Super blue moon: సూపర్ మూన్, బ్లూ మూన్, సూపర్ బ్లూ మూన్ మధ్య తేడా తెలుసుకోండి..
Super blue moon: పదేండ్లలో ఒకసారి కనిపించే సూపర్ బ్లూ మూన్ గురించి, అలాగే బ్లూమూన్, సూపర్ మూన్ మధ్య తేడాలేంటో తెలుసుకుందాం.
ఆగస్టు 1 తేదీన సూపర్ మూన్ చూసే అవకాశం వచ్చింది. ఇప్పుడు సూపర్ బ్లూ మూన్ చూడబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ అరుదైన దృశ్యం చూడటానికి ఎదరుచూసున్నారు. ఆగస్టు 30, అంటే ఈ రోజే రక్షాబంధన్ వేడుకల రోజే ఈ సూపర్ బ్లూ మూన్ చూసే అవకాశం కూడా వస్తోంది. ఇది ఈ నెలలో రెండో పూర్ణిమ. సూపర్ మూన్, బ్లూ మూన్ కాంబినేషన్ లో రావడమే సూపర్ బ్లూ మూన్ ప్రత్యేకత. నాసా ప్రకారం ఈ సూపర్ బ్లూ మూన్ సరాసరి పదేండ్లకోసారి వస్తుంది. కొన్ని సార్లు 20 ఏండ్లయినా రాకపోవచ్చు. మరికొన్ని సార్లు కొన్ని నెలల వ్యవధిలోనే కనిపించొచ్చు. దాని పేరు చెబుతున్నట్లుగానే అది నిండు చంద్రుని కన్నా 7 శాతం పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు సూపర్ బ్లూ మూన్, సూపర్ మూన్, బ్లూ మూన్ మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం.
బ్లూ మూన్ అంటే ఏంటి?
ఒకే నెలలో రెండు పూర్ణిమలు వచ్చినప్పుడు, రెండో పౌర్ణిమ రోజు చంద్రుణ్ని బ్లూ మూన్ అంటారు. చంద్రుడు భ్రమన కాలం 29.5 రోజులు. ఇది క్యాలెండర్ నెల కన్నా తక్కువ ఉన్నందున ఒక నెల ప్రారంభంలో పౌర్ణమి వస్తే, అదెే నెల చివర్లో మరో పౌర్ణమి వస్తుంది. అంటే ఈరోజే. ఇలా బ్లూ మూన్ ప్రతి 2-3 సంవత్సరాలకు వస్తుంది.
సూపర్ మూన్ అంటే ఏమిటి?
చంద్రుని కక్ష్య భూమికి దగ్గరగా ఉన్నప్పుడు, చంద్రుడు అదే సమయంలో నిండుగా ఉన్నప్పుడు సూపర్ మూన్ అంటాం. సాధారణ పౌర్ణమి కంటే సూపర్‌మూన్ పెద్దదిగా, ప్రకాశవంతంగా ఉంటుంది.
సూపర్ బ్లూ మూన్ అంటే ఏంటి?
చంద్రుడు భూమి చుట్టూ గుండ్రంగా కాకుండా దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతాడు. ప్రతినెలా చంద్రుడు భూమికి దగ్గరగా ఉండే బిందువు దగ్గరికి, దూరంగా ఉండే బిందువు దగ్గరికి వస్తాడు. భూమికి దగ్గరగా ఉండే బిందువుకు వచ్చినప్పుడు, అదే సమయంలో నిండు చంద్రుడిగా ఉంటే దాన్ని సూపర్ మూన్ అంటాం. ఈ సమయంలో చంద్రుడు పరిమాణంలో మరింత పెద్దదిగా, ప్రకాశ వంతంగా కనిపిస్తాడు. ఇలా ఒకే నెలలో రెండు సార్లు పౌర్ణిమ వస్తే, రెండో పౌర్ణమి నాటి చంద్రుణ్ని సూపర్ బ్లూ మూన్ అంటాం.
టాపిక్