Telugu News  /  Lifestyle  /  How Much Emergency Fund Should I Have
ప్రతీకాత్మక చిత్రం: అత్యవసర నిధి అందరికీ అవసరం
ప్రతీకాత్మక చిత్రం: అత్యవసర నిధి అందరికీ అవసరం (unsplash)

Emergency fund | ఎమర్జెన్సీ ఫండ్ ఎంత రిజర్వ్ చేసుకోవాలి? ఎలా లెక్కించాలి?

28 December 2021, 16:54 ISTPraveen Kumar Lenkala
28 December 2021, 16:54 IST

Emergency fund సడెన్‌గా జాబ్ లాస్ అయితేనో, వ్యాపారం మూసివేయాల్సి వస్తేనో ఆర్థికంగా కష్టాలు ప్రారంభమై కొద్ది నెలలు జీవితం శూన్యంగా కనిపించే ప్రమాదం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఫండ్ అవసరమవుతుంది. అంటే అత్యవసర పరిస్థితుల్లో వాడుకునే కంటింజెన్సీ ఫండ్ అన్న మాట.

ప్రతి ఒక్కరికి వారి వారి నెలవారీ వ్యయాలను బట్టి, వార్షికంగా చెల్లించాల్సిన  బీమా ప్రీమియం, ఇతర ఖర్చులను బట్టి ఎమర్జెన్సీ ఫండ్ రిజర్వ్ చేసుకోవాలి. ఎంత మేరకు రిజర్వ్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి? ఎలా లెక్కించాలో ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

ఖర్చుల అంచనా ఇలా..

మీకు నెలనెలా ఎంత ఖర్చులవుతాయో ముందు వాటిని గుర్తించండి. ఇందులో ప్రధానంగా ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు, లివింగ్ ఎక్స్‌పెన్సెస్ కామన్‌గా ఉండేవే.

ఇవే కాకుండా నెలనెలా హాస్పిటల్ ఖర్చులు, మెడిసిన్ ఖర్చులు, వెహికిల్ రిపేర్, ఇంటి నిర్వహణ ఖర్చులు కూడా ఉంటాయి.

ఇక జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంలు, వాహన బీమా, ఇంటి లోన్ బీమా ప్రీమియం ఎంత చెల్లించాల్సి ఉందో రాసి పెట్టుకోండి. అలాగే ఈఎంఐలు కూడా గుర్తుంచుకోండి. ఇంటి రుణం ఈఎంఐ గానీ, పర్సనల్ లోన్ ఈఎంఐ గానీ ఉంటే వాటిని కూడా నమోదు చేయండి.

ఎన్ని నెలల కోసం ఎమర్జెన్సీ ఫండ్ కావాలి?

ఖర్చులన్నీ రాసుకున్నారు కదా..  ఎన్ని నెలల కోసం ఎమర్జెన్సీ ఫండ్ కావాలో అంచనా వేయండి. సాధారణంగా జాబ్ లాస్ అయితే తిరిగి ఉద్యోగం పొందేందుకు కనీసం మూడు నెలల నుంచి ఆరు నెలల సమయం పడుతుంది.

సొంత వ్యాపారం కూడా మూతపడితే ఆ పరిస్థితి నుంచి కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పట్టొచ్చు.

అందువల్ల ఆరు నెలల పాటు అవసరమయ్యేలా ఎమర్జెన్సీ ఫండ్ రూపొందించుకోవడం మేలు.

ఇదిగో ఉదాహరణ

 

ఖర్చుల అంచనాఏడాదికి రూపాయల్లో
హాస్పిటల్, మెడిసిన్15,000
వాహన రిపేర్లు5,000
ఇంటి రిపేర్లు25,000
జీవిత బీమా ప్రీమియం50,000
ఆరోగ్య బీమా ప్రీమియం25,000
వాహన బీమా ప్రీమియం5,000
ఈఎంఐలు1,20,000
ఇంటి అద్దె, కిరాణా, ఇతరత్రా4,20,000
మొత్తం6,65,000

పైన పట్టికలో మీరు ఏడాదికి పెట్టే ఖర్చులు అని అంచనాకు వస్తే.. ఇందులో ఇంటి అద్దె, కిరాణా, ఈఎంఐలు తప్ప మిగిలినవన్నీ ఏడాదికి సరిపడా రిజర్వ్ చేసుకోవాల్సిందే. ఇక అద్దె, కిరాణా, ఈఎంఐలు ఆరు నెలలకు సరిపడా రూ. 2,10,000 రిజర్వ్ చేసుకోవాలి. హాస్పిటల్, మెడిసిన్, వాహన రిపేర్లు, ప్రీమియంలు రూ. 1,85,000 రిజర్వ్ చేసుకోవాలి. మొత్తంగా రూ. 3,95,000 

హోమ్ లోన్, హోమ్ లోన్ ఇన్సూరెన్స్ వంటివి ఉన్న వారు మరింత ఎక్కువగా కంటింజెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి.

కంటింజెన్సీ ఫండ్ త్వరగా లిక్విడిటీ ఉన్న పొదుపు మార్గాల్లో పెట్టుకోవాలి. అంటే అత్యవసర సమయాల్లో వెంటనే నగదు చేతికి వచ్చే సాధనాల్లో, అంటే సేవింగ్స్ ఖాతాల్లో, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోవచ్చు.

 

టాపిక్