveling abroad ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Traveling Abroad: విదేశాలకు ప్రయాణం చేస్తున్నప్పుడు మీతో పాటు ఎంత డబ్బును తీసుకువెళ్లవచ్చో తెలుసా?

Traveling Abroad: విదేశాలకు ప్రయాణం చేస్తున్నప్పుడు మీతో పాటు ఎంత డబ్బును తీసుకువెళ్లవచ్చో తెలుసా?

Haritha Chappa HT Telugu
Published Mar 14, 2024 04:40 PM IST

Traveling Abroad: విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. అనేక దేశాలకు ఎంతో మంది ప్రయాణం కడుతున్నారు. విదేశాలకు వెళ్ళినప్పుడు ఎంత డబ్బును తమతో పాటు తీసుకువెళ్లవచ్చో అన్న సందేహం ఎక్కువమందిలో ఉంది.

విదేశాలకు ఎంత డబ్బు తీసుకువెళ్లవచ్చు?
విదేశాలకు ఎంత డబ్బు తీసుకువెళ్లవచ్చు? (pixabay)

Traveling Abroad: ప్రపంచంలోని ఎన్నో దేశాలకు ఉద్యోగుల కోసం, చదువుల కోసం ఎంతోమంది వెళుతున్నారు. కొత్తగా వెళ్లే వారికి ఎన్నో సందేహాలు ఉంటాయి. అందులో తమతో పాటు ఎంత డబ్బును పర్సులో లేదా బ్యాగుల్లో పెట్టుకుని తీసుకెళ్లవచ్చో అనే ప్రశ్న ఎక్కువ మందిని వేధిస్తోంది. ఈ విషయంలో ఒక్కో దేశం, ఒక్కో పరిమితిని నిర్ణయించింది.

ప్రయాణికులు సాధారణంగా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఎలక్ట్రానిక్ బదిలీలు వంటివి చేస్తూ ఉంటారు. అలాగే వారు కొంత డబ్బును కూడా చేతిలో ఉంచుకుంటారు. ఎయిర్ పోర్టులో కరెన్సీ ఎక్స్చేంజర్ సదుపాయం ఉన్నప్పటికీ వారు రుసుము రూపంలో ఎక్కువ మొత్తాన్ని తీసుకుంటారు. కాబట్టి ఇంటర్నేషనల్ ట్రావెల్ కార్డ్స్ లేదా క్రెడిట్ కార్డ్స్‌ను వాడుకోవడం మంచిది.

ఫ్రాన్స్

ఫ్రాన్స్ కరెన్సీ యూరోలు
ఫ్రాన్స్ కరెన్సీ యూరోలు

ఫ్రాన్స్ దేశానికి ప్రయాణించేవారు తమతో పాటు పదివేల కంటే తక్కువ యూరోలను తమతోపాటు తీసుకువెళ్లాలి. అలా అయితే డిక్లరేషన్ అవసరం ఉండదు. అంటే మన రూపాయల్లో తొమ్మిది లక్షల రూపాయలను మనతో పాటు తీసుకువెళ్ళవచ్చు. అంతకన్నా ఎక్కువ తీసుకెళ్తే మాత్రం డిక్లరేషన్ అవసరం ఉంటుంది.

స్పెయిన్

స్పెయిన్ దేశానికి వెళ్లేవారు డిక్లరేషన్ లేకుండా పదివేల యూరోల కన్నా తక్కువ మొత్తాన్ని తీసుకెళ్లవచ్చు. ఎక్కువ మొత్తంలో నగదును తీసుకురావడాన్ని స్పెయిన్ నిషేధించింది.

ఇటలీ

డిక్లరేషన్ లేకుండా దేశంలోకి ఎక్కువ మొత్తంలో నగదు తీసుకొచ్చే ప్రయాణికులపై ఇటలీ పరిమితి విధించింది. యూరోపియన్ దేశాలలాగే ఇటలీ కూడా పదివేల యూరోలకన్నా తక్కువ మొత్తాన్ని తీసుకొని రావచ్చని నిబంధనలను పెట్టింది.

అమెరికా

భారతదేశం నుండి అమెరికా వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఇక లిక్విడ్ క్యాష్‌ని అమెరికా వెళ్లేటప్పుడు ఎంత తీసుకు వెళ్ళవచ్చో తెలుసా... కేవలం 300 అమెరికన్ డాలర్లు. అంటే మన రూపాయిల్లో రెండున్నర లక్షలు. దీనికన్నా ఎక్కువ మొత్తాన్ని మీరు తీసుకువెళ్లాలనుకుంటే ఫారెక్స్ కార్డ్ వాడాల్సి వస్తుంది. అలాగే బ్యాంకులో బదిలీ చేసుకోవాల్సి వస్తుంది.

