Egg Hair Packs : మీ జుట్టు రాలుతుందా? అయితే మీ కోసం ఎగ్ హెయిర్ ప్యాక్స్
Egg Hair Packs Benefits In Telugu : నేడు జుట్టు రాలడం అనేది ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సాధారణ సమస్య. రకరకాల జుట్టు సమస్యలు ఉంటాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి సహజ నివారణలను ప్రయత్నించవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం..
జుట్టు రాలడం వివిధ కారణాల వల్ల వస్తుంది. కొంతమందికి ఇది పూర్తిగా హార్మోన్ల లేదా వంశపారంపర్య సమస్య అయినప్పటికీ, సహజ నివారణలు జుట్టు నష్టంతో పోరాడటానికి సహాయపడతాయి. మీ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అనేక సహజ పదార్థాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. గుడ్లు జుట్టు రాలడాన్ని ఎదుర్కోవడానికి అనుకూలమైన మార్గం. మృదువైన, మెరిసే జుట్టు కోసం గుడ్లు ఉపయోగించవచ్చు. జుట్టు రాలడం నుంచి బయటపడేందుకు 3 ఎగ్ హెయిర్ ప్యాక్స్ ట్రై చేయండి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఎగ్ హెయిర్ మాస్క్
ఎగ్ హెయిర్ మాస్క్.. జుట్టు రాలడం నుంచి బయటపడేందుుకు గుడ్లను ఉపయోగించే అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలలో ఒకటి. గుడ్డు హెయిర్ మాస్క్ కోసం కావలసినవి ఏంటంటే.. 2 గుడ్లు, 2 టేబుల్ స్పూన్లు ఆలివ్ నూనె, 1 టేబుల్ స్పూన్ తేనె. ఒక గిన్నెలోకి గుడ్లు పగలగొట్టి బాగా కలపాలి. ఆలివ్ ఆయిల్, తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. మీ జుట్టుకు హెయిర్ ప్యాక్ అప్లై చేసి బాగా మసాజ్ చేయండి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీరు, షాంపూతో మీ జుట్టును కడగాలి. ఉత్తమ ఫలితాల కోసం వారానికి ఒకసారి ఇలా చేయండి.
ఎగ్ వాష్ చేయడం
ఎగ్ వాష్‌తో మీ జుట్టును బ్రష్ చేయండి. ఇది స్కాల్ప్‌కు పోషణనిస్తుంది. మీ జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. 1 గుడ్డు, 1 కప్పు నీరు, కొద్దిగా నిమ్మరసం తీసుకోండి. ఒక గిన్నెలో గుడ్లను బాగా కలపాలి. దానికి నీరు వేసి బాగా మిక్స్ చేయాలి. కొన్ని చుక్కల నిమ్మరసాన్ని జోడించవచ్చు. మీ జుట్టుకు షాంపూ చేసి, కండిషనింగ్ చేసిన తర్వాత తలపై ఎగ్ వాష్‌ను పోసి సున్నితంగా మసాజ్ చేయండి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి. ఆపై జుట్టును చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.
గుడ్డు, పెరుగు హెయిర్ ప్యాక్
పెరుగు, గుడ్లు రెండూ మీ జుట్టు ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పెరుగుతో గుడ్లు కలపడం వల్ల జుట్టు రాలడాన్ని నిరోధించే, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే పోషకమైన హెయిర్ ప్యాక్ అందుతుంది. 2 గుడ్లు, 1/2 కప్పు పెరుగు తీసుకోండి. ఒక గిన్నెలో గుడ్డు కొట్టి బాగా కలిపిన తర్వాత అందులో పెరుగు వేయాలి. ఇది మెత్తని పేస్ట్ అయ్యే వరకు బాగా కలపాలి. ఈ హెయిర్ ప్యాక్‌ని హెయిర్ రూట్స్, స్కాల్ప్ అంతటా బాగా అప్లై చేయాలి. 30 నిమిషాల తరువాత, మీ జుట్టును గోరువెచ్చని నీరు, షాంపూతో బాగా కడగాలి. ఈ హెయిర్ ప్యాక్‌ని వారానికి ఒకసారి ఉపయోగించడం మంచిది.
గుడ్లు జుట్టు రాలడాన్ని ఎదుర్కోవడానికి సహజమైన, ప్రభావవంతమైన పరిష్కారాలను అందిస్తాయి. మీ జుట్టు సంరక్షణ దినచర్యలో గుడ్లు విలువైన పదార్థంగా ఉంటాయి. ఒకేసారి ట్రై చేసి.. అయ్యో ఇంకా అలానే ఉంది ఏంటి అనుకోవద్దు. కొన్ని రోజులు కంటిన్యూ చేయాలి.