Shaking legs: మీకు కాళ్ళు ఊపే అలవాటు ఉందా? ... అయితే ప్రమాదమే!-how does restless legs syndrome affect people with multiple ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Shaking Legs: మీకు కాళ్ళు ఊపే అలవాటు ఉందా? ... అయితే ప్రమాదమే!

Shaking legs: మీకు కాళ్ళు ఊపే అలవాటు ఉందా? ... అయితే ప్రమాదమే!

HT Telugu Desk HT Telugu

చాలా మందిలో కాళ్ళు ఊపే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు అంతా మంచిది కాదని నిపుణులు అంటున్నారు. గోడపై, కూర్చీపై ఇలా ఎక్కడ కూర్చున్నా కూడా రెండు కాళ్లు ఊపుతూ ఉంటారు. అయితే కొన్ని అసాధరణ సమయాలలో మన కంట్రోల్‌లో లేకుండా కాళ్ళు ఉగితూ ఉంటాయి. ఇలా ఊగడం అనారోగ్య సమస్యగా గుర్తించి వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు అంటున్నారు.

Shaking legs

మీకు అనవసరంగా కాళ్లు ఊపే అలవాటు ఉందా? అయితే ఈ అలవాటును రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఈ సమస్య వెనుక అనేక కారణాలు దాగి ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే ఏయే కారణాల వల్ల కాళ్లు ఊగుతాయో తెలుసుకోండి...

మద్యం అధికంగా వినియోగించడం కారణంగా

ఒక వ్యక్తి అతిగా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, శరీరం తెలికగా మారుతుంది. ఉంటుంది. ఈ సమయంలో మెదడులో డోపమైన్ పెరగడం ప్రారంభమవుతుంది ఈ కారణంగా కాళ్లు వణుకుతాయి.

ఆందోళన కారణంగా

ఒక వ్యక్తి ఆందోళన సమస్యకు గురైనప్పుడు, అతని శరీరం కంట్రోల్ తప్పి కాళ్ళ అనవసరంగా కదులుతూ ఉంటాయి. ఆందోళ‌న తగ్గగానే, అప్పుడు కాళ్లు క‌ద‌ల‌వ‌డం అనే స‌మ‌స్య కూడా ఆటోమేటిక్‌గా తగ్గుతుంది.

రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్

కాళ్లను కదిలించడం రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ లక్షణం కూడా కావచ్చు. ఈ సమస్య కారణంగా, వ్యక్తి తన పాదాలలో తిమ్మిరి అనుభూతి కలుగుతుంది. ఈ సమస్య తీవ్రంగా ఉండడం వల్ల వ్యక్తి నడవడానికి కూడా ఇబ్బంది పడతాడు.

విసుగు కలిగినప్పుడు

చుట్టూ ఉన్న వాతావరణం లేదా ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఫోన్,టీవీలో చూస్తూ నిమగ్నమైనప్పుడు కాళ్లు కదిలిస్తూ ఉంటారు. విసుగుగా అనిపించినప్పుడు, కలత చెందడం వల్ల తన కాళ్లను కదలడం ప్రారంభిస్తాడు. కాళ్లు కదపడం వల్ల మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది.

జన్యుపరమైన కారకాలు

అనవసరంగా కాళ్లు కదిలే సమస్య జన్యుపరమైన కారణాల వల్ల కూడా రావచ్చు. ఈ అలవాటును ఎసెన్షియల్ ట్రెమర్ అని కూడా అంటారు. ఈ సమస్య సంభవించినప్పుడు, ప్రభావితమైన అవయవాలను కదిలించడం ద్వారా కొంచెం ఉపశమనం పొందవచ్చు

సంబంధిత కథనం