Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరి ప్రదక్షిణ పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతుంది? ఎంత దూరం నడవాలి?
Arunachalam Giri Pradakshina: అరుణాచలం గిరి ప్రదక్షిణ అత్యంత విత్రమైనదిగా, పుణ్యకార్యంగా విశ్వసిస్తారు. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే, అరుణాచరం గిరి ప్రదక్షిణ కాలి నడకన పూర్తి చేసేందుకు ఎంత సయమం పడుతుందో.. ఎంత దూరమో ఇక్కడ తెలుసుకోండి.
తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైలోని అరుణాచల ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. అరుణాచల శివుడిని దర్శించుకుంటే సకల పాపలు తొలగుతాయని, మోక్షం సిద్ధిస్తుందనే విశ్వాసం ఉంది. పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటైన అరుణాల ఆలయాన్ని జీవితంలో కనీసం ఒక్కసారైనా ఆధ్యాత్మకవేత్తలు, పెద్దలు చెబుతుంటారు. అరుణాచలేశ్వరుడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ అత్యంత విశిష్టమైన అంశం. ఈ గిరి ప్రదక్షిణ వివరాలు ఇక్కడ చూడండి.
గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత
అరుణాచలంలో ఉన్న కొండ చుట్టూ తిరగడమే గిరి ప్రదక్షిణ. కొండ చుట్టూ కుడివైపుగా ప్రదక్షిణ చేయాలి. అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం వల్ల పాపాలు తొలగుతాయని, మోక్షం సిద్ధిస్తుందనే నమ్మకం భక్తుల్లో ఉంటుంది. ప్రదక్షిణ చేయడం వల్ల పునర్జన్మ నుంచి విముక్తి ఉంటుందని, స్వర్గం ప్రాప్తిస్తుందనే విశ్వాసం ఉంది. గిరి ప్రదక్షిణ కోసం వేసే ప్రతీ అడుగు సంతోషాన్ని పెంచుతుందని రమణ మహర్షి బోధించారు. గిరి ప్రదర్శనను మహోత్తర కార్యంగా చాలా మంది భావిస్తారు. ఇప్పటికీ కొందరు రుషులు ఈ గిరిలో ధ్యానం చేస్తూ ఉంటారనే విశ్వాసం కూడా ఉంది.
కొండ చుట్టూ ఎనిమిది లింగాలు
అరుణాచల గిరి చుట్టూ ఎనిమిది లింగాలు ఉంటాయి. గిరి ప్రదర్శన చేస్తూ వాటిని సందర్శించుకోవచ్చు. కొండ చుట్టూ ఇంద్ర లింగం, అగ్నిలింగం, యమలింగం, నిరూతి లింగం, వరుణ లింగం, వాయు లింగం, కుబేర లింగం, ఈశాన్య లింగం ఉంటాయి. ప్రతీ లింగానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.
దూరం, సమయం ఎంత?
అరుణాచల గిరి ప్రదక్షిణ పూర్తి చేసేందుకు సుమారు 14 కిలోమీటర్ల దూరం నడవాలి. గిరి ప్రదక్షిణను కాలి నడన పూర్తి చేసేందుకు సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. మౌనంగా కానీ, శివుడి నామాన్ని జపిస్తూ కానీ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయవచ్చు. గిరి ప్రదక్షిణ చేసేందుకు తెల్లవారుజామున 4 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరైన సమయంగా ఉంటుంది. గిరి ప్రదక్షిణను ఏరోజైన చేయవచ్చు. అయితే, పౌర్ణమి రోజు మరింత విశిష్టత ఉంటుందనే విశ్వాసం ఉంటుంది. అందుకే పౌర్ణమి రోజు సాధారణం కంటే భక్తులు ఎక్కువగా ప్రదక్షిణ చేస్తుంటారు.
గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఎనిమిది లింగాలను దర్శించుకోవాలి. ప్రదక్షిణ చేసేందుకు 14 కిలోమీటర్లు నడవలేని వారి కోసం ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇలా కూడా కొందరు గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తుంటారు.
ఎలా వెళ్లాలి?
తమిళనాడు రాజధాని చెన్నై నుంచి అరుణాచలం (తిరువణ్ణామలై) సుమారు 195 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. చెన్నై సహా వివిధ ప్రాంతాల నుంచి తిరువణ్ణామలైకు బస్సులు ఉంటాయి. రైలు ద్వారా అయితే.. తిరువణ్ణామలైలోనే రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడికి రైలు ద్వారా రావొచ్చు. కాట్పాడి జంక్షన్ కూడా అక్కడికి 95 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విమానం ద్వారా రావాలంటే ముందుగా చెన్నైలో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి తిరువణ్ణామలై రావాలి.
టాపిక్