కెనడా

కెనడా డాలర్లు
కెనడా డాలర్లు

కెనడాలోకి ఇతర దేశస్థులు ప్రవేశించాలనుకుంటే తమతో పాటు పదివేల రూపాయల కన్నా తక్కువ కెనడియన్ డాలర్లను తెచ్చుకోవాలి. అంటే మన రూపాయిల్లో ఆరు లక్షల వరకు క్యాష్ పట్టుకొని వెళ్ళవచ్చు.

థాయిలాండ్

థాయిలాండ్ దేశం ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. అక్రమ నగదు కార్యకలాపాలను నిరోధించడానికి కొన్ని నియమ నిబంధనలను పెట్టింది. తమ దేశంలోకి వచ్చే ప్రయాణికులు 50 వేల థాయిలాండ్ బాట్లను తెచ్చుకోవచ్చు. అంటే మన రూపాయల్లో 1,10,000 వరకు తీసుకెళ్లవచ్చు.

బ్రిటన్

బ్రిటన్ దేశానికి వెళ్లే ప్రయాణికులు పదివేల పౌండ్ల కన్నా తక్కువ నగదును తమతో పాటు తీసుకువెళ్లాలి. అంతకన్నా ఎక్కువ తీసుకెళ్తే అనధికార నగదు తరలింపు కిందకు వస్తుంది. దానికి తగిన డిక్లరేషన్లు కూడా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి పదివేల పౌండ్ల కన్నా తక్కువ తీసుకెళితే ఎలాంటి సమస్య రాదు. మన రూపాయల్లో ఈ మొత్తం పది లక్షలకు పైమాటే.

జర్మనీ

జర్మనీకి వెళ్లే ప్రయాణికులు లిక్విడ్ క్యాష్‌ను 10,000 కంటే తక్కువ యూరోలు ఉండేలా చూసుకోవాలి. లేకపోతే కస్టమ్ అధికారులకు డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది.

గ్రీస్

గ్రీస్ కరెన్సీ
గ్రీస్ కరెన్సీ

గ్రీస్‌కు వెళ్లే ప్రయాణికులు తమ దేశంలోకి లిక్విడ్ క్యాష్‌ను 10,000 యూరోలు మాత్రమే తీసుకురాగలరు. అంతకుమించి తీసుకొస్తే అనుమతులు తీసుకోవాలి.

ఆస్ట్రేలియా

ఎంతోమంది యువత భారతదేశం నుంచి చదువుల కోసం ఆస్ట్రేలియా వెళుతున్నారు. ఆస్ట్రేలియా మనీలాండరింగ్,చట్టబద్ధం కాని ఆర్థిక కార్యకలాపాలను నిరోధించడానికి తమ దేశంలోకి తెచ్చే లిక్విడ్ క్యాష్ పై పరిమితులు విధించింది. ఒక ప్రయాణికుడు కేవలం పదివేల ఆస్ట్రేలియన్ డాలర్స్ మాత్రమే తనతో పాటు తీసుకెళ్లగలడు. మన రూపాయల్లో ఐదున్నర లక్షల వరకు తీసుకు వెళ్ళవచ్చని అర్థం.

నేపాల్

నేపాల్‌ను సందర్శించే భారతీయ ప్రయాణికుల సంఖ్య ఎక్కువే. నేపాల్ కూడా నకిలీ కరెన్సీని నిరోధించడానికి ఎప్పటినుంచో కొన్ని నియమ నిబంధనలను పెట్టింది. నేపాల్‌కు వెళ్లే భారత ప్రయాణికులు కేవలం పాతికవేల రూపాయలను మాత్రమే లిక్విడ్ క్యాష్ రూపంలో తీసుకెళ్లగలరు. అది కూడా కేవలం 100 రూపాయల నోట్ల రూపంలోనే తీసుకువెళ్లాలి. రూ.500 నోట్లు, రూ. 2000 నోట్లు తీసుకువెళ్లడానికి వీల్లేదు.

సింగపూర్

సింగపూర్‌కు వెళ్లే భారతీయుల సంఖ్య ఎక్కువే. ఆ దేశం కూడా మనీలాండరింగ్‌ను నిరోధించడానికి తమ దేశంలోకి నగదు తెచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఒక వ్యక్తి కేవలం 20 వేల సింగపూర్ డాలర్లు మాత్రమే తనతో పాటు తీసుకెళ్లగలరు. మన రూపాయల్లో 12 లక్షల రూపాయలకు పైగా మీరు పట్టుకొని వెళ్లవచ్చు.

Whats_app_banner